SNP
శుబ్‌మన్ గిల్.. వన్డే ఫార్మాట్‌లో వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్. కానీ, టీ20ల్లో మాత్రం స్థాయికి తగ్గట్లు ఆడలేకపోతున్నారు. తాజాగా సౌతాఫ్రికాతో రెండో టీ20 మ్యాచ్ తర్వాత గిల్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. ఎందుకో ఇప్పుడు చూద్దాం..
శుబ్‌మన్ గిల్.. వన్డే ఫార్మాట్‌లో వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్. కానీ, టీ20ల్లో మాత్రం స్థాయికి తగ్గట్లు ఆడలేకపోతున్నారు. తాజాగా సౌతాఫ్రికాతో రెండో టీ20 మ్యాచ్ తర్వాత గిల్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. ఎందుకో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా యువ స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. కొన్ని రోజుల ముందు ఆస్ట్రేలియాపై సెంచరీతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్‌ను పక్కనపెట్టి.. ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటిస్తే.. డకౌట్ అవ్వడంపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. సౌతాఫ్రికాతో మంగళవారం జరిగిన రెండో టీ20లో గిల్ డకౌట్ అయ్యాడు. అప్పటికే మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్ అయ్యాడు. అలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఆడి.. ఇన్నింగ్స్‌ను నిలబెట్టాల్సిన గిల్.. చెత్త బ్యాటింగ్‌తో వికెట్ పారేసుకున్నాడు. ఆ తర్వాత తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ రాణించడంతో టీమిండియాకు మంచి స్కోర్ దక్కింది. లేదంటే.. భారత జట్టు పరువుపోయేది.
అయితే.. వన్డే వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణించిన శుబ్‌మన్ గిల్, టీ20ల్లో మాత్రం విఫలం అవుతున్నాడు. 3, 7, 6, 77, 9, 0 ఇవి చివరి ఏడు టీ20ల్లో గిల్ చేసిన స్కోర్లు. 7 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచీర చేశాడు. ఆరు మ్యాచ్‌ల్లో కనీసం డబుల్ డిజిట్ స్కోర్ కూడా చేయలేకపోయాడు. దీంతో.. గిల్‌ను టీ20లు వదిలేసిన.. వన్డేలు ఆడుకోవాలని కొంతమంది క్రికెట్ అభిమానులు విమర్శిస్తున్నారు. వన్డే క్రికెట్‌లో ప్రస్తుతం శుబ్‌మన్ గిల్ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్నాడు. కానీ, టీ20ల్లో మాత్రం విఫలం అవుతున్నాడు. మరో ఆరు నెలల్లో టీ20 వరల్డ్ కప్ ఉన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో గిల్ ఇలా టీ20ల్లో విఫలం అయితే.. అతనికి టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కడం కష్టమే అని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా వర్షం వల్ల 19.3 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసింది. ఆ ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగుల మంచి స్కోర్ చేసింది. రింకూ సింగ్ 39 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 68, సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 56 పరుగులు చేసి రాణించారు. తిలక్ వర్మ 29 పరుగులతో పర్వాలేదనిపించాడు. కానీ, మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలం అయ్యారు. ఇక టీమిండియా ఇన్నింగ్స్ పూర్తి అవ్వడానికి మూడు బంతులు మిగిలి ఉన్న సమయంలో వర్షం అంతరాయం కలిగిండచడంతో అక్కడితో భారత ఇన్నింగ్స్‌ను ఆపేసి.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో సౌతాఫ్రికాకు 15 ఓవర్లలో 152 పరుగుల టార్గెట్ ఇచ్చారు. ఈ లక్ష్యాన్ని ప్రొటీస్ జట్టు 13.5 ఓవర్లలోనే ఛేదించి, 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్ దారుణంగా విఫలమైంది. వర్షం, టాస్ ఓడిపోవడం కూడా టీమిండియా ఓటమికి కారణంగా నిలిచాయి. మ్యాచ్ విషయం పక్కనపెడితే.. ఈ మ్యాచ్‌తో గిల్ వైఫల్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shubman Gill has scored just one fifty in the last six T20I games for India. pic.twitter.com/1X8AAtYguP
— CricTracker (@Cricketracker) December 13, 2023