iDreamPost
android-app
ios-app

GT vs PBKS: శుబ్ మన్ గిల్ క్లాసిక్ షాట్.. చూసి తీరాల్సిందే! వీడియో వైరల్..

  • Published Apr 04, 2024 | 9:51 PM Updated Updated Apr 04, 2024 | 9:51 PM

పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ అద్బుతమైన నాక్ తో అలరించాడు. ఇక ఈ మ్యాచ్ లో అతడు కొట్టిన సిక్స్ న భూతో న భవిష్యతి. మరి ఆ సిక్స్ ను మీరూ చూసేయండి.

పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ అద్బుతమైన నాక్ తో అలరించాడు. ఇక ఈ మ్యాచ్ లో అతడు కొట్టిన సిక్స్ న భూతో న భవిష్యతి. మరి ఆ సిక్స్ ను మీరూ చూసేయండి.

GT vs PBKS: శుబ్ మన్ గిల్ క్లాసిక్ షాట్.. చూసి తీరాల్సిందే! వీడియో వైరల్..

అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లో గుజరాత్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ చెలరేగాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ తో జట్టుకు భారీ స్కోర్ ను అందించాడు. ఓ దశలో సెంచరీ పూర్తి చేస్తాడని అందరూ భావించారు. కానీ 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ లో అతడు రబాడా బౌలింగ్ లో కొట్టిన క్లాసిక్ షాట్ ను చూసితీరాల్సిందే. అచ్చం ఆ లెజెండ్ క్రికెటర్లు ఆడిన విధంగా ఆ షాట్ ఆడాడు గిల్. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో శుబ్ మన్ గిల్ అద్భుతమైన నాక్ ఆడాడు. స్టార్టింగ్ నుంచే ప్రత్యర్థి బౌలర్లపై దాడి చేస్తూ.. పరుగులు పిండుకున్నాడు. కెప్టెన్ గా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. వృద్ధిమాన్ సాహా(11), కేన్ విలియమ్సన్(26) తో కలిసి 40 పరుగులు, సాయి సుదర్శన్(33)తో కలిసి 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు గిల్. ఈ క్రమంలోనే ఓ క్లాసికల్ షాట్ తో అందరిని అలరించాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా పేరుగాంచిన కగిసో రబాడ బౌలింగ్ లో గిల్ కొట్టిన సిక్స్ చూసి తీరాల్సిందే. ఇన్నింగ్స్ 13వ ఓవర్ 2వ బంతిని గిల్ స్ట్రైట్ గా సిక్స్ కొట్టాడు. ఆ షాట్, ఆ టైమింగ్, ఆ స్ట్రోక్ ప్లే అదుర్స్. గుడ్ లెంగ్త్ లో పడ్డ బాల్ ను సిక్స్ గా మలిచిన తీరు అమోఘం.

ఇక ఈ షాట్ చూసిన క్రీడా పండితులు, అభిమానులు అచ్చం టీమిండియా క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్, రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీలా కొట్టావ్ అంటూ కితాబిస్తున్నారు. ఇలా బాల్ కు నొప్పి లేవకుండా, టైమింగ్ షాట్ తో సిక్సులు కొట్టడంలో సచిన్, విరాట్ ను సిద్ధహస్తులు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్లు నష్టపోయి 199 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో కెప్టెన్ గిల్ 48 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అనంతరం 200 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ రెండో ఓవర్లోనే కెప్టెన్ ధావన్ వికెట్ కోల్పోయింది. ఉమేష్ యాదవ్ అద్భుతమైన బాల్ తో ధావన్(1) ను బౌల్డ్ చేశాడు. మరి గిల్ కొట్టిన ఈ క్లాసిక్ షాట్ ను చూసి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.