Nidhan
Shubman Gill, Duleep Trophy 2024, IND B vs IND A: టీమిండియా లిమిటెడ్ ఓవర్స్ వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మళ్లీ ఫెయిల్ అయ్యాడు. టెస్టుల్లో తన దమ్ము చూపిస్తానంటూ ఇటీవల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన యంగ్ బ్యాటర్.. రియాలిటీలో మాత్రం బొక్కబోర్లా పడ్డాడు.
Shubman Gill, Duleep Trophy 2024, IND B vs IND A: టీమిండియా లిమిటెడ్ ఓవర్స్ వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మళ్లీ ఫెయిల్ అయ్యాడు. టెస్టుల్లో తన దమ్ము చూపిస్తానంటూ ఇటీవల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన యంగ్ బ్యాటర్.. రియాలిటీలో మాత్రం బొక్కబోర్లా పడ్డాడు.
Nidhan
భారత టెస్ట్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలంటే దులీప్ ట్రోఫీలో రాణించడం కీలకంగా మారింది. ఈ టోర్నీతో ఫామ్, ఫిట్నెస్ నిరూపించుకొని బాగా పెర్ఫార్మ్ చేసిన వారికి మాత్రమే రాబోయే బంగ్లాదేశ్ సిరీస్‌లో చోటు దక్కుతుందని బీసీసీఐ ఇన్‌డైరెక్ట్‌గా ఇండికేషన్స్ ఇచ్చింది. దీంతో టీమిండియా స్టార్లతో పాటు యంగ్‌స్టర్స్ కూడా తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. అయితే కొత్త కుర్రాళ్లు అదరగొడుతుండగా.. భారత స్టార్లు మాత్రం ఫెయిల్ అవుతున్నారు. ఇలా విఫలమవుతున్న వారిలో టీమిండియా లిమిటెడ్ ఓవర్స్ వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కూడా ఉన్నాడు. ఇండియా బీతో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఫ్లాప్ అయిన గిల్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ చేతులెత్తేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఔట్ చేసిన నవ్‌దీప్ సైనీ బౌలింగ్‌లోనే అతడు మరోమారు ఔట్ అయ్యాడు.
మంచి ఆరంభం లభించాక గిల్ ఔట్ అయ్యాడు. 35 బంతులు ఎదుర్కొన్న యంగ్ బ్యాటర్ 2 బౌండరీల సాయంతో 21 పరుగులు చేశాడు. గుడ్ స్టార్ట్ దొరకడం, ఫోర్లు కొట్టి ఊపు మీద ఉండటం, తొలి ఇన్నింగ్స్‌లో ఫెయిల్ అవడంతో కసి మీద ఉన్న గిల్ భారీ ఇన్నింగ్స్ ఆడటం ఖాయమని అంతా అనుకున్నారు. అదే టైమ్‌లో 275 పరుగులు ఛేజ్ చేయాల్సి ఉండటంతో అతడు తప్పకుండా చివరి వరకు నిలబడతాడు, యాంకర్ ఇన్నింగ్స్ ఆడతాడని భావించారు. కానీ గిల్ మళ్లీ నిరాశపర్చాడు. సైనీ బౌలింగ్‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. క్రీజులో నిలదొక్కుకున్నాక అతడు ఔట్ అవడం అందర్నీ నిరాశపర్చింది. అతడి వరుస వైఫల్యాలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. కేఎల్ రాహుల్ లాంటి సీనియర్ టీమ్‌లో ఉన్నా గిల్‌కు కెప్టెన్సీ ఇచ్చినందున అతడు మరింత బాధ్యతతో ఆడాల్సింది పోయి ఇలా ఫ్లాప్ అవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
గిల్‌కు టీమ్ మేనేజ్మెంట్తో పాటు బీసీసీఐ నుంచి ఫుల్ సపోర్ట్ ఉందని.. అతడు మంచి పెర్ఫార్మెన్స్తో దాన్ని నిలబెట్టుకోవాల్సింది పోయి ఇలా నిరాశపర్చడం ఏంటని క్వశ్చన్ చేస్తున్నారు నెటిజన్స్. ఇదే రీతిలో ఆడుతూ పోతే భారత టెస్ట్ టీమ్‌లో అతడికి చోటు కష్టమేనని.. లాంగ్ ఫార్మాట్లో అతడు తన టెక్నిక్‌ను మరింత ఇంప్రూవ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. త్వరగా మెరుగుపడకపోతే ఆ ప్లేస్‌ను ఇంకొకరితో భర్తీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని.. ముందే టీమిండియాలో టఫ్ కాంపిటీషన్ ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక, ఇండియా ఏ ప్రస్తుతం 8 వికెట్లకు 182 పరుగులతో ఉంది. ఆ టీమ్ విజయానికి ఇంకా 93 పరుగులు కావాలి. కానీ రెండే వికెట్లు ఉన్నందున ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. ఆకాశ్‌దీప్ (31 నాటౌట్), ఆవేశ్ ఖాన్ (3 నాటౌట్) క్రీజులో ఉన్నారు. వీళ్లు ఇండియా బీ విజయాన్ని ఎంత ఆలస్యం చేస్తారో చూడాలి. మరి.. గిల్ బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్‌పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Fraud Of The Generation Shubman Gill
Future Captain of All 3 Formats 😂🤣 pic.twitter.com/GLXd4wlZiB
— 🤍✍ (@imAnthoni_) September 8, 2024