iDreamPost
android-app
ios-app

కోహ్లీ మాట వినలేదు! కప్పు గెలిచిన తర్వాత మంధాన షాకింగ్‌ స్టేట్‌మెంట్‌

  • Published Mar 18, 2024 | 5:34 PM Updated Updated Mar 18, 2024 | 5:34 PM

Smriti Mandhana, Virat Kohli: డబ్ల్యూపీఎల్‌ ఛాంపియన్‌గా ఆర్సీబీ నిలిచిన విషయం తెలిసిందే. అయితే.. కప్పు కొట్టిన తర్వాత.. కెప్టెన్‌ స్మృతి మంధాన చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Smriti Mandhana, Virat Kohli: డబ్ల్యూపీఎల్‌ ఛాంపియన్‌గా ఆర్సీబీ నిలిచిన విషయం తెలిసిందే. అయితే.. కప్పు కొట్టిన తర్వాత.. కెప్టెన్‌ స్మృతి మంధాన చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 18, 2024 | 5:34 PMUpdated Mar 18, 2024 | 5:34 PM
కోహ్లీ మాట వినలేదు! కప్పు గెలిచిన తర్వాత మంధాన షాకింగ్‌ స్టేట్‌మెంట్‌

ఆర్సీబీ అభిమానుల చిరకాల కోరిక తీరుస్తూ.. ఆర్సీబీ ఉమెన్స్‌ టీమ్‌ డబ్ల్యూపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచింది. స్మృతి మంధాన కెప్టెన్సీలోని జట్టు.. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌తో జరిగిన ఫైనల్‌లో విజయం సాధించి.. ‘ఈ సాలా కప్‌ నమ్‌దే’ నినాదాన్ని నిజం చేసి చూపించింది. ఐపీఎల్‌లో 16 ఏళ్లుగా టైటిల్‌ కోసం పోరాటం చేస్తున్న మెన్స్‌ టీమ్‌కు సాధ్యం కానిది.. కేవలం డబ్ల్యూపీఎల్‌ రెండో సీజన్‌లోనే ఆర్సీబీ ఉమెన్స్‌ టీమ్‌ కప్పు కొట్టి.. ఆర్సీబీ అభిమానులను తలెత్తుకునేలా చేసింది. అయితే.. ఈ కప్పు గెలిచిన తర్వాత ఆర్సీబీ కెప్టెన్‌ స్మృతి మంధాన ఒక ఆసక్తికర వ్యాఖ్య చేసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్‌లో నెగ్గిన తర్వాత.. విరాట్‌ కోహ్లీ ఆ టీమ్‌ సపోర్టింగ్‌ స్టాఫ్‌కు వీడియో కాల్‌ చేశాడు. ఆర్సీబీ టీమ్స్‌ మెంబర్స్‌తో పాటు కెప్టెన్‌ స్మృతి మంధానతో కూడా కోహ్లీ చాలా సేపు వీడియో కాల్‌లో మాట్లాడాడు. అయితే.. ఆ టైమ్‌లో కోహ్లీ మాటలు తాను వినలేదని, స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో మారుమోగిపోతుండటందో కోహ్లీ ఏం చెప్పాడో తనకు వినిపించలేదని, కానీ, కోహ్లీ థంబ్‌ చూపిస్తూ.. తమను అభినందించాడని, తాను కూడా థంబ్‌ చూపించానని మంధాన పేర్కొంది. అయితే ఆ సమయంలో కోహ్లీ ఫేస్‌ వెలిగిపోయిందని చెప్పింది స్మృతి.

అయితే.. గతేడాది డబ్ల్యూపీఎల్‌ సమయంలో విరాట్‌ కోహ్లీ వెళ్లి ఉమెన్‌ క్రికెటర్లతో మాట్లాడిన విషయం తెలిసిందే. డబ్ల్యూపీఎల్‌ సమయంలో ఆర్సీబీ టీమ్‌తో ఇంట్రాక్ట్‌ అయిన కోహ్లీ.. తన అనుభవాలను, గేమ్‌ టెక్నిక్స్‌ను వారితో పంచుకున్నాడు. అది తమకు ఎంతో కలిసొచ్చిందని కూడా ఆర్సీబీ కెప్టెన్‌ స్మృతి మంధాన పేర్కొంది. కోహ్లీ తన విలువైన సమయాన్ని తమతో పంచుకున్నాడని, కోహ్లీ ఇచ్చిన సలహాలు, సూచనలు తమకెంతో ఉపయోగపడ్డాయని కూడా మంధాన తెలిపింది. మరి కోహ్లీ వీడియో కాల్‌ మాటలు వినిబడకపోయినా.. ఇంట్రాక్షన్‌ సమయంలో చెప్పింది విని కప్పు కొట్టినందుకు సంతోషంగా ఉందని ఫ్యాన్స్‌ అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.