iDreamPost
android-app
ios-app

Rahul Dravid: టీమిండియా హెడ్ కోచ్ గా ద్రవిడ్ కి రెస్ట్.. కొత్త కోచ్ ఎవరంటే?

  • Published Dec 16, 2023 | 5:40 PM Updated Updated Dec 16, 2023 | 5:40 PM

సౌతాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్ కు విశ్రాంతి తీసుకున్నాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. దీంతో అతడి ప్లేస్ లోకి మరో కొత్త కోచ్ వచ్చాడు. అతడెవరంటే?

సౌతాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్ కు విశ్రాంతి తీసుకున్నాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. దీంతో అతడి ప్లేస్ లోకి మరో కొత్త కోచ్ వచ్చాడు. అతడెవరంటే?

Rahul Dravid: టీమిండియా హెడ్ కోచ్ గా ద్రవిడ్ కి రెస్ట్.. కొత్త కోచ్ ఎవరంటే?

వరల్డ్ కప్ 2023లో తన అపారం అనుభవం ఉపయోగించి.. టీమిండియాను ఫైనల్ వరకు చేర్చాడు రాహుల్ ద్రవిడ్. కానీ టీమిండియాకు వరల్డ్ కప్ ను మాత్రం అందించలేకపోయాడు. ఈ మెగాటోర్నీలో తన శక్తిమేరకు పోరాడాడు. అయితే వరల్డ్ కప్ ఓటమితో ద్రవిడ్ కాంట్రాక్ట్ కూడా ముగిసిపోయింది. దీంతో అతడిని హెడ్ కోచ్ గా ఉంచాలా? తీసెయ్యాలా? అన్న సుదీర్ఘ చర్చల అనంతరం ద్రవిడ్ కూడా ఒప్పుకోవడంతో అతడిని హెడ్ కోచ్ గా కొనసాగించేందుకు లైన్ క్లీయర్ అయ్యింది. దీంతో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో జరిగిన టీ20 సిరీస్ లకు హెడ్ కోచ్ గా వ్యవహరించాడు. ఇక సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ముగియడంతో.. ద్రవిడ్ కు రెస్ట్ ఇచ్చారు. అతడి స్థానంలో టీమిండియాకు కొత్త కోచ్ వచ్చాడు.

సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. దీంతో భారత జట్టుకు కొత్త కోచ్ ను నియమించింది బీసీసీఐ. అయితే కేవలం వన్డే సిరీస్ కు మాత్రమే ఈ కొత్త కోచ్ అందుబాటులో ఉంటాడు. ఆ తర్వాత సఫారీతో జరిగే టెస్ట్ సిరీస్ కు రాహుల్ ద్రవిడ్ తిరిగి జట్టుతో చేరతాడు. కాగా.. దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ కు బ్యాటింగ్ కోచ్ గా అజయ్ రాత్ర, బౌలింగ్ కోచ్ గా రాజీబ్ దత్తా వ్యవహరించనున్నారు. ఇక టీమిండియా హెడ్ కోచ్ గా ద్రవిడ్ స్థానంలో సితాన్షు కోటక్ కు బాధ్యతలు అప్పగించారు.

కాగా.. సితాన్షు కోటక్ గతంలో నేషనల్ క్రికెట్ అకాడమీలో స్టాఫ్ మెంబర్ గా పనిచేశాడు. ఇక ఇతడు భారత జట్టుకు కోచ్ గా వ్యవహరించడం ఇది రెండో సారి. గతంలో ఐర్లాండ్ తో జరిగిన సిరీస్ లో కోచ్ గా కనిపించాడు సీతాన్షు కోటక్. డిసెంబర్ 17(ఆదివారం) నుంచి ఇండియా-సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఇది ముగిసిన వెంటనే డిసెంబర్ 26 నుంచి రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ప్రారంభం అవుతుంది. అయితే వన్డే సిరీస్ కు ద్రవిడ్ ఎందుకు రెస్ట్ తీసుకున్నాడు అన్నదానిపై క్లారిటీ లేదు. మరి సౌతాఫ్రికా వన్డే సిరీస్ కు కొత్త హెడ్ కోచ్ రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.