iDreamPost
android-app
ios-app

ఇండియా-పాక్ మ్యాచ్! కొన్ని గంటల ముందే భారత్‌కి గుడ్ న్యూస్!

  • Published Oct 12, 2023 | 4:19 PM Updated Updated Oct 12, 2023 | 4:19 PM
  • Published Oct 12, 2023 | 4:19 PMUpdated Oct 12, 2023 | 4:19 PM
ఇండియా-పాక్ మ్యాచ్! కొన్ని గంటల ముందే భారత్‌కి గుడ్ న్యూస్!

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టుతో పాటు పసికూన ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించి.. మంచి జోరు మీదుంది. అయితే.. ఈ వరల్డ్‌ కప్‌ టోర్నీకే హైలెట్‌గా నిలిచే మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియంలో భారత్‌-పాకిస్థాన్‌ జట్లు తలపడనున్నాయి. ఈ హైఓల్టేజ్‌ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి ఈ దాయాదుల పోరు జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌ ఆరంభానికి ముందే టీమిండియా క్రికెట్‌ అభిమానులకు ఓ గుడ్‌న్యూస్‌ అందింది.

ఇప్పటికే వన్డే వరల్డ్‌ కప్స్‌లో ఇండియా-పాకిస్థాన్‌ జట్లు 7 సార్లు తలపడగా.. 7కి 7 కూడా ఇండియానే గెలిచింది. భారత్‌పై తొలి విజయం సాధించేందుకు బాబర్‌ సేన సంసిద్ధం అవుతుంది. అదే క్రమంలో తమ విన్నింగ్‌ రేట్‌ను 8-0కు పెంచుకునేందుకు రోహిత్‌ సేన ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో టీమిండియాకు మరింత బూస్ట్‌ప్‌ ఇచ్చేలా ఓ గుడ్‌న్యూస్‌ అందింది. అదేంటంటే.. యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ పూర్తిగా కోలుకుంటూ పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. తీవ్ర జ్వరం కారణంగా గిల్‌.. వరల్డ్‌ కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో లేని విషయం తెలిసిందే.

వరల్డ్‌ కప్‌కు ముందు భీకర ఫామ్‌లో ఉన్న గిల్‌.. ఈ వరల్డ్‌ కప్‌లో టీమిండియాకు కీ ప్లేయర్‌ అవుతాడని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా డెంగ్యూ బారిన పడిన గిల్‌.. ఆస్పత్రిలో కూడా చేరాడు. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌తో ఆడిన మ్యాచ్‌లో అందుబాటులో లేడు. ప్రస్తుతం జ్వరం నుంచి పూర్తిగా కోలుకుని, నెట్స్‌లో ప్రాక్టీస్‌ కూడా చేస్తున్నట్లు సమాచారం. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు మరో రోజు సమయం ఉండటంతో గిల్‌ పూర్తిగా ఫిట్‌ అయి.. మ్యాచ్‌ ఆడే అవకాశం ఉంది. పాకిస్థాన్‌పై టీమిండియా ది బెస్ట్‌ టీమ్‌తో బరిలోకి దిగితే.. రోహిత్‌ సేనను అడ్డుకోవడం పాక్‌కు తలకుమించిన భారం అవుతుందనడంలో సందేహం లేదు. మరి గిల్‌ తిరిగి టీమ్‌లోకి వస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఇండియా మ్యాచ్​పై మైకేల్ వాన్ సెటైర్స్.. ఇచ్చిపడేసిన ఫ్యాన్స్!