Nidhan
సరదాగా క్రికెట్ ఆడేందుకు పోతే ఏకంగా ప్రాణాలు పోయాయి. ఫ్రెండ్స్‌తో కలసి క్రికెట్ ఆడుతున్న ఓ టెకీ గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు.
సరదాగా క్రికెట్ ఆడేందుకు పోతే ఏకంగా ప్రాణాలు పోయాయి. ఫ్రెండ్స్‌తో కలసి క్రికెట్ ఆడుతున్న ఓ టెకీ గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు.
Nidhan
సాఫ్ట్వేర్ కంపెనీలో అతడు ఉద్యోగి. వర్క్ చేయడం, కుదిరితే అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌తో కలసి క్రికెట్ ఆడటం అతడికి అలవాటు. ఈ క్రమంలో మరోమారు అలాగే క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. స్నేహితులతో కలసి మ్యాచ్ ఆడుతూ బాగా ఎంజాయ్ చేశాడు. అంతా బాగుందనుకున్న తరుణంలో హఠాత్పరిణామం చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతున్న ఆ యువకుడు తలనొప్పి రావడంతో ఆట మధ్యలోనే బయటకు వచ్చేశాడు. దీంతో హెల్త్ బాగోలేదని అంతా అనుకున్నారు. కానీ ఆ కాసేపటికీ టెకీ ఉన్నచోటే కుప్పకూలాడు. ఫ్రెండ్స్ అంతా కలసి అతడ్ని ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రాణాలు దక్కలేదు.
క్రికెట్ ఆడుతూ సంజయ్ భార్గవ్ (25) అనే యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. టీసీఎస్‌లో వర్క్ చేస్తున్న సంజయ్.. మహేశ్వరంలోని ఘట్టుపల్లి కేసీఆర్ స్టేడియంలో మిత్రులతో కలసి సరదగా క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. అయితే ఆడుతున్న టైమ్‌లో తలనొప్పి రావడంతో మధ్యలోనే బయటకు వచ్చేశాడు. ఆ సమయంలో ఫిట్స్ కూడా రావడంతో అతడ్ని ఆస్పత్రికి తరలించారు ఫ్రెండ్స్. కానీ గుండెపోటుతో సంజయ్ మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. ఈ మధ్య సడన్, సైలెంట్ హార్ట్ ఎటాక్స్ పెరిగిన సంగతి తెలిసిందే. వీటి బారిన పడి పెద్దలే కాదు పిల్లలు, యువకులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో తాజాగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కన్నుమూయడం చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: గుజరాత్ టైటాన్స్ ఆటగాడికి యాక్సిడెంట్.. టీమిండియాలోకి వస్తాడనుకుంటే..!