ఇకపై మా దేశానికి ఆడను.. పాకిస్థాన్ సీనియర్ బ్యాటర్ షాకింగ్ డెసిషన్!

Pakistan: పాకిస్థాన్ జట్టు పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. వన్డే వరల్డ్ కప్​తో పాటు టీ20 ప్రపంచ కప్​లో దారుణ ఆటతీరుతో ఇంటా బయట విమర్శల పాలవుతోందా టీమ్​. ఈ తరుణంలో దాయాదికి మరో ఎదురుదెబ్బ తగిలింది.

Pakistan: పాకిస్థాన్ జట్టు పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. వన్డే వరల్డ్ కప్​తో పాటు టీ20 ప్రపంచ కప్​లో దారుణ ఆటతీరుతో ఇంటా బయట విమర్శల పాలవుతోందా టీమ్​. ఈ తరుణంలో దాయాదికి మరో ఎదురుదెబ్బ తగిలింది.

పాకిస్థాన్ జట్టు పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. బ్యాక్ టు బ్యాక్ వన్డే వరల్డ్ కప్​తో పాటు టీ20 ప్రపంచ కప్​లోనూ ఆ టీమ్ దారుణ ఆటతీరుతో నిరాశర్చింది. పసికూన కంటే హీనంగా ఆడుతూ ఇంటా బయట విమర్శలు మూటగట్టుకుంది. అసలు గ్రౌండ్​లో ఆడేది పాక్ జట్టేనా అని స్వయంగా ఆ దేశ అభిమానులు, మాజీ క్రికెటర్లే షాక్​ అయ్యేంత చెత్తగా ఆడి పరువు తీసుకుంది. సొంత కోచ్​ గ్యారీ కిర్​స్టెన్ కూడా పాక్​ టీమ్​లో మూడ్నాలుగు గ్రూపులు ఉన్నాయి, ఫిట్​నెస్ స్టాండర్డ్స్​ను ఎవరూ పాటిండం లేదంటూ విమర్శలకు దిగడం వివాదాస్పదంగా మారింది. పాక్​ క్రికెట్​లో జరుగుతున్న ఒక్కో పరిణామం క్రికెటింగ్ దునియాలో ఆ దేశ ప్రతిష్టను దిగజారుస్తోంది. వచ్చే ఏడాది అక్కడ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 జరగనుంది.

తాము ఆతిథ్యం ఇచ్చే ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఇంకో రెండేళ్ల తర్వాత జరిగే టీ20 ప్రపంచ కప్​ను సొంతం చేసుకొని పోయిన పరువును దక్కించుకోవాలని చూస్తోంది పాకిస్థాన్. అలాంటి తరుణంలో పాక్ క్రికెట్​కు మరో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ సీనియర్ బ్యాటర్ షోయబ్ మాలిక్ ఇంటర్నేషనల్ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే వన్డేలు, టెస్టుల నుంచి తప్పుకున్న ఈ స్టార్ ప్లేయర్.. తాజాగా టీ20 ఫార్మాట్​కు కూడా గుడ్​బై చెప్పేశాడు. ఇక మీదట చచ్చినా పాకిస్థాన్​కు ఆడనని స్పష్టం చేశాడు. తన ఇంటర్నేషనల్ కెరీర్ ముగిసిందని, ఇన్నాళ్లూ ఆడినందుకు ఎంతో సంతృప్తిగా ఉందన్నాడు మాలిక్. పాకిస్థాన్​కు ఆడాలనే కోరిక, ఆసక్తి తనకు లేవన్నాడు.

‘ఇన్నేళ్ల పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడినందుకు నేను హ్యాపీ. పాకిస్థాన్​కు ప్రాతినిధ్యం వహించాలనే ఇంట్రెస్ట్ పోయింది. నేను ఆల్రెడీ రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యా. ఇప్పుడు మిగిలిన టీ20 క్రికెట్​కు కూడా గుడ్​బై చెబుతున్నా. ఇక మీదట నాకు అవకాశం దొరికిన ప్రతి లీగ్​లోనూ అదరగొట్టేందుకు ప్రయత్నిస్తా’ అని మాలిక్ స్పష్టం చేశాడు. పాక్ టీ20 జట్టు ఎంపికకు తనను పరిగణనలోకి తీసుకోవద్దని సెలెక్టర్లకు తెలిపాడు. లీగ్స్​లో ఆడుతూ తన గేమ్​ను ఎంజాయ్ చేస్తానని పేర్కొన్నాడు సీనియర్ బ్యాటర్. ఇక, 2001లో అంతర్జాతీయ క్రికెట్​లో డెబ్యూ ఇచ్చిన మాలిక్ ఇప్పటివరకు కంటిన్యూ అవుతూ వచ్చాడు. అతడి రిటైర్మెంట్ వార్త ఇప్పుడు పాక్ క్రికెట్​లో చర్చనీయాంశంగా మారింది.

Show comments