Somesekhar
భారత స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్, కోహ్లీ సక్సెస్ సీక్రెట్ రివీల్ చేశాడు. విరాట్ ను నడిపించేది ఆ శక్తే అని పేర్కొన్నాడు. మరి కోహ్లీని నడిపించే శక్తి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
భారత స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్, కోహ్లీ సక్సెస్ సీక్రెట్ రివీల్ చేశాడు. విరాట్ ను నడిపించేది ఆ శక్తే అని పేర్కొన్నాడు. మరి కోహ్లీని నడిపించే శక్తి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Somesekhar
విరాట్ కోహ్లీ.. రికార్డుల రారాజు, రన్ మెషిన్, ఫిట్ నెస్ కా బాప్.. ఇలా అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. ఇక తన బ్యాట్ తో ఎన్నో రికార్డులను నెలకొల్పి, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు ఈ స్టార్ బ్యాటర్. అదీకాక కోహ్లీ అంటే ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లతో పాటుగా యంగ్ క్రికెటర్లకు ఇష్టం. అతడి ఆటతో పాటుగా క్యారెక్టర్, ఇచ్చే సలహాలు ఇలా అన్ని కలిపి కోహ్లీని ఒక అత్యుత్తమ క్రికెటర్ గా నిలిపాయి. అందుకే అతడంటే అందరికీ ఇష్టమే. టీమిండియా దిగ్గజం గంగూలీ సైతం కోహ్లీ ఆట చూడటం తన అదృష్టంగా చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్, కోహ్లీ సక్సెస్ సీక్రెట్ రివీల్ చేశాడు. విరాట్ ను నడిపించేది ఆ శక్తే అని పేర్కొన్నాడు.
ప్రపంచ క్రికెట్ లో విరాట్ కోహ్లీ ఓ సక్సెస్ ఫుల్ క్రికెటర్. అసాధ్యం అనుకున్న రికార్డులను సైతం సుసాధ్యం చేసి చూపాడు. సచిన్ టెండుల్కర్ ఆల్ టైమ్ సెంచరీల రికార్డును ఇటీవలే ముగిసిన వరల్డ్ కప్ లో బద్దలు కొట్టాడు. ఇలా ఒక్కటేమిటి.. చాలా ఘనతలనే తన పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు ఈ రన్ మెషిన్. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కోసం సిద్దమవుతున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్, కోహ్లీ సక్సెస్ కు కారణం ఏంటో చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొని ఈ వివరాలను వెల్లడించాడు.
శిఖర్ ధావన్ మాట్లాడుతూ..”విరాట్ కోహ్లీ గొప్ప సంకల్పం కలవాడు. అతడు ఏదైనా సాధించాలని పట్టుపడితే వదలడు. అదీకాక కోహ్లీకి ఆత్మ విశ్వాసం ఎక్కువ. ఈ రెండింటితో కలిపి అతడికి అతని మీద ఉన్న అపారమైన నమ్మకమే ఓ శక్తిగా మారి కోహ్లీని ముందుకు నడిపిస్తోంది. అదే విరాట్ సక్సెస్ కు కారణం అవుతోంది” అంటూ ధావన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో పలు రకాలుగా నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ వస్తున్నారు. మరి ధావన్ చెప్పినట్లుగా కోహ్లీ సక్సెస్ సీక్రెట్ అదేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Shikhar Dhawan said, “Virat Kohli’s willpower and self belief is very strong. The way he channels his aggression to performance is amazing”. pic.twitter.com/EHwFDmnBHA
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 30, 2024