P Venkatesh
టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా టీ20 జట్టు తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ సుమారు రెండు నెలల పాటు ఆటకు దూరం కానున్నట్లు సమాచారం. గాయం తీవ్రం కావడంతో ఆటకు విరామం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా టీ20 జట్టు తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ సుమారు రెండు నెలల పాటు ఆటకు దూరం కానున్నట్లు సమాచారం. గాయం తీవ్రం కావడంతో ఆటకు విరామం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
P Venkatesh
మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ కొంతకాలం పాటు ఆటకు దూరం కానున్నారు. వన్డే వరల్డ్ కప్ సమరం అనంతరం టీమిండియా కెప్టెన్ గా పగ్గాలు చేపట్టాడు సూర్య. వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ లో టీమిండియాను దెబ్బకొట్టిన కొన్ని రోజులకే సూర్యసేన ఆసిస్ ను మట్టికరిపించింది. 4-1తో ఆసీస్‌పై ఐదు మ్యాచ్‌ల సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ఆ తర్వాత సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసి సత్తా చాటాడు. ఆటగాడిగా, జట్టు కెప్టెన్ గా అద్భుతంగా రాణించి సఫారీ గడ్డపై ఆతిథ్య జట్టుతో ట్రోఫీని పంచుకున్నాడు. సఫారీలతో జరిగిన టీ20 మ్యాచ్ లో సూర్య గాయపడ్డ విషయం తెలిసిందే. గాయం తీవ్రం కావడంతో ఆఫ్ఘాన్ తో టీ20 సిరీస్ కు దూరం కానున్నాడు.
అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. టీమిండియా టీ20 జట్టు తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ సుమారు రెండు నెలల పాటు ఆటకు దూరం కానున్నట్లు సమాచారం. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సూర్య గాయపడ్డాడు. సూర్య కాలు మెలిక పడింది. దీంతో చీలమండ గాయం తీవ్రం కావడంతో అతడికి దీర్ఘకాలం విశ్రాంతినివ్వాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో జనవరి 11న ఆఫ్ఘాన్ తో జరిగే టీ20 సిరీస్ కు స్కై దూరం కానున్నాడు.
చీలమండ గాయం నుంచి హార్దిక్ పాండ్యా కోలుకునే అవకాశాలు ఇప్పట్లో కనిపించడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో హార్దిక్ స్థానంలో కెప్టెన్‌గా వచ్చిన సూర్య సైతం గాయం కారణంగా జట్టుకు దూరం కావడం టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఇక ఆఫ్ఘాన్ తో జరిగే టీ20 సిరీస్ కు కొత్త కెప్టెన్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఇక సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్ జట్టును గెలిపించాడు. 56 బంతుల్లోనే 100 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్‌తో టీమిండియా 106 పరుగుల తేడాతో భారీ విజయం అందుకోవడంలో స్కై కీలక పాత్ర పోషించాడు. మరి గాయం కారణంగా సూర్య జట్టుకు దూరం కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.