152 కి.మీ. స్పీడ్​తో బౌలింగ్ వేసిన SRH పేసర్.. ఇక ఐపీఎల్​లో తగ్గేదేలే!

  • Author singhj Published - 07:07 PM, Tue - 31 October 23

సన్​రైజర్స్ హైదరాబాద్ యంగ్ పేసర్ వేసిన ఒక బాల్ ఏకంగా 152 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తింది. అతడి బౌలింగ్​కు ఫిదా అయిన ఫ్యాన్స్.. ఐపీఎల్​లో ఇక రచ్చరచ్చే అంటున్నారు.

సన్​రైజర్స్ హైదరాబాద్ యంగ్ పేసర్ వేసిన ఒక బాల్ ఏకంగా 152 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తింది. అతడి బౌలింగ్​కు ఫిదా అయిన ఫ్యాన్స్.. ఐపీఎల్​లో ఇక రచ్చరచ్చే అంటున్నారు.

  • Author singhj Published - 07:07 PM, Tue - 31 October 23

క్రికెట్​లో బ్యాటింగ్ ఎంత ఇంపార్టెంటో బౌలింగ్ కూడా అంతే ముఖ్యమనేది తెలిసిందే. బౌలర్లు మ్యాచ్​లు గెలిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఎందుకో గానీ బ్యాటర్లకు వచ్చినంత నేమ్, ఫేమ్ బౌలర్లకు రాలేదనే చెప్పాలి. కొద్ది మంది క్రికెటర్లను మినహాయిస్తే ఎక్కువగా బ్యాట్స్​మన్​కే ఫేమ్ వచ్చిందని చెప్పాలి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లాంటి వాటిల్లోనూ బ్యాటర్లను రూ.కోట్లకు కోట్లు పెట్టి కొనుగోలు చేస్తుంటాయి ఫ్రాంచైజీలు. క్రికెట్​లో ఇప్పుడంతా బ్యాటర్లదే రాజ్యం. పిచ్​లు బ్యాటింగ్ ఫ్రెండ్లీగా మారిపోవడం, పవర్ ప్లేలో కొత్త రూల్స్ వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది.

క్రికెట్​ మ్యాచ్​లకు జనాలు రావాలంటే భారీ స్కోర్లు నమోదవ్వాలి. అందుకోసం బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్లు ఉండాలని కొందరు అనుకోవడం వల్లే బౌలర్ల పరిస్థితి ఇలా తయారైంది. అయితే అసలైన క్రికెట్ మజా అంతా బ్యాటర్లకు, బౌలర్లకు మధ్య మంచి కాంపిటీషన్ ఉంటేనే సాధ్యమనే చిన్న లాజిక్​ను మాత్రం మర్చిపోతున్నారు. అటు బ్యాటర్లతో పాటు ఇటు బౌలర్లకు కూడా పిచ్ సహకరిస్తే.. రూల్స్ ఇద్దరికీ సమానంగా ఉంటే మ్యాచ్​లు చివరి ఓవర్ వరకు వెళ్లడం ఖాయం. అప్పుడు పాపులారిటీలో బ్యాటర్లతో బౌలర్లు కూడా సమానంగా ఉంటారని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఎంత బ్యాటింగ్ గేమ్​గా మారినా కొందరు ప్లేయర్లు తమ బౌలింగ్​తో అందర్నీ ఆకట్టుకుంటున్నారు.

జస్​ప్రీత్ బుమ్రా లాంటి పేసర్లు, కుల్దీప్ యాదవ్ లాంటి స్పిన్నర్లు ఎలాంటి వికెట్​ మీదైనా రాణిస్తున్నారు. పేసర్లలో బుమ్రా అయితే 140 కి.మీ.లకు తగ్గకుండా వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. అవసరమైనప్పుడు స్పీడ్ తగ్గిస్తూ స్వింగింగ్ డెలివరీస్​తో వికెట్లు తీస్తున్నాడు. అతడి యార్కర్లు, బౌన్సర్ల గురించి చెప్పనక్కర్లేదు. అయితే బుమ్రా మాదిరిగా బౌలింగ్ చేసే యంగ్ బౌలర్స్ టీమిండియాలో కనిపించడం లేదు. ఉమ్రాన్ మాలిక్ లాంటి యంగ్​స్టర్ ఉన్నా.. అతడి బౌలింగ్​లో స్పీడ్ తప్ప పదును, కచ్చితత్వం లోపించాయి. అయితే భారత జట్టులో చోటు సంపాదించే సత్తా ఉన్న యువ బౌలర్లలో ఒకడిగా కార్తీక్ త్యాగిని చెప్పొచ్చు.

ఐపీఎల్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడే కార్తీక్ త్యాగి.. మంచి వేగంతో బాల్స్ సంధిస్తుంటాడు. అయితే అతడు మరింత రాటుదేలి, వేరియేషన్స్​ నేర్చుకుంటే టీమిండియాలో చోటు దక్కే ఛాన్స్ ఉంది. తాజాగా మరోమారు తన సత్తా ఏంటో చూపించాడు కార్తీక్ త్యాగి. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఉత్తర్​ప్రదేశ్​ తరఫున బరిలోకి దిగిన త్యాగి.. గుజరాత్​తో మ్యాచ్​లో ఏకంగా 152 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసి అందర్నీ షాక్​కు గురిచేశాడు. ఈ మ్యాచ్​లో అతడు 21 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. త్యాగి స్పీడ్​ను నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. స్పీడ్​తో పాటు లైన్ అండ్ లెంగ్త్, వేరియేషన్స్​తో వేయగలిగితే బుమ్రాకు వారసుడు అవుతాడని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్​లో త్యాగి బౌలింగ్​లో తగ్గేదేలే అంటున్నారు. మరి.. కార్తీక్ త్యాగి బౌలింగ్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పాక్​ టీమ్​పై రమీజ్ రాజా సెటైర్స్.. తనకు నవ్వొస్తోందంటూ..!

Show comments