iDreamPost
android-app
ios-app

చెడగొట్టాడు! ఇప్పుడేం చేయాలో సిరాజ్‌నే అడగాలి: శ్రద్ధాకపూర్‌

  • Published Sep 18, 2023 | 1:15 PM Updated Updated Sep 18, 2023 | 1:15 PM
  • Published Sep 18, 2023 | 1:15 PMUpdated Sep 18, 2023 | 1:15 PM
చెడగొట్టాడు! ఇప్పుడేం చేయాలో సిరాజ్‌నే అడగాలి: శ్రద్ధాకపూర్‌

ఆసియా కప్‌ 2023 ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో టీమిండియాను గెలిపించిన పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌పై నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తుంది. మాజీ క్రికెటర్లు, సినీ, రాజకీయ ప్రముఖులు సిరాజ్‌ను ఆకాశానికెత్తేస్తూ.. సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ బ్యూటీ, ప్రభాస్‌ సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులను సైతం పలకరించిన శ్రద్ధా కపూర్‌ సైతం సిరాజ్‌ అవుట్‌ స్టాండింగ్‌ ప్రదర్శనపై తనదైన శైలిలో స్పందించింది. ‘ఈ ఫ్రీమ్‌ టైమ్‌లో ఏం చేయాలో సిరాజ్‌నే అడగాలి’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టింది.

సాధారణంగా వన్డే మ్యాచ్‌ అంటే దాదాపు 8 గంటలు జరగాలి. కానీ, ఆదివారం శ్రీలంకతో జరిగిన ఆసియా కప్‌ 2023 ఫైనల్‌ కేవలం 3 గంటల్లో ముగిసిపోయింది. 50, 50.. 100 ఓవర్ల పాటు సాగాల్సిన మ్యాచ్‌ కాస్తా.. 21.3 ఓవర్లలోనే ముగిసిపోయింది. 15.2 లో శ్రీలంక 50 పరుగులకే ఆలౌట్‌ కావడం, 51 పరుగుల టార్గెట్‌ను టీమిండియా ఓపెనర్లు గిల్‌-ఇషాన్‌ కేవలం 6.1 ఓవర్లలో కొట్టేయడంతో వన్డే మ్యాచ్‌.. టీ20 టైమ్‌లోనే ముగిసింది. దీనంతటికీ కారణం మొహమ్మద్‌ సిరాజ్‌. ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీయడంతో పాటు మొత్తం 6 వికెట్ల పడగొట్టి.. శ్రీలంకను కుప్పకూల్చాడు.

దీంతో.. సండే రోజు భారత్‌-శ్రీలంక మధ్య ఆసియా కప్‌ 2023 ఫైనల్‌ మ్యాచ్‌ను చూస్తూ.. గడపేద్దాం అనుకున్న వారందరికీ షాక్‌ ఇచ్చాడు సిరాజ్‌. మూడు గంటల్లోనే మ్యాచ్‌ ముగిసిపోవడంతో.. తర్వాత టైమ్‌లో ఏం చేయాలో చాలా మంది దగ్గర ప్లాన్స్‌ లేకుండా అయిపోయాయి. ఇలా సిరాజ్‌ శ్రద్ధా కపూర్‌ ప్లాన్స్‌ అన్ని పాడు చేసినట్లు ఉన్నాడు. అందుకే.. మిగతా ఖాళీ టైమ్‌లో ఏం చేయాలో సిరాజ్‌నే అడగాలంటూ.. సరదాగా పేర్కొంది. మరి ఫైనల్‌లో సిరాజ్‌ ప్రదర్శనతో పాటు.. శ్రద్ధా కపూర్‌ ఇన్‌స్టా స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: 23 ఏళ్ళ భారత్ పగ తీర్చిన సిరాజ్! అప్పట్లో మన పరువు తీశారు!