iDreamPost
android-app
ios-app

దిగ్గజాలకు కూడా సాధ్యం కాని రికార్డు సాధించిన శ్రేయస్ అయ్యర్

  • Author Soma Sekhar Published - 06:43 PM, Wed - 15 November 23

న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో మెరుపు శతకంతో కివీస్ బౌలర్లను బెంబేలెత్తించాడు శ్రేయస్ అయ్యర్. ఈ క్రమంలో దిగ్గజాలకు కూడా సాధ్యంకాని ఓ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో మెరుపు శతకంతో కివీస్ బౌలర్లను బెంబేలెత్తించాడు శ్రేయస్ అయ్యర్. ఈ క్రమంలో దిగ్గజాలకు కూడా సాధ్యంకాని ఓ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

  • Author Soma Sekhar Published - 06:43 PM, Wed - 15 November 23
దిగ్గజాలకు కూడా సాధ్యం కాని రికార్డు సాధించిన శ్రేయస్ అయ్యర్

శ్రేయస్ అయ్యర్.. గత కొంతకాలంగా టీమిండియాలో తరచుగా వినిపిస్తున్న పేరు. తన నిలకడైన ఆటతీరుతో భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిర పరుచుకున్న ప్లేయర్. అయితే ఈ వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు గాయం కారణంగా జట్టుకు దూరమైయ్యాడు. దీంతో ప్రపంచ కప్ కు అందుబాటులో ఉంటాడా? ఉండడా? అన్న అనుమానం అందరిలో నెలకొంది. ఇక వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ.. వరల్డ్ కప్ జట్టులో ప్లేస్ సంపాదించుకోవడమే కాక.. అద్భుత ప్రదర్శనతో దుమ్మురేపుతున్నాడు. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో మెరుపు శతకంతో కివీస్ బౌలర్లను బెంబేలెత్తించాడు. ఈ క్రమంలో దిగ్గజాలకు సాధ్యంకాని ఓ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రపంచ కప్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు దుమ్మురేపారు. క్రీజ్ లోకి వచ్చిన ప్రతీ బ్యాటరూ సత్తా చాటడంతో.. భారత్ భారీ స్కోర్ సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ లు అద్భుత శతకాలతో చెలరేగారు. ఈ క్రమంలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దిగ్గజాలకు సాధ్యంకాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. మహామహులైన మిడిలార్డర్ ఆటగాళ్లు సాధించలేని ఘనతను సాధించి.. ఔరా అనిపించాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే?

నంబర్ 4లో బ్యాటింగ్ కు దిగి.. ఒకే వరల్డ్ కప్ ఎడిషన్ ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు అయ్యర్. అతడు ఈ వరల్డ్ కప్ లో రెండు వరుస సెంచరీల సాయంతో 511 పరుగులు చేసి.. ఈ లిస్ట్ లో అగ్రస్థానంలో ఉన్నాడు. అతడి తర్వాత కివీస్ ఆటగాడు స్కాట్ స్టైరిష్(499, 2007 వరల్డ్ కప్), ఏబీ డివిల్లియర్స్(482, 2015 వరల్డ్ కప్),బెన్ స్టోక్స్(465, 2019 వరల్డ్ కప్) లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ రికార్డుతో పాటుగా మరో ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా సెంచరీలు చేసిన ఇండియన్ బ్యాటర్ల లిస్ట్ లో మూడో ప్లేస్ లో ఉన్నాడు అయ్యర్. ఈ జాబితాలో రోహిత్ శర్మ మూడు శతకాలు(2019లో)బాది అగ్రస్థానంలో ఉండగా.. రెండు సెంచరీలు చేసిన ద్రవిడ్(1999లో) తో సమానంగా రెండో స్థానంలో ఉన్నాడు అయ్యర్. ఈ ఘనతలే కాకుండా మరో ఘనతను కూడా తన పేరిట లిఖించుకున్నాడు అయ్యర్. 67 బంతుల్లో సెంచరీ చేసి.. నాకౌట్ మ్యాచ్ ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా ఆసీస్ దిగ్గజం ఆడమ్ గిల్ క్రిస్ట్( 72 బంతుల) రికార్డును బ్రేక్ చేశాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో రోహిత్ శర్మ(47), గిల్(80*), విరాట్ కోహ్లీ(117), శ్రేయస్ అయ్యర్(105), కేఎల్ రాహుల్(39*) పరుగులతో రాణించారు. కివీస్ బౌలర్లలో టీమ్ సౌథీ 3 వికెట్లు తీసినప్పటికీ 10 ఓవర్లలో 100 పరుగులు సమర్పించుకున్నాడు. మరి దిగ్గజాలకు కూడా సాధ్యంకాని రికార్డు సాధించిన శ్రేయస్ అయ్యర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.