iDreamPost
android-app
ios-app

Shivam Dube: టెస్టుల్లోనూ దంచికొడుతున్న శివమ్ దూబే! స్టార్ ప్లేయర్ కు ఎసరు?

  • Published Jan 29, 2024 | 3:56 PM Updated Updated Jan 29, 2024 | 3:56 PM

రంజీ ట్రోఫీ 2024లో దంచికొడుతున్నాడు శివమ్ దూబే. తాజాగా ఉత్తరప్రదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో మెరుపు శతకంతో ఆకట్టుకున్నాడు ఈ స్టార్ ఆల్ రౌండర్.

రంజీ ట్రోఫీ 2024లో దంచికొడుతున్నాడు శివమ్ దూబే. తాజాగా ఉత్తరప్రదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో మెరుపు శతకంతో ఆకట్టుకున్నాడు ఈ స్టార్ ఆల్ రౌండర్.

Shivam Dube: టెస్టుల్లోనూ దంచికొడుతున్న శివమ్ దూబే! స్టార్ ప్లేయర్ కు ఎసరు?

శివమ్ దూబే.. ఇటీవల ఐర్లాండ్ తో జరిగిన మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. వరుసగా రెండు మ్యాచ్ ల్లో 60కి పైగా పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టుకు అద్భుత విజయాలను అందించాడు. ఇక ఇటు బ్యాట్ తోనే కాకుండా మీడియం పేస్ బౌలింగ్ తో సైతం ఆకట్టుకున్నాడు. దీంతో హార్దిక్ పాండ్యా ప్లేస్ లో సరైనోడు దొరికాడని అందరూ ప్రశంసలు కురిపించారు. అయితే టీ20లకే కాదు.. తాను టెస్టు ఫార్మాట్ కు కూడా పనికొస్తానని చాటి చెబుతూ.. టెస్టుల్లోనూ దుమ్మురేపుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ 2024లో దంచికొడుతున్నాడు దూబే. తాజాగా ఉత్తరప్రదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో మెరుపు శతకంతో ఆకట్టుకున్నాడు ఈ స్టార్ ఆల్ రౌండర్.

రంజీ ట్రోఫీ 2024 సీజన్ లో అదరగొడుతున్నాడు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ శివమ్ దూబే. ఇటీవలే ఐర్లాండ్ తో జరిగిన పొట్టి సిరీస్ లో శివతాండవం చేసిన దూబే.. అదే ఫామ్ ను ఇక్కడా చూపిస్తున్నాడు. రంజీల్లో ముంబై టీమ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు దూబే. ఇక ఇక్కడ కూడా తన బ్యాట్ కు పనిచెబుతూ.. అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ సీజన్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే కేరళ టీమ్ పై 51 పరుగులు చేశాడు. ఇక తాజాగా ఉత్తరప్రదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఏకంగా సెంచరీతో కదంతొక్కాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో ముంబై కేవలం 86 రన్స్ కే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ క్రమంలో జట్టుకు అండగా నిలబడ్డాడు శివమ్ దూబే. 110 బంతుల్లో సెంచరీ చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 130 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 117 పరుగులు చేసి ఏడవ వికెట్ గా వెనుదిరిగాడు. దూబే మెరుపు శతకంతో ముంబైకి పోరాడే ఆధిక్యం లభించింది. కేవలం శివమ్ సెంచరీ కారణంగా ఉత్తరప్రదేశ్ ముందు 195 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది ముంబై టీమ్. కేరళతో జరిగిన గత మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో టచ్ లోకి వచ్చిన దూబే.. ఈ మ్యాచ్ లో ఏకంగా శతకంతో అదరగొట్టాడు. భువనేశ్వర్ కుమార్ లాంటి అనుభవం ఉన్న బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్ని ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు ఈ స్టార్ ఆల్ రౌండర్.

ఇదిలా ఉండగా.. దూబే సూపర్ ఫామ్ తో టీమిండియాలో స్టార్ ప్లేయర్ల స్థానాలకు ఎసరు వచ్చింది. మరీ ముఖ్యంగా దారుణంగా విఫలం అవుతున్న శుబ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ ల ప్లేస్ లకు గండిపడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే స్వతహాగా దూబే మిడిలార్డర్ బ్యాటర్ కావడంతో.. గిల్ ప్లేస్ లో కాకుండా అయ్యర్ ప్లేస్ లో అతడిని టెస్టు జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక దూబే ప్రస్తుత ఫామ్ ను చూస్తే.. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ తోనే అతడు ఈ సంప్రదాయ క్రికెట్ లోకి రంగప్రవేశం చేసే ఛాన్స్ లు ఉన్నాయని క్రికెట్ ప్రేమికులతో పాటుగా క్రీడా పండితులు కూడా అంచనా వేస్తున్నారు. మరి రంజీల్లో అద్భుతంగా రాణిస్తున్న దూబే త్వరలోనే టెస్ట్ జట్టులోకి వస్తాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.