SNP
SNP
భారత్-వెస్టిండీస్ మధ్య బుధవారం తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచి తొలి ఇన్నింగ్స్ ఆడిన విండీస్‌ను టీమిండియా బౌలర్లు వణికించారు. కేవలం 150 పరుగులకే ఆలౌట్ చేశారు. అలాగే వికెట్ కోల్పోకుండా భారత ఓపెనర్లు 80 పరుగులు చేసి తొలి రోజు ఆటను ముగించారు. మొత్తం రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన టీమిండియా మంచి శుభారంభం అందుకుంది. తొలి టెస్ట్ తొలి రోజు పూర్తి ఆధిపత్యం చెలాయించి.. మ్యాచ్‌పై పట్టుబిగించింది.
అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లతో పాటు ఫీల్డర్లు సైతం అద్భుత ప్రదర్శన కనబర్చారు. రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లతో సత్తా చాటాగా జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ ఒక్క వికెట్‌తోనే సరిపెట్టుకున్నా.. అద్భుతమైన క్యాచ్ పట్టి భారీగా మార్కులు కొట్టేశాడు. గాల్లో పక్షిలా ఎగురుతూ.. అసాధ్యమైన క్యాచ్‌ను పట్టి ఔరా అనిపించాడు. అలాగే టీమిండియా యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ సైతం వెస్టిండీస్ ఇన్నింగ్స్ చివర్లో షార్ట్ లెగ్ ఫీల్డింగ్‌లో సూపర్ క్యాచ్ అందుకున్నాడు. అది ఎంత మెరుపు వేగంతో పట్టాడంటే.. క్యాచ్ కరెక్ట్‌గానే అందుకున్నాడనే విషయం కూడా గిల్‌కు అర్థం కాలేదు. అంపైర్లు రివ్యూ తీసుకుని చూస్తే.. తెలిసింది గిల్ ఎలాంటి అద్భుతమైన క్యాచ్ పట్టాడో.
అంతకంటే ముందు శార్దుల్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ 21వ ఓవర్‌లో విండీస్ బ్యాటర్ కవర్స్‌లోకి ఆడిన షాట్‌ను గిల్ గాల్లో పక్షిలా ఎగురుతూ అందుకునే ప్రయత్నం చేశాడు. అంత సూపర్ డైవ్ కొట్టినా.. బాల్ వేళ్లను తాకుతూ వెళ్లింది. బాల్ అందుకోలేకపోయినా.. గిల్ పెట్టిన ఎఫర్ట్ మాత్రం అద్భుతమనే చెప్పాలి. టీమిండియా ఫీల్డింగ్ స్టాండెడ్స్ ఏం రేంజ్‌లో ఉన్నాయో గిల్ డైవ్ అండ్ డెడికేషన్ చూస్తే తెలిసిపోతుందని క్రికెట్ అభిమానులు సైతం పేర్కొంటున్నారు. మరి కింద ఉన్న హైలెట్స్ వీడియోలో గిల్ డైవ్ చూసి మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: విండీస్ ‘బాహుబలి’ని చూసి డ్యాన్స్ చేసిన గిల్! వైరల్ వీడియో