iDreamPost
android-app
ios-app

వీడియో: పంత్ పరువు తీసిన చాహల్! ఒక్కసారే అంత మాట అనేశాడేంటి?

  • Published Jul 03, 2024 | 11:15 AM Updated Updated Jul 03, 2024 | 11:15 AM

Rishabh Pant, Yuzvendra Chahal: టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రిషబ్ పంత్, యుజ్వేంద్ర చాహల్ మధ్య ఓ ఫన్నీ సీన్ జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Rishabh Pant, Yuzvendra Chahal: టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రిషబ్ పంత్, యుజ్వేంద్ర చాహల్ మధ్య ఓ ఫన్నీ సీన్ జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

  • Published Jul 03, 2024 | 11:15 AMUpdated Jul 03, 2024 | 11:15 AM
వీడియో: పంత్ పరువు తీసిన చాహల్! ఒక్కసారే అంత మాట అనేశాడేంటి?

13 ఏళ్ల తర్వాత టీమిండియా ప్రపంచ కప్ ను ముద్దాడింది. దాంతో ఆటగాళ్ల ఆనందం అంబరాన్ని తాకింది. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత గ్రౌండ్ లోనే చిన్నపిల్లల్లా మారిపోయి కన్నీరు పెట్టుకున్నారు. తమ సంతోషాన్ని సహచర ఆటగాళ్లతో, ఫ్యామిలీ మెంబర్స్ తో పంచుకున్నారు. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ ను టీజ్ చేశాడు యుజ్వేంద్ర చాహల్. దాంతో ఒక్కసారే అంతమాట అనేశావ్ ఏంటి బ్రో? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఏం జరిగిందంటే?

టీ20 ప్రపంచ కప్ గెలుచుకున్న తర్వాత ఆటగాళ్లు తమ ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ స్టార్ స్పోర్ట్స్ తో తమ అనుభవాలను పంచుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో రిషబ్ పంత్ మాట్లాడుతూ..” ఫైనల్ మ్యాచ్ కు ముందు ఆటగాళ్లందరిలో ఒకటే ఆలోచన.. వరల్డ్ కప్ ను ఎలా గెలవాలి? ప్రపంచ కప్ ను గెలవాలనే ఆలోచనతోనే టీమ్ మెుత్తం ముందుకెళ్లాం” అని చెబుతుండగా.. మధ్యలో యుజ్వేంద్ర చాహల్ మైక్ అందుకుని.. “అయితే ఫైనల్ మ్యాచ్ లో నువ్వెందుకు బాగా ఆడలేదు” అని ఒక్కసారిగా అనేసరికి అక్కడ అందరూ నవ్వులు చిందించారు. పంత్ చిన్నమెుఖం వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా.. చాహల్ తనదైన చిలిపి చేష్టలు, మాటలతో క్రికెట్ లో ఓ ఎంటర్ టైనర్ గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు బ్రో ఒక్కసారే అంత మాట అనేశావ్ ఏంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫైనల్ మ్యాచ్ లో డకౌట్ గా వెనుదిరిగాడు రిషబ్ పంత్. గతంలో ఓ రిపోర్టర్ ఆండ్రీ రస్సెల్ ను ఇలాగే అడుగుతాడు. ఆ వీడియో అప్పుడు వైరల్ గా మారింది. దాన్నిగుర్తుపెట్టుకున్న చాహల్ ఇలా కామెడీగా పంత్ పరువుతీశాడు. మరి ఈ ఫన్నీ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by 70xedits (@70x.edits)

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet