iDreamPost
android-app
ios-app

గిల్ పరిస్థితి మరింత విషమం! హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు!

  • Author Soma Sekhar Published - 01:00 PM, Tue - 10 October 23
  • Author Soma Sekhar Published - 01:00 PM, Tue - 10 October 23
గిల్ పరిస్థితి మరింత విషమం! హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు!

వరల్డ్ కప్ 2023లో టీమిండియా ఘనంగా బోణి కొట్టొంది. ఆసీస్ తో జరిగిన తొలి మ్యాచ్ లో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం ఆఫ్గాన్ తో జరిగే మ్యాచ్ కోసం టీమిండియా న్యూఢిల్లీకి చేరుకుంది. కానీ ఓ స్టార్ క్రికెటర్ మాత్రం చెన్నైలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అతడే టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్ మన్ గిల్. గత కొన్ని రోజులుగా అతడు డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. జ్వరం కారణంగానే ఆసీస్ తో మ్యాచ్ కు గిల్ దూరం అయ్యాడు. గిల్ కు రక్తకణాలు స్వల్పంగా తగ్గడంతో.. అతడు చెన్నైలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం.

టీమిండియా స్టార్ క్రికెటర్ శుబ్ మన్ గిల్ ఆస్పత్రిలో చేరాడు. గతకొన్ని రోజులుగా డెంగ్యూతో బాధపడుతున్న అతడికి రక్తకణాలు స్వల్పంగా తగ్గినట్లు సమాచారం. దీంతో అతడు చెన్నైలోనే ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అతడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్లు సమాచారం. అయితే గల్ పూర్తిగా కోలుకున్నాకే టీమిండియా శిబిరంలో జాయిన్ అవుతాడని, అక్టోబర్ 14న దాయాది పాక్ తో జరిగే మ్యాచ్ సమయానికి పూర్తిగా కోలుకుంటాడని జట్టు అధికారి ధీమాగా చెప్పుకొచ్చాడు. ఇక ఆఫ్గాన్ తో జరిగే మ్యాచ్ కు గిల్ అందుబాటులో ఉండకపోవచ్చు. మ్యాచ్ కు నాలుగు రోజులు టైమ్ ఉండటంతో గిల్ కోలుకుంటాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఇటీవలి కాలంలో గిల్ భీకర ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి ఆటగాడు టీమిండియాలో లేకపోవడం జట్టుకు భారీ దెబ్బనే చెప్పాలి. అయితే కోలుకుంటాడు అనుకున్న గిల్.. ఇలా అయిపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు.