iDreamPost
android-app
ios-app

వీడియో: శుబ్‌మన్‌ గిల్‌ సూపర్‌ షాట్‌! ఏ లెజెండ్‌ని గుర్తు తెచ్చాడంటే?

  • Published Mar 08, 2024 | 11:11 AM Updated Updated Mar 08, 2024 | 11:11 AM

Shubman Gill, James Anderson: ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ సూపర్‌ షాట్‌ ఆడాడు. అది షాట్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ప్రశంసలు పొందుతోంది. మరి ఆ షాట్‌ విశేసాలేంటో ఇప్పుడు చూద్దాం..

Shubman Gill, James Anderson: ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ సూపర్‌ షాట్‌ ఆడాడు. అది షాట్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ప్రశంసలు పొందుతోంది. మరి ఆ షాట్‌ విశేసాలేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 08, 2024 | 11:11 AMUpdated Mar 08, 2024 | 11:11 AM
వీడియో: శుబ్‌మన్‌ గిల్‌ సూపర్‌ షాట్‌! ఏ లెజెండ్‌ని గుర్తు తెచ్చాడంటే?

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను కేవలం 218 పరుగులకే ఆలౌట్‌ చేసిన భారత్‌.. తొలి ఇన్నింగ్స్‌కు దిగి భారీ స్కోర్‌ దిశగా వెళ్తోంది. ఈ క్రమంలోనే టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌, రోహిత్‌ శర్మ అద్భుతమైన స్టార్‌ అందించారు. జైస్వాల్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుని అవుట్‌ అయినా.. వన్‌డౌన్‌లో వచ్చిన శుబ్‌మన్‌ గిల్‌తో కలిసి రోహిత్‌ ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టిస్తున్నాడు. ప్రస్తుతం రోహిత్‌-గిల్‌ ఇద్దరూ హాఫ్‌ సెంచరీలు పూర్తి చేసుకుని.. సెంచరీల దిశగా దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే యువ క్రికెటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఓ సూపర్‌ షాట్‌తో అదరగొట్టాడు. అతను కొట్టిన షాట్‌ ఈ మ్యాచ్‌ మొత్తానికి హైలెట్‌గా నిలువనుంది.

ఇంగ్లండ్‌ సీనియర్‌ మోస్ట్‌ బౌలర్‌ జెమ్స్‌ అండర్సన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 34వ ఓవర్‌లో ఈ సూపర్‌ షాట్‌ చోటు చేసుకుంది. ఆ ఓవర్‌ రెండో బంతికి గిల్‌ అదిరిపోయే షాట్‌ కొట్టాడు. సాధారణంగా ఒక స్పిన్నర్‌ వేస్తున్న సమయంలో బ్యాటర్లు ముందుకొచ్చి భారీ షాట్లు ఆడటం చూస్తుంటాం. కానీ, ప్రపంచ అత్యుత్తమ బౌలర్, 22 ఏళ్ల అనుభవం ఉన్న పేసర్‌.. గంటకు 133 కిలో మీటర్ల వేగంతో వేసిన బంతిని ముందుకొచ్చి .. స్ట్రేయిట్‌గా భారీ సిక్స్‌ కొట్టాడు. ఆ షాట్‌ చూసి క్రికెట్‌ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఇంత అద్భుతమైన షాట్‌ను ఓ యువ క్రికెటర్‌, ఓ మోస్ట్‌ సీనియర్‌ బౌలింగ్‌లో ఆడటంతో సంచలనంగా మారింది. ఈ సిక్స్‌ తర్వాత.. 4, 5వ బంతికి రెండు వరుస ఫోర్లు కొట్టాడు గిల్‌.

అయితే.. గిల్‌ ఆడిన ఈ షాట్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్రంట్‌కొచ్చి కొట్టడం ఒక్కటి పక్కనపెడితే.. అలా స్ట్రేయిట్‌ సిక్స్‌ కొట్టడం క్రికెట్‌ ఫ్యాన్స్‌ను మరింత ఆకట్టుకుంది. ఇలాంటి స్కెట్‌ పెట్టి కొలిచినట్లు ఎవరు స్ట్రేయిట్‌గా దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఆడతాడు. సచిన్‌ స్ట్రేయిట్‌గా డౌన్‌ ద గ్రౌండ్‌ ఆడే బౌండరీకి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. అది సచిన్‌ ట్రెడ్‌మార్క్‌ షాట్‌. స్కెల్‌లో అయిన తప్పు ఉంటుందేమో కానీ, సచిన్‌ కొట్టే స్ట్రేయిట్‌ షాట్‌లో లోపముండదు అంటారు. ఇప్పుడు శుబ్‌మన్‌ గిల్‌ సైతం.. అంతే స్ట్రేయిట్‌గా బౌండరీని మించి సిక్స్‌ కొట్టాడు. కొట్టిన తర్వాత బ్యాట్‌ అలానే పట్టుకుని ఉన్న పోజ్‌ సచిన్‌ను గుర్తుకు తెస్తుంది అంటూ క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. మరి గిల్‌ కొట్టిన షాట్‌పై మీ అభిప్రాయలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.