Raj Mohan Reddy
Rohit Sharma Fans Praises Shreyas Iyer: టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను రోహిత్ శర్మ ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. అయ్యర్ సూపర్ అంటూ ప్రశంసిస్తున్నారు. అసలు అతడ్ని హిట్‌మ్యాన్ అభిమానులు ఎందుకు ప్రశంసిస్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Rohit Sharma Fans Praises Shreyas Iyer: టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను రోహిత్ శర్మ ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. అయ్యర్ సూపర్ అంటూ ప్రశంసిస్తున్నారు. అసలు అతడ్ని హిట్‌మ్యాన్ అభిమానులు ఎందుకు ప్రశంసిస్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Raj Mohan Reddy
మంచి క్రేజ్, ఫ్యాన్‌బేస్ కలిగిన టీమిండియా క్రికెటర్స్‌లో బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఒకడు. ఎప్పుడూ కూల్‌గా, కామ్‌గా కనిపించే అయ్యర్.. బ్యాటింగ్‌లో మాత్రం భారీ షాట్లతో విరుచుకుపడతాడు. క్రీజులో నిలదొక్కుకున్నాడంటే అతడ్ని ఆపడం తోపు బౌలర్లకు కూడా కష్టమే. గ్రౌండ్ నలుమూలలా షాట్లు బాదే అయ్యర్.. చూస్తుండగానే మ్యాచ్‌ను ప్రత‍్యర్థుల నుంచి లాగేసుకుంటాడు. బ్యాటింగ్‌తో పాటు తన స్టైల్, కూల్ యాటిట్యూడ్‌తో అందరి మనసులు గెలుచుకుంటున్న అయ్యర్.. ఇప్పుడు రోహిత్ శర్మ ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఒక్క పనితో అతడు హీరో అయిపోయాడు. సియట్ క్రికెట్ అవార్డ్స్ ఈవెంట్‌కు వచ్చిన అయ్యర్.. హిట్‌మ్యాన్ విషయంలో చేసిన పనితో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. అసలేం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సియట్ అవార్డ్ ఈవెంట్‌కు అటెండ్ అయిన అయ్యర్ అప్పటికే తన సీట్‌లో వచ్చి కూర్చున్నాడు. కాస్త ఆలస్యంగా వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మకు సీట్ దొరకలేదు. దీంతో ఎక్కడ కూర్చోవాలా అని హిట్‌మ్యాన్ ఆలోచించసాగాడు. దీన్ని గమనించిన అయ్యర్ తన కుర్చీలో కూర్చోవాలని హిట్‌మ్యాన్‌కు ఆఫర్ చేశాడు. అయితే రోహిత్ మాత్రం వద్దులే.. నువ్వే కూర్చో అంటూ మరొక సీట్‌ను అందుకున్నాడు. హిట్‌మ్యాన్‌కు ముందు ఉన్న సీట్‌లో శ్రేయస్ కూర్చున్నాడు. ఇదంతా కెమెరాల్లో రికార్డు అయింది. దీన్ని చూసిన హిట్‌మ్యాన్ అభిమానులు అయ్యర్‌ను మెచ్చుకుంటున్నారు. సీనియర్‌పై అతడు చూపించిన గౌరవం సూపర్బ్ అని ప్రశంసిస్తున్నారు. సీనియర్స్‌తో ఎలా మెలగాలి, రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలనేది శ్రేయస్‌ను చూసి నేర్చుకోవాలని చెబుతున్నారు ఫ్యాన్స్.
అయ్యర్-రోహిత్ మధ్య ఉన్న స్నేహానికి ఈ వీడియో ఒక ఎగ్జాంపుల్ అని నెటిజన్స్ అంటున్నారు. ఇక, సియట్ అవార్డ్స్‌లో టీమిండియా స్టార్లు మెరిశారు. కెప్టెన్ రోహిత్‌కు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం దక్కింది. బీసీసీఐ సెక్రెటరీ జైషా చేతుల మీదుగా అతడు ఈ అవార్డును అందుకున్నాడు. బెస్ట్ వన్డే బ్యాటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గెలుచుకున్నాడు. బెస్ట్ టెస్ట్ బ్యాటర్ పురస్కారాన్ని యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దక్కించుకున్నాడు. బెస్ట్ వన్డే బౌలర్‌గా సీనియర్ పేసర్ మహ్మద్ షమి అవార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో రెండు టీమ్స్ (ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్)ను ఫైనల్స్‌కు చేర్చినందుకు గానూ అయ్యర్‌కు టీ20 లీడర్‌షిప్ అవార్డు దక్కింది. మరి.. రోహిత్‌తో అయ్యర్ ప్రవర్తించిన తీరు, రెస్పెక్ట్ ఇచ్చిన విధానం మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma and Shreyas Iyer bond. ❤️ pic.twitter.com/RRWSzBniC8
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 22, 2024