Nidhan
Shubman Gill Weakness Exposed: యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ తక్కువ టైమ్‌లోనే టీమిండియాలో పర్మినెంట్ ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ కీలక ప్లేయర్‌గా ఎదిగాడు. అతడి టాలెంట్ చూసి లిమిటెడ్ ఓవర్స్‌కు వైస్ కెప్టెన్‌ను కూడా చేశారు.
Shubman Gill Weakness Exposed: యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ తక్కువ టైమ్‌లోనే టీమిండియాలో పర్మినెంట్ ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ కీలక ప్లేయర్‌గా ఎదిగాడు. అతడి టాలెంట్ చూసి లిమిటెడ్ ఓవర్స్‌కు వైస్ కెప్టెన్‌ను కూడా చేశారు.
Nidhan
యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ తక్కువ టైమ్‌లోనే టీమిండియాలో పర్మినెంట్ ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ కీలక ప్లేయర్‌గా ఎదిగాడు. భారీగా పరుగుల వరద పారించి ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటాడు. కన్సిస్టెంట్గా రన్స్ చేయడం, టీమ్ కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడి యాంకర్ ఇన్నింగ్స్‌లు ఆడటం, మ్యాచ్ మ్యాచ్‌కు ఇంప్రూవ్ అవుతూ తోపు బ్యాటర్‌గా ఎదుగుతుండటంతో అతడికి బీసీసీఐ ప్రమోషన్ ఇచ్చింది. అతడి టాలెంట్ చూసి టీ20లు, వన్డేలకు వైస్ కెప్టెన్‌ను చేసింది. కానీ కొన్నాళ్లుగా అంచనాలను అందుకోలేకపోతున్న గిల్.. మరోమారు నిరాశపర్చాడు. దులీప్ ట్రోఫీ-2024 ఫస్ట్ మ్యాచ్‌లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇండియా బీతో జరుగుతున్న మ్యాచ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు గిల్.
బ్యాటింగ్‌లో గిల్ వీక్నెస్ ఇవాళ మరోమారు బయటపడింది. ఇండియా బీతో జరుగుతున్న మ్యాచ్‌లో అతడు ఔట్ అయిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇన్నింగ్స్‌ను బాగానే స్టార్ట్ చేసిన శుబ్‌మన్.. 43 బంతుల్లో 25 పరుగులు చేశాడు. మూడు ఫోర్లు కొట్టి మంచి ఊపు మీద కనిపించాడు. అయితే సీనియర్ పేసర్ నవ్‌దీప్ సైనీ వేసిన ఎక్స్లెంట్ ఇన్‌స్వింగర్‌ను ఎదుర్కోలేక పెవిలియన్‌కు చేరుకున్నాడు. సైనీ ఆఫ్ స్టంప్‌కు దూరంగా వేసిన బంతి స్వింగ్ అయి లోపలకు దూసుకొచ్చింది. అయితే దాన్ని డిఫెన్స్ చేయాల్సిన గిల్ వదిలేశాడు. కనీసం బ్యాట్ అడ్డుగా పెట్టినా బతికిపోయేవాడు. కానీ బ్యాట్ పెట్టలేదు. దీంతో ప్యాడ్స్‌కు పక్క నుంచి సందులో దూసుకెళ్లిన బంతి వికెట్లను గిరాటేసింది. ఈ ఔట్లో బౌలర్ సైనీకి పూర్తి క్రెడిట్ ఇవ్వాలి. అతడు అద్భుతంగా బాల్‌ను స్వింగ్ చేశాడు. అయితే గిల్ డిఫెన్స్ టెక్నిక్‌లో లోపం, బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోవడం, ఇన్‌స్వింగర్లకు భయపడటం చర్చనీయాంశంగా మారింది.
ఆఫ్ స్టంప్‌కు అవతల పడి బ్యాట్ మీదకు దూసుకొచ్చే బంతుల్ని ఎదుర్కోవడంలో గిల్ ఎప్పటి నుంచో తడబడుతున్నాడు. ఇన్‌స్వింగర్లను ఫేస్ చేయలేక చాలా సార్లు ఔట్ అయ్యాడు. అయినా లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో బాల్ పెద్దగా స్వింగ్ అవదు కాబట్టి నడిచిపోయింది. కానీ టెస్టుల్లో మాత్రం అతడి పప్పులు ఉడకడం లేదు. అయితే లాంగ్ ఫార్మాట్లో ఇక మీదట సత్తా చాటుతానని, తానేంటో చూపిస్తానని ఇటీవల గిల్ వ్యాఖ్యానించాడు. కానీ డొమెస్టిక్ క్రికెట్లోనే తేలిపోయాడు. అతడి ఆఫ్ స్టంప్ బంతుల్ని ఆడటంలో ఉన్న బలహీనత తెలిసిన సైనీ అదే తరహా బాల్స్ వేసి ఔట్ చేశాడు. దేశవాళీ క్రికెట్లోనే ఇలా ఇబ్బంది పడితే ఇంక ఇంటర్నేషనల్ క్రికెట్లో టెస్టులు ఆడే సమయంలో గిల్ పరిస్థితి ఎలా ఉంటుందోనని అంతా వర్రీ అవుతున్నారు. అతడు ఇలాగే ఆడితే కష్టమని.. స్వింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై బొక్కబోర్లా పడటం ఖాయమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఫ్యూచర్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న గిల్.. ఈ బలహీనతను అధిగమించకపోతే సారథ్యం కాదు కదా, టీమ్‌లో ప్లేస్ కూడా కష్టమేనని చెబుతున్నారు. మరి.. గిల్ వీక్నెస్పై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
WHAT A BALL BY NAVDEEP SAINI TO DISMISS SHUBMAN GILL. 🤯🎯
– An outstanding catch by Rishabh Pant as well. 👏pic.twitter.com/aaOu1Menwy
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 6, 2024