iDreamPost
android-app
ios-app

సునీల్‌ నరైన్‌లా బౌలింగ్‌ వేస్తున్న శ్రేయస్‌ అయ్యర్‌! అంతా గంభీర్‌ ఎఫెక్టేనా?

  • Published Aug 29, 2024 | 1:53 PM Updated Updated Aug 29, 2024 | 1:53 PM

Shreyas Iyer, Sunil Narine, Buchi Babu Tournament 2024: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ స్పిన్‌ బౌలర్‌గా మారి.. మిస్టరీ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ బౌలింగ్‌ యాక్షన్‌తో అదరగొట్టాడు. మరి బ్యాటర్‌ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

Shreyas Iyer, Sunil Narine, Buchi Babu Tournament 2024: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ స్పిన్‌ బౌలర్‌గా మారి.. మిస్టరీ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ బౌలింగ్‌ యాక్షన్‌తో అదరగొట్టాడు. మరి బ్యాటర్‌ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Aug 29, 2024 | 1:53 PMUpdated Aug 29, 2024 | 1:53 PM
సునీల్‌ నరైన్‌లా బౌలింగ్‌ వేస్తున్న శ్రేయస్‌ అయ్యర్‌! అంతా గంభీర్‌ ఎఫెక్టేనా?

గౌతమ్‌ గంభీర్‌ టీమిండియాకు హెడ్‌ కోచ్‌గా వచ్చిన తర్వాత.. స్టార్‌ బ్యాటర్లు కూడా బౌలింగ్‌పై కాస్త ఫోకస్‌ చేయడం కనిపించింది. కొంతకాలంగా భారత జట్టులో పార్ట్‌టైమ్‌ స్పిన్నర్ల లోటు ఉందనే విషయం తెలిసిందే.. ముఖ్యంగా ఐసీసీ బిగ్‌ ఈవెంట్స్‌లో పార్ట్‌టైమ్‌ స్పిన్నర్ల లోటుతో టీమిండియా చాలా ఇబ్బంది పడింది. ప్రధాన బౌలర్లలో ఒకరిద్దరు విఫలం అవుతున్నా.. వారితోనూ పూర్తి కోటా ఓవర్లు పూర్తి చేయాల్సి వస్తుంది. అయితే.. గంభీర్‌ రాకతో టీమిండియాలో బౌలింగ్‌ వేయగల బ్యాటర్లతో బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేయించి.. శ్రీలంకతో సిరీస్‌లో కొంతమంది పార్ట్‌టైమ్‌ బౌలర్లలో బౌలింగ్‌ వేయించాడు. ఇప్పుడు ఆ లిస్ట్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ కూడా చేరిపోయేలా ఉన్నాడు.

వన్డే, టెస్ట్‌ టీమ్‌లో కీ ప్లేయర్‌గా ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌ తన బౌలింగ్ స్కిల్స్‌పై ఫోకస్‌ పెట్టాడు. వచ్చే నెల 19 నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభం కాబోయే టెస్ట్‌ సిరీస్‌కి ముందు.. అయ్యర్‌ దేశవాళి క్రికెట్‌లో ఆడుతున్నాడు. తమిళనాడులో వేదికగా జరుగుతున్న బుచ్చిబాబు టోర్నీలో ముంబై టీమ్‌ తరఫున ఆడుతున్నాడు అయ్యర్‌. తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ ఎలెవన్‌ టీమ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓ ఓవర్‌ బౌలింగ్‌ వేశాడు. అందులో 7 పరుగులు ఇచ్చాడు. కానీ, ఇక్కడ విశేషం ఏంటంటే.. తన బౌలింగ్‌ యాక్షన్‌ అచ్చం వెస్టిండీస్‌ స్టార్‌ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌లానే ఉంది.

ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ తరఫున ఆడే సునీల్‌ నరైన్‌ గురించి అందరికీ తెలిసిందే. మిస్టరీ స్పిన్నర్‌గా కొన్ని ఏళ్ల నుంచి టీ20 క్రికెట్‌ను శాసిస్తున్నాడు. అయ్యార్‌ సైతం కేకేఆర్‌ టీమ్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ సమయంలోనే నరైన్‌ నుంచి స్పిన్‌ బౌలింగ్‌ టెక్నిక్స్‌ను అయ్యర్‌ నేర్చుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఆ స్కిల్స్‌ను బుచ్చిబాబు టోర్నీలో ప్రదర్శిస్తున్నాడు. బంగ్లాదేశ్‌లోని పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి. బహుషా రాబోయే టెస్ట్‌ సిరీస్‌లో పార్ట్‌టైమ్‌ బౌలర్‌గా బౌలింగ్‌ వేయాల్సి వస్తే అందుకు సిద్ధంగా ఉండేందుకు అయ్యర్‌ ఇప్పటి నుంచే ప్రిపేర్‌ అవుతున్నట్లు కనిపిస్తోంది. మరి శ్రేయస్‌ అయ్యర్‌.. సునీల్‌ నరైన్‌ యాక్షన్‌తో బౌలింగ్‌ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.