iDreamPost
android-app
ios-app

వీడియో: స్టార్‌ హీరో పాటకు డ్యాన్స్‌ ఇరగదీసిన శిఖర్‌ ధావన్‌!

  • Published Jul 24, 2023 | 12:54 PM Updated Updated Jul 24, 2023 | 12:54 PM
  • Published Jul 24, 2023 | 12:54 PMUpdated Jul 24, 2023 | 12:54 PM
వీడియో: స్టార్‌ హీరో పాటకు డ్యాన్స్‌ ఇరగదీసిన శిఖర్‌ ధావన్‌!

టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటాడనే విషయం తెలిసిందే. ప్రస్తుతం టీమిండియాలో స్థానం కోల్పో​యిన ధావన్‌ తిరిగి జట్టులోకి వచ్చేందు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అలాగే వీలు చిక్కినప్పుడల్లా సోషల్‌ మీడియాలో రీల్స్‌ చేస్తూ తన ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాడు. తాజాగా తమిళ స్టార్‌ హీరో తలపతి విజయ్‌ లేటెస్ట్‌ మూవీ ‘లియో’లో పాటకు స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ధావన్‌ జోష్‌కు మరె క్రికెటర్‌ పోటీ రాలేడంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. టీమ్‌లో ఉన్నా లేకపోయినా ధావన్‌లో ఎనర్జీ ఏ మాత్రం తగ్గదని అంటున్నారు.

అయితే.. శిఖర్‌ ధావన్‌ తిరిగి టీమిండియాలోకి రావడం కష్టంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం టీమ్‌లో ప్లేస్‌ కోసం యువ క్రికెటర్ల మధ్యనే పోటీ అధికంగా ఉంది. వారిని దాటి ధావన్‌ టీమ్‌లోకి రావడం అసాధ్యమే. కానీ, వన్డే వరల్డ్‌ కప్‌ టీమ్‌లో ధావన్‌కు చోటు దక్కుతుందనే ఆశ ఏదో ఒక మూలన ధావన్‌కు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న రోహత్‌ శర్మ ఓపెనర్‌గా ఫిక్స్‌ అతనికి ఓపెనింగ్‌ పార్ట్నర్‌గా ధావన్‌ చాలా కాలం ఆడాడు. పైగా వీరిద్దరి సక్సెస్‌ఫుల్‌ ఓపెనింగ్‌ పెయిర్‌ కూడా. కానీ, కొన్ని నెలల క్రితం ధావన్‌ను టీమ్‌ నుంచి తప్పించారు. జట్టు నుంచి తప్పించేంత దారుణమైన ఫామ్‌లో ధావన్‌ లేకపోయినా అతని స్పాట్‌ గల్లంతైంది.

కానీ, సీనియర్లకు రెస్ట్‌ ఇస్తూ జూనియర్లతో టీమిండియా ఆడిన పలు సిరీస్‌లకు ధావన్‌ను కెప్టెన్‌గా నియమించి.. పాపం ధావన్‌కు అన్యాయం జరుగుతుందనే అనుమానం రాకుండా చేశారు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 కోసం యంగ్‌ టీమ్‌ను సెట్‌ చేసే క్రమంలోనే కావాలనే ధావన్‌ను పక్కనపెట్టారనే విమర్శలు ఉన్నా.. సెలెక్టర్లు, బీసీసీఐ వాటిని పట్టించుకోలేదు. అయితే.. రోహిత్‌, కోహ్లీ లాంటి సీనియర్లను టచ్‌ చేసే ధైర్యం బీసీసీఐకి లేకపోయినా.. ధావన్‌ మాత్రం మెల్లగా సైడ్‌ చేసేసింది. అయితే.. ధావన్‌ ప్లేస్‌లో శుబ్‌మన్‌ గిల్‌ బాగానే రాణిస్తున్నా.. వరల్డ్‌ కప్‌ లాంటి మెగా టోర్నీలో ఏ మేరకు రాణిస్తాడనే అనుమానం అందరిలో ఉంది. కాగా, ధావన్‌కు బిగ్‌ మ్యాచ్‌ ప్లేయర్‌గా మంచి పేరుంది. పైగా ఐసీసీ టోర్నీల్లో, నాక్‌ అవుట్‌ మ్యాచ్‌ల్లో ధావన్‌ బాగా ఆడతాడు. కానీ, యువ క్రికెటర్లకు ఛాన్స్‌ ఇవ్వలేనే ఒకే ఒక కారణంతో బాగా ఆడుతున్నా కూడా కొన్న మ్యాచ్‌ల్లో విఫలం అయ్యాడని అతన్ని టీమ్‌ను తప్పించారు. మరి ధావన్‌కు టీమిండియాలో నిజంగానే అన్యాయం జరిగిందా? దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కుర్రాళ్ల హార్ట్‌ బ్రేక్‌ చేసిన స్మృతి మంధాన! సింగర్‌తో ఆమె పెళ్లి?