iDreamPost

పంత్ వచ్చినా, IPLలో అదరగొట్టినా.. టీమిండియాలో చోటు కష్టమే: జహీర్ ఖాన్

Zaheer Khan Comments On Rishabh Pant: టీ20 వరల్డ్ కప్ 2024లో రిషబ్ పంత్ ప్లేస్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా దిగ్గజ బౌలర్ జహీర్ ఖాన్.

Zaheer Khan Comments On Rishabh Pant: టీ20 వరల్డ్ కప్ 2024లో రిషబ్ పంత్ ప్లేస్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా దిగ్గజ బౌలర్ జహీర్ ఖాన్.

పంత్ వచ్చినా, IPLలో అదరగొట్టినా.. టీమిండియాలో చోటు కష్టమే: జహీర్ ఖాన్

టీమిండియా స్టార్ క్రికెటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ జట్టులోకి రీ ఎంట్రీ కోసం సిద్దమవుతున్నాడు. కారు ప్రమాదం నుంచి కోలుకున్న పంత్ జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోలను అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉన్నాడు. ఇక ఆ వీడియోల్లో పూర్తి ఫిట్ నెస్ సాధించనట్లుగానే కనిపిస్తున్నాడు ఈ డాషింగ్ బ్యాటర్. దీంతో పంత్ రీ ఎంట్రీ అతి త్వరలోనే ఉంటుందని భావిస్తున్నారు అభిమానులు. ఫస్ట్ ఐపీఎల్ లోకి వచ్చి.. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ ఆడతాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ బౌలర్ జహీర్ ఖాన్ పంత్ రీ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతడికి టీమిండియాలో చోటు కష్టమే అంటూ చెప్పుకొచ్చాడు.

టీ20 వరల్డ్ కప్ 2024.. ప్రస్తుతం టీమిండియాతో పాటుగా అందరి దృష్టి ఈ మెగాటోర్నీపైనే ఉంది. వన్డే వరల్డ్ కప్ 2023 చేజారినా.. ఈ పొట్టి ప్రపంచ కప్ ను మాత్రం కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది భారత జట్టు. అందుకోసం ఇప్పటికే ప్రయోగాల బాట పట్టింది మేనేజ్ మెంట్. ఇదిలా ఉండగా.. స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రీ ఎంట్రీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలోనే పంత్ పునరాగమనంపై టీమిండియా మాజీ క్రికెటర్, దిగ్గజ బౌలర్ జహీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

zaheer khan comments on rishab pant

“రిషబ్ పంత్ తనకు అయిన గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నట్లు కనిపిస్తున్నాడు. అయితే ఓ ప్లేయర్ గా ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొవడం అంత సులువేమీ కాదు. ఇక పంత్ టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇస్తే.. అందరికి సంతోషమే. కానీ ప్రస్తుతం అతడు పూర్తిగా కోలుకుని ఫిట్ నెస్ సాధించడం ముఖ్యం. పైగా రెగ్యూలర్ గా క్రికెట్ ఆడాలి. ఇక పంత్ మునుపటి ఫామ్ ను అందుకోవాలంటే చాలా కష్టపడాలి. ఇవన్నీ చాలా కఠినమైన ఛాలెంజెస్ పంత్ కు. దీంతో ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే.. పంత్ ఐపీఎల్ లో అద్భుతంగా రాణించినా.. సెలెక్టర్లు అతడిని టీ20 వరల్డ్ కప్ జట్టులోకి తీసుకుంటారని నేను భావించడంలేదు. పైగా జట్టులో గత సంవత్సర కాలంగా ఎంతో మంది యంగ్ ప్లేయర్లు వచ్చి సత్తా చాటుతున్నారు. దీంతో అతడికి టీమిండియాలో చోటు కష్టమే” అని చెప్పుకొచ్చాడు జహీర్ ఖాన్. ప్రస్తుతం ఈ కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరి జహీర్ ఖాన్ పంత్ పై చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి