SNP
ఆఫ్ఘాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో దుమ్మురేపుతున్న టీమిండియా యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబే.. తాజాగా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ రికార్డుతో ఏకంగా విరాట్ కోహ్లీ సరసన నిలిచాడు. మరి ఆ రికార్డు విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..
ఆఫ్ఘాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో దుమ్మురేపుతున్న టీమిండియా యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబే.. తాజాగా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ రికార్డుతో ఏకంగా విరాట్ కోహ్లీ సరసన నిలిచాడు. మరి ఆ రికార్డు విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా యువ క్రికెటర్ శివమ్ దూబే ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న సిరీస్‌లో దుమ్మురేపుతున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో రెండు వరుస హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు. మొహాలీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 60 పరుగులు చేసి.. టీమిండియాను గెలిపించిన దూబే.. ఆదివారం ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేవలం 32 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సులతో 63 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. మరోసారి టీమిండియా విజయతీరాలకు చేర్చాడు. ఆఫ్ఘాన్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన దూబే.. ఈ రెండు మ్యాచ్‌లతోనే ఏకంగా విరాట్ కోహ్లీ సరసన చేరాడు. ఆ రికార్డు విషయంలో కోహ్లీతో సమంగా నిలిచాడు. మరి ఆ రికార్డ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
శివమ్ దూబే ఆఫ్ఘాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్యాట్‌తో పాటు బాల్‌తోనూ తన వంతు సహకారం అందించాడు. బౌలింగ్‌లో 2 ఓవర్లు వేసి 9 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. అలాగే రెండో టీ20లోనూ బౌలింగ్ వేశాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 3 ఓవర్లు వేసిన దూబే 36 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఇలా టీ20 క్రికెట్‌లో టీమిండియా తరుఫున ఒక ఆటగాడు హాఫ్ సెంచరీ చేయడంతో వికెట్ పడగొట్టడం అనేది యువరాజ్ సింగ్ మూడు సార్లు చేశాడు. మూడు మ్యాచ్‌ల్లో యువీ హాఫ్ సెంచరీ చేయడంతో పాటు కనీసం ఒక్క వికెట్ అయినా పడగొట్టాడు. యువరాజ్ తర్వాత విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం.
విరాట్ కోహ్లీ రెండు సార్లు టీ20ల్లో హాఫ్ సెంచరీ చేయడంతో పాటు బౌలింగ్‌లో వికెట్లు పడగొట్టాడు. కోహ్లీకి టీ20 క్రికెట్‌లో నాలుగు వికెట్లు ఉన్నాయి. వాటిలో రెండు సార్లు హాఫ్ సెంచరీతో పాటు ఒక వికెట్ పడగొట్టాడు. ఇలా రెండు సార్లు చేశాడు. ఇప్పుడు శివమ్ దూబే.. ఆఫ్ఘాన్‌తో తొలి రెండు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు చేయడంతో పాటు రెండు మ్యాచ్‌ల్లోనూ ఒక్కో వికెట్ తీసి.. విరాట్ కోహ్లీ రికార్డను సమం చేసి.. అతని సరసన నిలబడ్డాడు. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. కోహ్లీని అధిగమించి.. లెజెండరీ ఆల్‌రౌండర్ యువీ రికార్డును కూడా శివమ్ బ్రేక్ చేసేలా కనిపిస్తున్నాడు. మరి ఆల్‌రౌండర్‌గా దూబే కోహ్లీ అరుదైన రికార్డును సమం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Most times taking a wicket and scoring a fifty for India in T20is:
Yuvraj Singh – 3.
Virat Kohli – 2.
Shivam Dube – 2*. pic.twitter.com/Eey30TNgXT— Mufaddal Vohra (@mufaddal_vohra) January 15, 2024