iDreamPost
android-app
ios-app

Shoaib Malik: మూడో పెళ్లి చేసుకున్న షోయబ్‌ మాలిక్‌! సానియా మీర్జాకు విడాకులు ఇచ్చాడా?

  • Published Jan 20, 2024 | 12:22 PM Updated Updated Jan 20, 2024 | 2:50 PM

పాకిస్థాన్‌ క్రికెటర్‌, సానియా మీర్జా మాజీ భర్త షోయబ్‌ మాలిక్‌ తాజాగా మరో పెళ్లి చేసుకున్నాడు. అతని పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

పాకిస్థాన్‌ క్రికెటర్‌, సానియా మీర్జా మాజీ భర్త షోయబ్‌ మాలిక్‌ తాజాగా మరో పెళ్లి చేసుకున్నాడు. అతని పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

  • Published Jan 20, 2024 | 12:22 PMUpdated Jan 20, 2024 | 2:50 PM
Shoaib Malik: మూడో పెళ్లి చేసుకున్న షోయబ్‌ మాలిక్‌! సానియా మీర్జాకు విడాకులు ఇచ్చాడా?

పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ మూడో పెళ్లి చేసుకున్నాడు. గతంలో భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాను నిఖా చేసుకున్న మాలిక్‌.. ఆమెతో కొంతకాలంగా దూరంగా ఉన్నంటున్నట్లు వార్తలు వచ్చాయి కానీ, విడాకులు తీసుకున్నారనే విషయం మాత్రం బయటికి రాలేదు. వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, ఇద్దరూ విడాకులు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నరని కూడా మీడియాలో బాగా ప్రచారం జరిగింది. అయితే.. విడాకులపై అటు మాలిక్‌ కానీ, ఇటు సానియా కానీ ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు.

ఇప్పుడు తాజాగా షోయబ్‌ మాలిక్‌ పాకిస్థాన్‌ నటి సనా జావెద్‌ను నిఖా చేసుకున్నాడు. తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను మాలిక్‌ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. అల్‌హమ్మదులిల్లా అంటూ పేర్కొన్నాడు. కాగా మాలిక్‌ మళ్లీ పెళ్లి చేసుకోవడం మాత్రం సంచలనంగా మారింది. ఎందుకంటే.. సానియాతో విభేదాలు ఉన్నాయని బయటికి వచ్చింది కానీ, విడాకులు కూడా తీసుకున్నారనే విషయం మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అయితే.. ఇప్పటికీ వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారా? లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఇస్లాం ప్రకారం విడాకులు తీసుకున్నారా? గుట్టుచప్పుడు కాకుండా కోర్టు ద్వారానే విడాకులు తీసుకున్నారా? ఒక వేళ కోర్టు ద్వారా విడాకులు తీసుకుంటే.. ఇండియాలో తీసుకున్నారా? పాకిస్థాన్‌లో తీసుకున్నారా? అనే విషయం తెలియాల్సి ఉంది.

ఏది ఏమైనా.. షోయబ్‌ మాలిక్‌ మరో పెళ్లి చేసుకోవడం మాత్రం సంచలనంగా మారింది. అయితే.. షోయబ్‌ మాలిక్‌-సానియా దంపతులకు ఒక కుమారుడు ఉన్న విషయం తెలిసిందే. ఆ పిల్లాడు చాలా కాలంగా తల్లి సానియా వద్దే పెరుగుతున్నాడు. ఆ మధ్య కొడుకు పుట్టిన రోజు సందర్భంగా మాలిక్‌-సానియాలు కలుసుకున్నారు. కానీ, ఫొటోలు మాత్రం కలిసి దిగలేదు. కుమారుడితో విడివిడిగా ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌చేశారు. సానియాను పెళ్లి చేసుకోవడానికి ముందే.. మాలిక్‌ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత సానియాను రెండో వివాహం చేసుకున్నాడు. మరి మాలిక్‌ మూడో పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి:
Harbhajan Singh: అయోధ్యకు వెళ్లి తీరుతాను.. ఎవరు ఆపుతారో చూస్తా: హర్భజన్ సింగ్

పంత్ వచ్చినా, IPLలో అదరగొట్టినా.. టీమిండియాలో చోటు కష్టమే: జహీర్ ఖాన్

 

View this post on Instagram

 

A post shared by Shoaib Malik (@realshoaibmalik)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş