Nidhan
పాక్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మ్యారేజ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అతడిపై నెట్టింట పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. మూడు పెళ్లిళ్లు చేసుకోవడం ఏంటని అందరూ అతడ్ని విమర్శిస్తున్నారు. అయితే మాలిక్ ఎంత మోసపోయాడో చాలా మందికి తెలియదు.
పాక్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మ్యారేజ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అతడిపై నెట్టింట పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. మూడు పెళ్లిళ్లు చేసుకోవడం ఏంటని అందరూ అతడ్ని విమర్శిస్తున్నారు. అయితే మాలిక్ ఎంత మోసపోయాడో చాలా మందికి తెలియదు.
Nidhan
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మ్యారేజ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సెలబ్రిటీల్లో విడాకుల కేసులు కామనే. కానీ ఒకటి, కాదు, రెండు కాదు.. ఏకంగా మూడో పెళ్లి చేసుకోవడంతో అతడిపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఇన్నాళ్లూ అతడు టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో కలిసి ఉన్నాడనే అంతా అనుకున్నారు. కానీ తాను మరో పెళ్లి చేసుకున్నానంటూ సోషల్ మీడియాలో భార్య సనా జావెద్‌తో కలసి షోయబ్ మాలిక్ ఫొటో పెట్టాడు. దీంతో సానియాకు అతడు విడాకులు ఇచ్చిన విషయం బయటపడింది. షోయబ్ పచ్చి మోసగాడు అని సోషల్ మీడియాలో నెటిజన్స్ అతడ్ని విమర్శిస్తున్నారు. సానియా మీర్జాను అతడు మోసం చేశాడని అంటున్నారు. అయితే అందరూ మాలిక్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడనే అంటున్నారు.. కానీ అతడు ఎంత మోసపోయడనేది మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. అవును, ఓ అమ్మాయి చేతిలో మోసపోయాడు మాలిక్.
20 ఏళ్ల వయసులోనే షోయబ్ మాలిక్‌ను ఒక అమ్మాయి మోసం చేసిందనే విషయం చాలా మందికి తెలియదు. 2001లో క్రికెట్ కెరీర్ స్టార్టింగ్ టైమ్‌లో మాలిక్‌కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వైపు నుంచి ఓ అమ్మాయి తన అభిమాని అంటూ అతడితో మాట్లాడటం మొదలుపెట్టింది. దీంతో వాళ్లిద్దరి మధ్య మాటలు కలిశాయి. కొన్నాళ్ల పాటు బాగా మాట్లాడుకున్నారు. దీంతో ఒకరి మీద ఒకరికి ఫీలింగ్స్ ఏర్పడ్డాయి. ఆ అమ్మాయి తన ఫొటోలను మెయిల్ ద్వారా మాలిక్‌కు పంపింది. ఆ తర్వాత అతడ్ని లవ్ చేస్తున్నాంటూ ప్రపోజల్ కూడా పెట్టింది. షోయబ్ కూడా ఇష్టపడుతున్నానని చెప్పాడు. ఆ అమ్మాయి పేరు ఆయేషా సిద్దిఖీ. సౌదీ అరేబియాలో ఉంటున్నానని హైదరాబాద్ తన సొంత ప్రదేశమని అప్పుడప్పుడూ అక్కడికి వెళ్లొస్తుంటానని ఆమె చెప్పింది.
ఆయేషా సిద్దిఖీ చెప్పిన మాటల్ని షోయబ్ మాలిక్ నమ్మాడు. మాటలు, అభిప్రాయాలు, అభిరుచులు, ఇష్టాలు కలవడం.. అమ్మాయి ఫొటోలో బాగుండటంతో ఆమెతో ప్రేమలో పడ్డాడు పాక్ క్రికెటర్. అయితే కలవడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఆమె నిరాకరించింది. పెళ్లితోనే ఒక్కటవుదామంటూ మభ్యపెడుతూ వచ్చింది. మాలిక్‌ను కలిసేందుకు ఒకసారి తన సోదరుడ్ని కూడా పంపింది. కానీ ఆమె మాత్రం రాలేదు. ఒకసారి ఫోన్ చేసి తనను వెంటనే పెళ్లి చేసుకోవాలని బలవంతపెట్టింది.
ఈ రిలేషన్ గురించి తెలిసి వార్తలు బాగా పెరిగాయని.. తన కుటుంబం ఇబ్బంది పడుతోందంని ఆయేషా వాపోవడంతో ఫోన్లోనే నిఖా చేసుకున్నాడు షోయబ్. అయితే తాను మాలిక్ భార్యనంటూ సౌదీలో ఒక టీచర్ చెబుతోందని బంధువు ఎవరో చెప్పగా ఆమె ఫొటోలు చూసి షాకయ్యాడతను. విషయం ఏంటని ఆయేషాకు ఫోన్ చేయగా అంతా తెలిసిపోయింది. తాను చాలా లావుగా ఉంటానని.. అందుకే బదులుగా ఇంకో అమ్మాయి ఫొటోలు పంపానని ఒప్పుకొని క్షమాపణలు చెప్పింది. అయితే ఆ మోసాన్ని తట్టుకోలేని మాలిక్ ఆమెను తన భార్యగా అంగీకరించలేదు. దీంతో డివోర్స్ తీసుకొని 2010లో సానియా మీర్జాను పెళ్లి చేసుకున్నాడు. మరి.. మాలిక్ మూడు పెళ్లిళ్ల వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.