iDreamPost
android-app
ios-app

Ishan Kishan: అయ్యర్ వచ్చాడు.. మరి ఇషాన్ కిషన్ సంగతేంటి? కెరీర్ ముగిసినట్లేనా!

  • Published Jan 13, 2024 | 10:05 AM Updated Updated Jan 13, 2024 | 10:05 AM

శ్రేయస్ అయ్యర్ కు బిగ్ రిలీఫ్ ఇచ్చింది బీసీసీఐ. కానీ.. ఇషాన్ కిషన్ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయ్యారైంది. అతడు విశ్రాంతి కోరితే.. బీసీసీఐ మాత్రం ఇషాన్ ను పూర్తిగా పక్కనపెట్టింది. దీంతో అతడి కెరీర్ ముగిసినట్లేనా? అన్న ప్రశ్న తలెత్తింది.

శ్రేయస్ అయ్యర్ కు బిగ్ రిలీఫ్ ఇచ్చింది బీసీసీఐ. కానీ.. ఇషాన్ కిషన్ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయ్యారైంది. అతడు విశ్రాంతి కోరితే.. బీసీసీఐ మాత్రం ఇషాన్ ను పూర్తిగా పక్కనపెట్టింది. దీంతో అతడి కెరీర్ ముగిసినట్లేనా? అన్న ప్రశ్న తలెత్తింది.

Ishan Kishan: అయ్యర్ వచ్చాడు.. మరి ఇషాన్ కిషన్ సంగతేంటి? కెరీర్ ముగిసినట్లేనా!

ఇషాన్ కిషన్-శ్రేయస్ అయ్యర్.. గత కొద్దిరోజులుగా టీమిండియా క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన ప్లేయర్లు. మానసిక ఒత్తిడి కారణంగా తనకు కొన్ని రోజులు విశ్రాంతి కావాలని మేనేజ్ మెంట్ ను కోరాడు ఇషాన్. దాంతో అతడికి సౌతాఫ్రికా టూర్ ను తో పాటుగా ఆఫ్గాన్ సిరీస్ కు రెస్ట్ ను ఇచ్చింది. అయితే అతడు దుబాయ్ లో ఓ పార్టీలో కనిపించి అందరికి షాకిచ్చాడు. మానసిక ఒత్తిడని చెప్పిన ఇషాన్.. ఇలా పార్టీలో కనిపించడంతో, బీసీసీఐ పెద్దలకు కోపం వచ్చింది. అతడిపై సీరియస్ గా ఉన్నారు. ఇక మరో ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ పై కూడా గ్రౌండ్ లో క్రమ శిక్షణ రాహిత్యానికి పాల్పడ్డాడని అతడిపై కూడా మేనేజ్ మెంట్ కాస్త గుర్రుగానే ఉందన్న వార్తలు సైతం వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ తో జరిగే తొలి రెండు టెస్ట్ లకు జట్టును ప్రకటించింది బీసీసీఐ.

శ్రేయస్ అయ్యర్ కు బిగ్ రిలీఫ్ ఇచ్చింది బీసీసీఐ. ఇంగ్లాండ్ తో జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కోసం.. తొలి రెండు మ్యాచ్ లకు టీమ్ ను ప్రకటించింది. 16 మంది సభ్యులతో కూడిన జట్టులో చోటు దక్కించుకున్నాడు శ్రేయస్ అయ్యర్. బీసీసీఐ అతడిని పక్కన పెడుతోందని, రంజీల్లో ఆడాలని సూచించినట్లు వార్తలు వచ్చాయి. ఇక అయ్యర్ సైతం అలానే రంజీల్లో ఆడటంతో.. ఇంగ్లాండ్ తో సిరీస్ కు అతడిని పక్కన పెడతారని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. అయ్యర్ జట్టులో ప్లేస్ కొట్టేశాడు. టీమిండియా భవిష్యత్ కెప్టెన్ గా పేరొందిన అయ్యర్ సఫారీ టీమ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో మాత్రం విఫలం అయ్యాడు. అతడి షాట్ సెలక్షన్ రాంగ్ గా ఉండటంతో.. మేనేజ్ మెంట్ అయ్యర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఇషాన్ కిషన్ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయ్యారైంది. అతడు విశ్రాంతి కోరితే.. బీసీసీఐ మాత్రం ఇషాన్ ను పూర్తిగా పక్కనపెట్టింది. ఆఫ్గాన్ తో టీ20 సిరీస్ తో పాటుగా ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు అతడిని పరిగణంలోకి తీసుకోలేదు. దీంతో అతడి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇది ఇషాన్ చేసుకున్న కర్మే అంటున్నారు కొందరు క్రికెట్ ఫ్యాన్స్. మానసిక ఒత్తిడని చెప్పి పార్టీలు చేసుకోవడం, బీసీసీఐకి చెప్పకుండా కౌన్ బనేగా కరోడ్ పతి షోకు వెళ్లడం లాంటి స్వయం కృపరాథాలు అతడి కెరీర్ ను ముళ్లకంపలో పడేశాయి. కాగా.. ఇషాన్ విషయంలో తాజాగా ద్రవిడ్ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. జట్టులోంచి వెళ్లిపోవడం వరకే మీ వంతు.. తిరిగి తీసుకోవాలా? లేదా? అన్నది మా నిర్ణయం అని ఇన్ డైరెక్ట్ గానే హింట్ ఇచ్చాడు ద్రవిడ్ భాయ్. దీంతో ఇషాన్ కెరీర్ ముగిసినట్లేనా? అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో ఇషాన్ ట్రెండింగ్ లోకి వచ్చేశాడు. మరి ఇషాన్ కెరీర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.