Shubman Gill: అత్యంత చెత్త రికార్డు నెలకొల్పిన శుబ్ మన్ గిల్! విరాట్ కోహ్లీ సరసన..

Shubman Gill joins Virat Kohli Most Ducks Record: బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా యంగ్ ప్లేయర్ శుబ్ మన్ గిల్ అత్యంత చెత్త రికార్డును నెలకొల్పాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ సరసన చేరాడు.

Shubman Gill joins Virat Kohli Most Ducks Record: బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా యంగ్ ప్లేయర్ శుబ్ మన్ గిల్ అత్యంత చెత్త రికార్డును నెలకొల్పాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ సరసన చేరాడు.

బంగ్లాదేశ్ తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టు లో టీమిండియా యంగ్ ప్లేయర్ శుబ్ మన్ గిల్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్ లో 8 బంతులు ఎదుర్కొన్న అతడు ఒక్క పరుగు కూడా చేయకుండా.. డకౌట్ గా వెనుదిరిగాడు. బ్యాటింగ్ కు దిగినప్పటి నుంచే ఇబ్బంది పడ్డాడు ఈ యంగ్ ప్లేయర్. ఈ క్రమంలో హసన్ మహ్మద్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్ మూడవ బంతిని డౌన్ ది లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ లిట్టన్ దాస్ చేతుల్లోకి వెళ్లింది. ఇంకేముంది.. తీవ్ర నిరాశలో పెవిలియన్ కు వెళ్లాడు. ఇక ఈ డకౌట్ ద్వారా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పైగా కోహ్లీ సరసన కూడా చేరడం గమనార్హం.

దులీప్ ట్రోఫీలో తన పూర్ ఫామ్ తో నిరాశపరిచిన టీమిండియా యంగ్ ప్లేయర్ శుబ్ మన్ గిల్.. అదే ఫామ్ ను బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో కూడా కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ గా వెనుదిరిగి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇక విమర్శలే కాకుండా.. ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్ లో మూడు లేదా అంత కంటే ఎక్కువసార్లు డకౌట్ అయిన ఆరో భారత ఆటగాడిగా నిలిచాడు గిల్. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో గిల్ హైదరాబాద్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో, రాజ్‌కోట్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సున్నా పరుగులకే వెనుదిరిగాడు. ఇక ఈ చెత్త రికార్డ్ జాబితాలో టీమిండియా దిగ్గజం మెుహిందర్ అమర్నాథ్ ఉన్నాడు. 1983 సంవత్సరంలో ఈ లెజెండ్ ఏకంగా 5 సార్లు డకౌట్ గా వెనుదిరిగాడు.

ఇక ఈ లిస్ట్ లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడి (1969), దిలీప్ వెంగసర్కార్ (1979), వినోద్ కాంబ్లి (1994), విరాట్ కోహ్లి (2021), శుబ్ మన్ గిల్ (2024) ఉన్నారు. ఈ స్టార్ ప్లేయర్లు అందరూ ఓ క్యాలెండర్ ఇయర్‌లో మూడు సార్లు డకౌయ్యాడు. కాగా.. గత కొంత కాలంగా గిల్ పెద్దగా రాణించడం లేదు. లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్ లో వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ పొందిన ఇతడు.. ప్రతిష్టాత్మకమైన దేశవాళీ టోర్నీలో కూడా పరుగులు సాధించలేకపోయాడు. అయితే బంగ్లా సిరీస్ లో అయినా పుంజుకుంటాడని భావించిన మేనేజ్ మెంట్ కు తీవ్ర నిరాశే ఎదురైంది. మరి తర్వాత మ్యాచ్ ల్లో అయినా ఈ యంగ్ ప్లేయర్ రాణిస్తాడో? లేడో? చూడాలి. శుబ్ మన్ గిల్ డకౌట్ ద్వారా చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments