iDreamPost
android-app
ios-app

World Cup: ఊహించని గెటప్‌లో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌! జవాన్‌ లుక్‌తో..

  • Published Oct 10, 2023 | 1:04 PM Updated Updated Oct 10, 2023 | 1:04 PM
  • Published Oct 10, 2023 | 1:04 PMUpdated Oct 10, 2023 | 1:04 PM
World Cup: ఊహించని గెటప్‌లో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌! జవాన్‌ లుక్‌తో..

ప్రస్తుతం క్రికెట్‌ అభిమానులంతా వరల్డ్‌ కప్‌ ఫీవర్‌తో ఊగిపోతున్నారు. టీమిండియా సైతం తొలి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టును మట్టికరిపించి.. వరల్డ్‌ కప్‌ వేటను ఘనంగా ఆరంభించింది. ప్రస్తుతం ఇండియాలో వరల్డ్‌ కప్‌ హంగామా నడుస్తోంది. ఈ క్రమంలో ఓ స్టార్‌ క్రికెటర్‌ ఊహించని గెటప్‌లో క్రికెట్‌ ఫ్యాన్స్‌కే కాదు అందరికీ షాకిచ్చాడు. అతనెవరో కాదు టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, మిస్టర్‌ ఐసీసీ ప్లేయర్‌, గబ్బర్‌ శిఖర్‌ ధావన్‌. ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో బాలీవుడ్‌ టాప్‌ హీరో, బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ తాజా చిత్రం జవాన్‌లోని గెటప్‌తో ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేశాడు ధావన్‌. దీంతో ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

శిఖర్‌ ధావన్‌.. టీమిండియా జట్టులో చాలా కాలం క్రితమే స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే. ఫామ్‌లో ఉన్నా కూడా.. జట్టులో యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చేందుకు ధావన్‌ను పక్కనపెడుతూ వచ్చారు. ధావన్‌కు ఐసీసీ ట్రోర్నీల్లో అద్భుతమైన ట్రాక్‌ రికార్డు ఉన్నప్పటికీ.. సెలెక్టెర్లు శుబ్‌మన్‌ గిల్‌ వైపే మొగ్గుచూపారు. అయితే.. గిల్‌ కూడా అద్భుతమైన ఫామ్‌లోనే ఉన్నాడు. టీమిండియాలో భవిష్యత్తు స్టార్‌గా ఎదుగుతున్నాడు. కానీ, వరల్డ్‌ కప్‌ తొలి మ్యాచ్‌ను జ్వరం కారణంగా ఆడలేకపోయాడు. గిల్‌ సంగతి పక్కనపెడితే.. ధావన్‌ మ్యాచ్‌లు ఉన్న సమయంలోనే కాదు.. మ్యాచ్‌ లేనప్పుడు కూడా ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇన్‌స్టాలో రీల్స్‌ చేస్తూ.. ఎప్పుడూ ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. టీమిండియాలోని యువ ఆటగాళ్లతో కలిసి డాన్స్‌లు చేస్తూ, రీల్స్‌ చేస్తూ వారిని కూడా ఉత్సాహపరుస్తుంటాడు. ఇంత సరదాగా ఉంటే ధావన్‌ జీవితంలో కూడా చాలా కష్టాలు, వేదనలు ఉన్నాయనే విషయం కూడా తెలిసిందే. వైవాహిక జీవితంలో ధావన్‌ నరకం చూసి.. ఇటీవలె తన మాజీ భార్య ఆయేషా ముఖర్జీతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తనకు ఎన్ని కష్టాలు, బాధలు ఉన్నా కూడా ధావన్‌ ఎప్పుడూ అలా కనిపించే వాడు కాదు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ.. చాలా సరదాగా ఉండేవాడు. అయితే.. వరల్డ్‌ కప్‌ తర్వాత మళ్లీ టీమిండియాలో స్థానం కోసం ప్రయత్నం చేస్తానని ధావన్‌ చెప్పుకొచ్చాడు. మరి ధావన్‌ ‘జవాన్‌’ గెటప్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: బ్యాటర్‌ నుంచి బుల్లెట్‌ షాట్‌! దండం పెట్టేసిన బౌలర్‌

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap