iDreamPost

బాబర్ పై నిప్పులు చెరిగిన అక్తర్.. నిజంగా అది పరమ చెత్త నిర్ణయం అంటూ..!

  • Author Soma Sekhar Published - 05:54 PM, Sat - 4 November 23

తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో పాక్ కెప్టెన్ బాబర్ అజాం తీరుపై మండిపడ్డాడు అక్తర్. అతడు తీసుకున్న ఓ నిర్ణయం పరమ చెత్తది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో పాక్ కెప్టెన్ బాబర్ అజాం తీరుపై మండిపడ్డాడు అక్తర్. అతడు తీసుకున్న ఓ నిర్ణయం పరమ చెత్తది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

  • Author Soma Sekhar Published - 05:54 PM, Sat - 4 November 23
బాబర్ పై నిప్పులు చెరిగిన అక్తర్.. నిజంగా అది పరమ చెత్త నిర్ణయం అంటూ..!

షోయబ్ అక్తర్.. ఎప్పుడూ టీమిండియా ప్లేయర్లను విమర్శిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. కానీ ప్రస్తుతం టీమిండియా సూపర్ ఫామ్ లో ఉండటంతో.. భారత జట్టుపై విమర్శలు చేయడం కాస్త తగ్గించాడు. ఇక ఇదే క్రమంలో సొంత టీమ్ పాకిస్థాన్ ప్రపంచ కప్ లో ఘోరంగా విఫలం అవుతున్న వేళ.. పాక్ టీమ్ ను సందర్భం చిక్కినప్పుడల్లా ఏకిపారేస్తున్నాడు ఈ మాజీ ఆటగాడు. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో పాక్ కెప్టెన్ బాబర్ అజాం తీరుపై మండిపడ్డాడు అక్తర్. అతడు తీసుకున్న ఓ నిర్ణయం పరమ చెత్తది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ప్రపంచ కప్ లో భాగంగా.. శనివారం బెంగళూరు వేదికగా న్యూజిలాండ్-పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ కీలక మ్యాచ్ లో పాక్ బౌలర్లు దారుణంగా విఫలం అయ్యారు. షాహిన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, హసన్ అలీ భారీగా పరుగులు సమర్పించుకుని.. వరల్డ్ కప్ హిస్టరీలోనే తమ పేరిట చెత్త రికార్డులను నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర్ అజాం తొలుత కివీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఇదే బాబర్ చేసిన అతిపెద్ద తప్పిదం అని పాక్ మాజీ ప్లేయర్, స్టార్ పేసర్ షోయబ్ అక్తర్ మండిపడ్డాడు.

అక్తర్ మాట్లాడుతూ..”వరల్డ్ కప్ లో కీలక మ్యాచ్ లో టాస్ గెలిచిన పాక్ టీమ్ మేనేజ్ మెంట్ అండ్ కెప్టెన్ బాబర్ అజాం బౌలింగ్ ఎందుకు ఎంచుకున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇది బాబర్ తీసుకున్న పరమ చెత్త నిర్ణయం. కివీస్ బౌలర్లు గాయాలతో బాధపడుతున్న విషయం తెలిసి కూడా.. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోకుండా బౌలింగ్ తీసుకోవడం ఏంటి? పైగా బెంగళూరు పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని తెలుసు. అయినా గానీ ఇలాంటి పిచ్ పై తొలుత బౌలింగ్ చేయాలనుకోవడం నిజంగా చెత్త నిర్ణయం” అంటూ అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోర్ సాధించింది. జట్టులో నయా సంచలనం రచిన్ రవీంద్ర రికార్డు సెంచరీతో దుమ్మురేపాడు. కివీస్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(108), విలియమ్సన్(95), గ్లెన్ ఫిలిప్స్(41) పరుగులతో అద్భుతమైన బ్యాటింగ్ కనబరిచారు. అనంతరం 402 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. కివీస్ కు దీటుగానే బదులిస్తోంది. స్టార్ ఓపెనర్ ఫకర్ జమాన్ మెరుపు సెంచరీతో కివీస్ బౌలర్లను బెంబేలెత్తిస్తున్నాడు. దీంతో పాక్ 22 ఓవర్లలో160/1 పరుగులతో పటిష్టస్థితిలో నిలిచింది. ఈ క్రమంలో మ్యాచ్ కు వరుణుడు అడ్డుతగిలాడు. ప్రస్తుతం క్రీజ్ లో ఫకర్ జమాన్(106), బాబర్ అజాం(47) రన్స్ తో బ్యాటింగ్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి