iDreamPost
android-app
ios-app

Shubman Gill: బయటపడిన గిల్ వీక్​నెస్.. ఇలా ఆడితే కెప్టెన్సీ కాదు, టీమ్​లో ప్లేసూ కష్టమే!

  • Published Sep 06, 2024 | 7:13 PM Updated Updated Sep 06, 2024 | 7:13 PM

Shubman Gill Weakness Exposed: యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్ తక్కువ టైమ్​లోనే టీమిండియాలో పర్మినెంట్ ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ కీలక ప్లేయర్​గా ఎదిగాడు. అతడి టాలెంట్ చూసి లిమిటెడ్ ఓవర్స్​కు వైస్ కెప్టెన్​ను కూడా చేశారు.

Shubman Gill Weakness Exposed: యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్ తక్కువ టైమ్​లోనే టీమిండియాలో పర్మినెంట్ ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ కీలక ప్లేయర్​గా ఎదిగాడు. అతడి టాలెంట్ చూసి లిమిటెడ్ ఓవర్స్​కు వైస్ కెప్టెన్​ను కూడా చేశారు.

  • Published Sep 06, 2024 | 7:13 PMUpdated Sep 06, 2024 | 7:13 PM
Shubman Gill: బయటపడిన గిల్ వీక్​నెస్.. ఇలా ఆడితే కెప్టెన్సీ కాదు, టీమ్​లో ప్లేసూ కష్టమే!

యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్ తక్కువ టైమ్​లోనే టీమిండియాలో పర్మినెంట్ ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ కీలక ప్లేయర్​గా ఎదిగాడు. భారీగా పరుగుల వరద పారించి ఐసీసీ ర్యాంకింగ్స్​లోనూ సత్తా చాటాడు. కన్​సిస్టెంట్​గా రన్స్ చేయడం, టీమ్ కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడి యాంకర్ ఇన్నింగ్స్​లు ఆడటం, మ్యాచ్​ మ్యాచ్​కు ఇంప్రూవ్ అవుతూ తోపు బ్యాటర్​గా ఎదుగుతుండటంతో అతడికి బీసీసీఐ ప్రమోషన్ ఇచ్చింది. అతడి టాలెంట్ చూసి టీ20లు, వన్డేలకు వైస్ కెప్టెన్​ను చేసింది. కానీ కొన్నాళ్లుగా అంచనాలను అందుకోలేకపోతున్న గిల్.. మరోమారు నిరాశపర్చాడు. దులీప్ ట్రోఫీ-2024 ఫస్ట్ మ్యాచ్​లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇండియా బీతో జరుగుతున్న మ్యాచ్​లో క్లీన్​బౌల్డ్ అయ్యాడు గిల్.

బ్యాటింగ్​లో గిల్ వీక్​నెస్​ ఇవాళ మరోమారు బయటపడింది. ఇండియా బీతో జరుగుతున్న మ్యాచ్​లో అతడు ఔట్ అయిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇన్నింగ్స్​ను బాగానే స్టార్ట్ చేసిన శుబ్​మన్.. 43 బంతుల్లో 25 పరుగులు చేశాడు. మూడు ఫోర్లు కొట్టి మంచి ఊపు మీద కనిపించాడు. అయితే సీనియర్ పేసర్ నవ్​దీప్ సైనీ వేసిన ఎక్స్​లెంట్ ఇన్​స్వింగర్​ను ఎదుర్కోలేక పెవిలియన్​కు చేరుకున్నాడు. సైనీ ఆఫ్ స్టంప్​కు దూరంగా వేసిన బంతి స్వింగ్ అయి లోపలకు దూసుకొచ్చింది. అయితే దాన్ని డిఫెన్స్ చేయాల్సిన గిల్ వదిలేశాడు. కనీసం బ్యాట్ అడ్డుగా పెట్టినా బతికిపోయేవాడు. కానీ బ్యాట్ పెట్టలేదు. దీంతో ప్యాడ్స్​కు పక్క నుంచి సందులో దూసుకెళ్లిన బంతి వికెట్లను గిరాటేసింది. ఈ ఔట్​లో బౌలర్ సైనీకి పూర్తి క్రెడిట్ ఇవ్వాలి. అతడు అద్భుతంగా బాల్​ను స్వింగ్ చేశాడు. అయితే గిల్ డిఫెన్స్ టెక్నిక్​లో లోపం, బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోవడం, ఇన్​స్వింగర్లకు భయపడటం చర్చనీయాంశంగా మారింది.

ఆఫ్ స్టంప్​కు అవతల పడి బ్యాట్ మీదకు దూసుకొచ్చే బంతుల్ని ఎదుర్కోవడంలో గిల్ ఎప్పటి నుంచో తడబడుతున్నాడు. ఇన్​స్వింగర్లను ఫేస్ చేయలేక చాలా సార్లు ఔట్ అయ్యాడు. అయినా లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్​లో బాల్ పెద్దగా స్వింగ్ అవదు కాబట్టి నడిచిపోయింది. కానీ టెస్టుల్లో మాత్రం అతడి పప్పులు ఉడకడం లేదు. అయితే లాంగ్ ఫార్మాట్​లో ఇక మీదట సత్తా చాటుతానని, తానేంటో చూపిస్తానని ఇటీవల గిల్ వ్యాఖ్యానించాడు. కానీ డొమెస్టిక్ క్రికెట్​లోనే తేలిపోయాడు. అతడి ఆఫ్ స్టంప్ బంతుల్ని ఆడటంలో ఉన్న బలహీనత తెలిసిన సైనీ అదే తరహా బాల్స్ వేసి ఔట్ చేశాడు. దేశవాళీ క్రికెట్​లోనే ఇలా ఇబ్బంది పడితే ఇంక ఇంటర్నేషనల్ క్రికెట్​లో టెస్టులు ఆడే సమయంలో గిల్ పరిస్థితి ఎలా ఉంటుందోనని అంతా వర్రీ అవుతున్నారు. అతడు ఇలాగే ఆడితే కష్టమని.. స్వింగ్​కు అనుకూలించే పిచ్​లపై బొక్కబోర్లా పడటం ఖాయమని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. ఫ్యూచర్ కెప్టెన్​గా పేరు తెచ్చుకున్న గిల్.. ఈ బలహీనతను అధిగమించకపోతే సారథ్యం కాదు కదా, టీమ్​లో ప్లేస్​ కూడా కష్టమేనని చెబుతున్నారు. మరి.. గిల్ వీక్​నెస్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.