iDreamPost
android-app
ios-app

Somerset: వీడియో: స్టన్నింగ్ మూమెంట్.. వాటే ఫీల్డ్ సెటప్! పిచ్చొళ్లు అయిపోయారు!

  • Published Sep 13, 2024 | 4:13 PM Updated Updated Sep 13, 2024 | 4:13 PM

13 players in one frame: ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ లో ఓ స్టన్నింగ్ మూమెంట్ నమోదు అయ్యింది. ఫీల్డర్లు మెుత్తం బ్యాటర్ చుట్టూ చేరిపోయారు. ఆ వీడియో వైరల్ గా మారింది.

13 players in one frame: ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ లో ఓ స్టన్నింగ్ మూమెంట్ నమోదు అయ్యింది. ఫీల్డర్లు మెుత్తం బ్యాటర్ చుట్టూ చేరిపోయారు. ఆ వీడియో వైరల్ గా మారింది.

Somerset: వీడియో: స్టన్నింగ్ మూమెంట్.. వాటే ఫీల్డ్ సెటప్! పిచ్చొళ్లు అయిపోయారు!

క్రికెట్ మ్యాచ్ ల్లో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ.. ప్రత్యర్థి వ్యూహాలను చిత్తు చేస్తూ ముందుకు సాగుతుంటాయి ఇరు జట్లు. ఈ క్రమంలోనే కొన్ని అరుదైన సంఘటనలు, సన్నివేశాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. తాజాగా ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ లో ఓ విచిత్రమైన సన్నివేశం చోటుచేసుకుంది. సోమర్ సెట్ వర్సెస్ సర్రే జట్ల మధ్య జరిగిన మ్యాచ్.. చివరి నిమిషం వరకు నరాలు తెగే ఉత్కంఠతతో సాగింది. ఈ క్రమంలోనే సోమర్ సెట్ ఫీల్డింగ్ సెటప్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యింది. అసలేం జరిగిందంటే?

కౌంటీ ఛాంపియన్ షిప్ లో భాగంగా తాజాగా సోమర్ సెట్ వర్సెస్ సర్రే జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సోమర్ సెట్ 219 పరుగుల టార్గెట్ ను ప్రత్యర్థి ముందు ఉంచింది. ఇక సర్రే జట్టు 109/9తో నిలిచింది. కాగా.. మ్యాచ్ చివరి రోజు మరో మూడు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా సోమర్ సెట్ మాస్టర్ ప్లాన్ వేసింది. ఎలాగైనా ఉన్న వికెట్ ను తీయాలని భావించి ఫీల్డర్లందరినీ బ్యాటర్ చుట్టూ మోహరించింది. కీపర్, బౌలర్ కాకుండా ఉన్న 9 మంది ఫీల్డర్లు బ్యాటర్ చుట్టూనే సెట్ చేసింది. దాంతో టెన్షన్ కు గురైన సర్రే బ్యాటర్ వార్రల్.. లీచ్ వేసిన బంతిని అడ్డుకునే క్రమంలో ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో సర్రే టీమ్ 109 రన్స్ కే ఆలౌట్ అయ్యి, 111 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Felding for Batsman

కాగా.. సోమర్ సెట్ టీమ్ కు చెందిన 11 మంది సభ్యులతో పాటుగా ఇద్దరు బ్యాటర్లు.. మెుత్తం 13 మంది ప్లేయర్లు ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. ఈ స్టన్నింగ్ మూమెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా రేర్ సందర్భాల్లో మాత్రమే ఇలాంటి ఫీల్డింగ్ సెటప్ కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ సెటప్ చూసిన క్రికెట్ అభిమానులు పిచ్చోళ్లు అయిపోతున్నారు. వాటే ఫీల్డింగ్ సెటప్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సోమర్ సెట్ తొలి ఇన్నింగ్స్ లో 317 రన్స్, రెండో ఇన్నింగ్స్ లో 224 పరుగులు చేసింది. సర్రే టీమ్ తొలి ఇన్నింగ్స్ లో 321, సెకండ్ ఇన్నింగ్స్ లో 109 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. మరి మ్యాచ్ ముగిసే చివరి మూడు నిమిషాల్లో అద్భుతమైన ఫీల్డ్ సెటప్ తో విజయం సాధించిన సోమర్ సెట్ టీమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.