iDreamPost
android-app
ios-app

Soumya Sarkar: చరిత్ర సృష్టించిన బంగ్లా ప్లేయర్! సచిన్ ఆల్ టైమ్ రికార్డు బ్రేక్!

  • Published Dec 20, 2023 | 5:28 PM Updated Updated Dec 20, 2023 | 5:28 PM

న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ క్రికెటర్ సౌమ్య సర్కార్ సచిన్ టెండుల్కర్ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఆ వివరాల్లోకి వెళితే..

న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ క్రికెటర్ సౌమ్య సర్కార్ సచిన్ టెండుల్కర్ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Soumya Sarkar: చరిత్ర సృష్టించిన బంగ్లా ప్లేయర్! సచిన్ ఆల్ టైమ్ రికార్డు బ్రేక్!

క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు దాదాపు సచిన్ రికార్డులను బద్దలు కొడుతూ వస్తున్నాడు విరాట్ కోహ్లీ. అయితే తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ నెలకొల్పిన ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్. న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో భారీ శతకంతో చెలరేగాడు బంగ్లా ఓపెనర్. ఈ క్రమంలోనే సచిన్ టెండుల్కర్ 14 ఏళ్ల క్రితం నెలకొల్పిన ఆల్ టైమ్ రికార్డు ఈ భారీ సెంచరీతో బద్దలైంది. ఈ రికార్డుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

న్యూజిలాండ్-బంగ్లాదేశ్ మధ్య మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ సాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా నెల్సన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో సచిన్ ఆల్ టైమ్ రికార్డు బద్దలైంది. గత రెండేళ్లుగా ఫామ్ లో లేని బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్యా సర్కార్ ఈ మ్యాచ్ లో భారీ శతకంతో చెలరేగాడు. 151 బంతులు ఎదుర్కొని 22 ఫోర్లు,2 సిక్స్ లతో 169 పరుగులు చేశాడు. సౌమ్యా సర్కార్ వన్డే కెరీర్ లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం. బంగ్లా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన రెండో బ్యాటర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు సర్కార్. ఈ లిస్ట్ లో 176 రన్స్ బాది అగ్రస్థానంలో ఉన్నాడు లిట్టన్ దాస్.

ఇక ఈ భారీ శతకంతో సచిన్ క్రియేట్ చేసిన అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు సౌమ్య సర్కార్. న్యూజిలాండ్ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ఆసియా క్రికెటర్ గా ఇప్పటి వరకు సచిన్ ఉండగా.. తాజాగా ఆ రికార్డును బద్దలు కొట్టాడు బంగ్లా ఓపెనర్. 2009లో క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై 163 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు మాస్టర్ బ్లాస్టర్. తాజాగా కివీస్ తో జరిగిన రెండో వన్డేలో ఈ రికార్డును బద్దలు కొట్టి.. కొత్త చరిత్రను లిఖించాడు.

మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.5 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 46.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జట్టులో విల్ యంగ్(89), నికోల్స్(95) పరుగులతో రాణించి.. జట్టుకు అద్బుత విజయాన్ని అందించారు. ఇక ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది న్యూజిలాండ్. మరి ఈ మ్యాచ్ లో సచిన్ 14 ఏళ్ల క్రితం నెలకొల్పిన రికార్డును బంగ్లా ఓపెనర్ బద్దలు కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.