iDreamPost

కుర్రాళ్ల హార్ట్‌ బ్రేక్‌ చేసిన స్మృతి మంధాన! సింగర్‌తో ఆమె పెళ్లి?

  • Published Jul 24, 2023 | 12:11 PMUpdated Jul 24, 2023 | 12:13 PM
  • Published Jul 24, 2023 | 12:11 PMUpdated Jul 24, 2023 | 12:13 PM
కుర్రాళ్ల హార్ట్‌ బ్రేక్‌ చేసిన స్మృతి మంధాన! సింగర్‌తో ఆమె పెళ్లి?

ఇన్ని రోజులు ఉమెన్స్‌ క్రికెట్‌లో రికార్డులు బ్రేక్‌ చేసిన స్మృతి మంధాన.. తాజాగా కుర్రాళ్ల హార్ట్‌ను బ్రేక్‌ చేసింది. మంధాన ఆటకు అందానికి చాలా మంది కుర్రాళ్లు ఫిదా అయ్యారు. సినిమా హీరోయిన్లను మించి స్మృతి మంధానకు అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆమె క్రేజ్‌ నెక్ట్స్‌ లెవెల్‌ అంతే. కానీ, ఇప్పుడా కుర్రాళ్ల హృదాయాలు ముక్కలు చేస్తూ.. మంధాన గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇన్ని రోజులు ఆమె సింగిల్‌ అనుకున్న వారికి ఇది షాకింగ్‌ విషయమే.

స్మృతి మంధాన ఓ సింగర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉందని, అతనితో ఆమె త్వరలోనే ఏడడుగులు వేయనున్నట్లు సమాచారం. మంధాన ఇటీవల అంటే జూలై 18న తన 27వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది. ఆ సమయంలో టీమిండియా బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉండటంతో అక్కడే వేడుకలు చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె బాయ్‌ఫ్రెండ్‌గా చెప్పుకుంటున్న 28 ఏళ్ల పలాష్ ముచ్చల్ కూడా ఢాకా వెళ్లి బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్నాడు. ఇండోర్‌కు చెందిన మ్యూజిక్ కంపోజర్ అయిన పలాష్, ప్రముఖ సింగర్ పాలక్ ముచ్చల్‌కు చిన్న తమ్ముడు. పలాష్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉన్నారు.

మంధాన బర్త్‌డే సందర్భంగా ఢాకా వెళ్లి ఆమెను సర్‌ప్రైజ్‌ చేసిన పలాష్‌.. మ​ంధానతో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. వీరిద్దరూ ఒకరికొకరు చాలా కాలంగా తెలుసుని టాక్‌. వారి పరిచయం ప్రేమగా కూడా మారి చాలా రోజులు అవుతుందని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య పలాష్ బర్త్ డే సందర్భంగా.. అతడితో కలిసి దిగిన ఫొటోలను స్మృతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. పైగా పలాష్ చేతిపై SM18 అనే అక్షరాలను టాటూ వేయించుకోవడంతో వీరిద్దరూ ప్రేమ బంధం నిజమేననే విషయాన్ని బలపరుస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Palaash Muchhal (@palash_muchhal)

ఇదీ చదవండి: వివాదాస్పదంగా మారిన హర్మన్‌ప్రీత్‌ ప్రవర్తన! ఇలా చేయడం కరెక్టేనా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి