Somesekhar
రెండోరోజు ఆటలో అండర్సన్ తో జరిగిన ఫైట్ గురించి స్పందించాడు శుబ్ మన్ గిల్. అదొక సీక్రెట్ చాట్ అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. దాని గురించి..
రెండోరోజు ఆటలో అండర్సన్ తో జరిగిన ఫైట్ గురించి స్పందించాడు శుబ్ మన్ గిల్. అదొక సీక్రెట్ చాట్ అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. దాని గురించి..
Somesekhar
క్రికెట్ మ్యాచ్ ల్లో సిక్సులు, ఫోర్లతోనే కాదు.. తమ కవ్వింపులతో కావాల్సినంత వినోదం అందిస్తూనే ఉంటారు ఆటగాళ్లు. బౌలర్ డెడ్లీ బౌన్సర్లతో బ్యాటర్లను బెదరగొట్టాలని చూస్తే.. బ్యాటర్లు భారీ సిక్సర్లతో కౌంటర్లు ఇస్తుంటారు. ఇలాంటి మజానే అందించారు టీమిండియా యువ క్రికెటర్ శుబ్ మన్ గిల్, ఇంగ్లండ్ సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్. ఇండియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న చివరి టెస్టులో వీరిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ జరిగింది. రెండోరోజు ఆటలో అండర్సన్ తో జరిగిన ఫైట్ గురించి స్పందించాడు శుబ్ మన్ గిల్.
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ రెండోరోజు ఆటలో స్టార్ బౌలర్ అండర్సన్ కు చుక్కలు చూపించాడు యంగ్ బ్యాటర్ శుబ్ మన్ గిల్. అతడు వేసిన ఇన్నింగ్స్ 34వ ఓవర్ లో రెండో బాల్ కు స్ట్రైయిట్ గా సిక్స్ బాది.. అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇక ఇదే ఓవర్ లో మరో రెండు వరుస బౌండరీలతో అండర్సన్ అహం మీదదెబ్బకొట్టాడు. దీంతో ఇద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ సైలెంట్ గా నడిచింది. ఇదే విషయంపై రెండోరోజు ఆటముగిసిన తర్వాత స్పందించాడు గిల్. “నాకు అండర్సన్ కు మధ్య జరిగిన సీక్రెట్ చాటు ఎవ్వరికీ చెప్పకపోవడమే మా ఇద్దరికీ మంచిది” అంటూ పెద్దగా నవ్వేశాడు. దీంతో వీరిద్దరి మధ్య పెద్ద విషయమే జరిగింది అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సీక్రెట్ చాట్ ను గిల్, అండర్సన్ లు ఎప్పుడు బయటపెడతారో చూడాలి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 218 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండోరోజు ఆటముగిసే సరికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసింది. జట్టులో జైస్వాల్(57), రోహిత్ శర్మ(103), గిల్(110), పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56) పరుగులతో రాణించారు. క్రీజ్ లో కుల్దీప్(27), బుమ్రా(19) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. మరి గిల్-అండర్సన్ మధ్య జరిగిన సీక్రెట్ చాట్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: రోహిత్ రేర్ రికార్డు.. హిస్టరీలో సచిన్ తరువాత ఒకేఒక్కడు!