iDreamPost
android-app
ios-app

టీ20 వరల్డ్ కప్ 2007 ఫైనల్, 2024 ఫైనల్ మ్యాచ్ లను గమనించారా? సేమ్ టు సేమ్..

  • Published Jul 03, 2024 | 1:49 PM Updated Updated Jul 03, 2024 | 1:49 PM

టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ కు టీమిండియా 2007లో గెలిచిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కు మధ్య ఎన్నో యాదృచ్చికమైన సంఘటనలు ఉన్నాయి. ఆ వివరాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే.

టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ కు టీమిండియా 2007లో గెలిచిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కు మధ్య ఎన్నో యాదృచ్చికమైన సంఘటనలు ఉన్నాయి. ఆ వివరాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే.

టీ20 వరల్డ్ కప్ 2007 ఫైనల్, 2024 ఫైనల్ మ్యాచ్ లను గమనించారా? సేమ్ టు సేమ్..

కాకతాళీయమో.. యాదృచ్చికమో.. కొన్ని సంఘటనలు జరిగిన తీరు ఒకే విధంగా ఉంటుంది. అయితే ఇది ఏ ఒక్క రంగానికో పరిమితం కాదు. చాలా రంగాల్లో సేమ్ టు సేమ్ జరిగిన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. తాాజాగా ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ కు టీమిండియా 2007లో గెలిచిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కు మధ్య ఎన్నో యాదృచ్చికమైన సంఘటనలు ఉన్నాయి. ఆ వరల్డ్ కప్ లో నమోదు అయిన గణాంకాలే.. అచ్చం అలాగే ఈ ప్రపంచ కప్ ఫైనల్లో కూడా రిపీట్ అయ్యాయి. దాంతో క్రీడా నిపుణులు, క్రికెట్ లవర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

టీ20 వరల్డ్ కప్ 2024ను కైవసం చేసుకుని వరల్డ్ ఛాంపియన్స్ గా నిలవడం ద్వారా.. టీమిండియా తన 13 ఏళ్ల నిరీక్షణకు తెరదింపింది. ఈ టోర్నీ ప్రారంభం నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత్.. అదే ఊపుతో ప్రపంచ కప్ ను ముద్దాడింది. ఇక్కడ ఓ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు.. ఈ ఫైనల్ మ్యాచ్ కు మధ్య దగ్గరి సంబంధాలు ఉన్నాయి. అచ్చం ఆ మ్యాచ్ లో జరిగినట్లుగానే కొన్ని సంఘటనలు ఈ మ్యాచ్ లో నమోదు కావడం విశేషం. అవేంటంటే?

టీ20 వరల్డ్ కప్ 2007 విశేషాలు:

  • ఫైనల్ మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన గౌతమ్ గంభీర్(75) పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.
  • 6వ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన రోహిత్ శర్మ 16 బంతుల్లో 30 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
  • ఈ మ్యాచ్ లో 13 ఓవర్లకు టీమిండియా 2 వికెట్లు నష్టపోయి 98 పరుగులు చేసింది.
  • లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అత్యధిక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు(47 పరుగులు).
  • 10 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ ఆధిక్యంలో ఉన్నట్లు కనిపించింది.
  • ఒక స్పిన్నర్(హర్భజన్) ఒకే ఒవర్లో 19 పరుగులు సమర్పించుకున్నాడు.
  • లెఫ్ట్ హ్యాండ్ పేసర్ బ్యాటర్ కమ్ కెప్టెన్ వికెట్ తీశాడు.
  • జోగిందర్ శర్మ 12 డాట్ బాల్స్ వేసి 2 వికెట్లు తీశాడు.
  • ఈ మ్యాచ్ లో ఇండియా 8 సిక్సులు కొట్టింది.
  • అలాగే చివరి 5 ఓవర్లలో 4 వికెట్లు తీసుకుంది.
  • ప్రత్యర్థి తన చివరి వికెట్ ను క్యాచ్ రూపంలో ఇచ్చి ఔట్ అయ్యాడు.

2007 వరల్డ్ కప్ లో జరిగినట్లే.. టీ20 వరల్డ్ కప్ 2024లో జరిగిన విశేషాలు:

  • ఇండియన్ ఓపెనర్ విరాట్ కోహ్లీ 76 రన్స్ చేయడం.
  • 6వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన దూబే 16 బంతుల్లో 27 పరుగుల ఇన్నింగ్స్ ఆడటం.
  • 13 ఓవర్లు ముగిసే సరికి ఇండియా 3 వికెట్లు నష్టపోయి 98 పరుగులు చేసింది.
  • లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్(అక్షర్ పటేల్, 47 రన్స్) అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పడం.
  • 10 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా ముందంజలో ఉండటం.
  • ఓ టీమిండియా స్పిన్నర్(అక్షర్) ఒకే ఓవర్లో 24 పరుగులు ఇచ్చాడు.
  • లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బ్యాటర్ కమ్ కెప్టెన్ ను ఔట్ చేశాడు.
  • జోగిందర్ శర్మ లాగే అర్షదీప్ సింగ్ 12 డాట్ బాల్స్ వేసి.. 2 వికెట్లు తీశాడు.
  • ఆ మ్యాచ్ లో లాగే ఈ మ్యాచ్ లో కూడా ఇండియా 8 సిక్సులు కొట్టింది.
  • చివరి 5 ఓవర్లలో నాలుగు వికెట్లు తీసింది.
  • 2007 వరల్డ్ కప్ లో ప్రత్యర్థి లాస్ట్ వికెట్ క్యాచ్ అవుట్ కాగా.. ఈ మ్యాచ్ లో కూడా అలాగే జరిగింది.

కాగా.. పైన తెలిపిన ఇన్ని అంశాలు ఒకే విధంగా జరగడం నిజంగా కో-ఇన్సిడెంట్ అనే చెప్పాలి. మరి రెండు వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఇలా ఒకే విధంగా జరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by cricket.com (@cricket.com_official)