iDreamPost
android-app
ios-app

VIDEO: బ్యాటర్‌ నుంచి బుల్లెట్‌ షాట్‌! దండం పెట్టేసిన బౌలర్‌

  • Author Soma Sekhar Published - 12:15 PM, Tue - 10 October 23
  • Author Soma Sekhar Published - 12:15 PM, Tue - 10 October 23
VIDEO: బ్యాటర్‌ నుంచి బుల్లెట్‌ షాట్‌! దండం పెట్టేసిన బౌలర్‌

క్రికెట్ లో మనం చిత్ర విచిత్రమైన షాట్లు చూసుంటాం. ఇక ఆ షాట్లకు ఫీల్డర్లు, బౌలర్లు ఇచ్చిన రియాక్షన్లు కూడా ఎన్నో చూశాం. కానీ తాజాగా న్యూజిలాండ్-నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ అనూహ్యమైన షాట్ నమోదు అయ్యింది. కివీస్ బ్యాటర్ కొట్టిన ఆ భారీ షాట్ కు నెదర్లాండ్స్ బౌలర్ వంగి మరీ దండం పెట్టాడు. అయితే ఆ బౌలర్ దండం పెట్టింది భారీ షాట్ కొట్టినందుకు కాదులెండి. దానికి ఓ లెక్కుంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం ఈ షాట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్-నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కివీస్ 99 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. కానీ ఈ మ్యాచ్ లో ఓ అనూహ్యమైన సంఘటన చోటు చేసుకున్న విషయం చాలా మందికి తెలీకపోవచ్చు. కివీస్ టీమ్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో 39వ ఓవర్లలో ఈ సంఘటన జరిగింది. డచ్ బౌలర్ వాన్ మీక్రాన్ వేసిన ఈ ఓవర్ లో రెండో బంతిని బలంగా బాదాడు కివీస్ బ్యాటర్ డారెల్ మిచెల్. ఆ బాల్ కాస్త స్ట్రైట్ గా బౌలర్ కాళ్ల దగ్గర నుంచి వెళ్లి స్టంప్స్ ను బలంగా ఢీకొట్టింది.

ఆ బాల్ ఎంత వేగంగా వచ్చిందంటే? కళ్లు మూసి తెరిచేలోపు స్టంప్స్ నేలకూలాయి. బాల్ బౌలర్ కు తాకి ఉంటే.. కచ్చితంగా కాలు విరిగేదే. ఇక ఈ షాట్ చూసిన వాన్ మీక్రాన్ వంగి మరీ చేతులు జోడించి మిచెల్ కు దండం పెట్టాడు. తనవైపు షాట్ ఆడనందుకు ధన్యవాదాలు అంటూ నమస్కరించాడు డచ్ బౌలర్. ఇక తను ఆడిన షాట్ చూసి, దండం పెట్టడం చూసి షాక్ అయ్యాడు మిచెల్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా.. ఈ మ్యాచ్ లో డారెల్ మిచెల్ 48 పరుగులు చేశాడు. మరి కళ్లు చెదిరే ఈ మెరుపు షాట్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişjojobet girişjojobet girişcasibomcasibomjojobet