iDreamPost
android-app
ios-app

Shreyas Iyer: ఆ అందమైన అమ్మాయి కోసం ఎంతో ఎదురుచూశాను చివరికి..: శ్రేయస్ అయ్యర్

  • Published Apr 09, 2024 | 7:09 PM Updated Updated Apr 09, 2024 | 7:09 PM

తొలి ఐపీఎల్ సీజన్ లో ఓ మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకుల్లో కూర్చున్న ఓ అమ్మాయిని చూసి మనసుపారేసుకున్నట్లు తెలిపాడు టీమిండియా స్టార్ ప్లేయర్, కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. ఆ వివరాల్లోకి వెళితే..

తొలి ఐపీఎల్ సీజన్ లో ఓ మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకుల్లో కూర్చున్న ఓ అమ్మాయిని చూసి మనసుపారేసుకున్నట్లు తెలిపాడు టీమిండియా స్టార్ ప్లేయర్, కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Apr 09, 2024 | 7:09 PMUpdated Apr 09, 2024 | 7:09 PM
Shreyas Iyer: ఆ అందమైన అమ్మాయి కోసం ఎంతో ఎదురుచూశాను చివరికి..: శ్రేయస్ అయ్యర్

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మన చూపులు ఎక్కడుంటాయి? మ్యాచ్ పైనే కదా? కానీ కెమెరా మెన్స్ చూపులు మాత్రం రెండువైపులా ఉంటాయి. ఒకవైపు మ్యాచ్ ను ప్రేక్షకులకు చూపిస్తూనే.. మరోవైపు స్టేడియంలో ఉన్న అందమైన అమ్మాయిలను కూడా తమ కెమెరా కంట్లో బంధిస్తూ ఉంటారు. ఇక క్రికెటర్లకు సైతం ప్లకార్డులు పట్టుకుని విల్ యూ మ్యారీ మీ అని ప్రపోజల్స్ వస్తుంటాయి. అయితే తాను కూడా ప్రేక్షకుల్లో ఓ అమ్మాయిని చూసి మనసుపారేసుకున్నట్లు తెలిపాడు టీమిండియా స్టార్ ప్లేయర్, కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. మరి ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఎక్కడ చూశాడు? ఆ వివరాల్లోకి వెళితే..

శ్రేయస్ అయ్యర్.. టీమిండియాలోకి వచ్చిన కొద్దికాలంలోనే కీలక ప్లేయర్ గా ఎదిగాడు. ఇక తన ఆటతీరుతో ఫ్యూచర్ కెప్టెన్ గా కితాబు అందుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం ఈ ఐపీఎల్ సీజన్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ టీమ్ కు సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేసిన ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోకి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి పాల్గొన్నాడు. ఇక ఈ షోలో అభిమానులకు తెలియని చాలా విషయాలు పంచుకున్నారు. ఈ ఇద్దరు ప్లేయర్లు. కపిల్ శర్మ ప్రశ్నలు అడుగుతుంటే.. రోహిత్, అయ్యర్ లు తమదైన శైలిలో ఆన్సర్ లు ఇచ్చారు. అయితే మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలో అమ్మాయిలపై కెమెరామెన్ లు ఫోకస్ పెట్డడం అనే టాపిక్ గురించి కపిల్ శర్మ అడగ్గా.. శ్రేయస్ ఈ విధంగా ఆన్సర్ ఇచ్చాడు.

“నేను ఫస్ట్ ఐపీఎల్ సీజన్ లో పాల్గొన్నప్పుడు ఓ మ్యాచ్ లో అందమైన అమ్మాయిని ప్రేక్షకుల మధ్యలో చూశాను. స్టాండ్స్ లో కూర్చున్న ఆ యువతి వైపు చూస్తు చేయికూడా ఊపాను. అయితే ఆ టైమ్ లో ఫేస్ బుక్ చాలా పాపులర్ కావడంతో.. అందులో నాకు మెసేజ్ చేస్తుందని భావించాను. ఎన్నో రోజులు ఎదురుచూశాను. కానీ మెసేజ్ మాత్రం రాలేదు. దాంతో చాలా ఫీల్ అయ్యాను” అని తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పుకొచ్చాడు అయ్యర్. ఈ విషయం చెబుతుంటే షోకి వచ్చిన ప్రేక్షకులంతా ఓ కొడుతూ సౌండ్ చేశారు. ప్రస్తుతం ఈ షో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss