iDreamPost
android-app
ios-app

వీడియో: బౌన్సర్‌తో లారా, పీటర్సన్‌ను భయపెట్టిన షేన్‌ వార్న్‌! అదే బౌన్సర్‌ సచిన్‌కు వేస్తే..

  • Published Jul 23, 2024 | 11:32 AMUpdated Jul 23, 2024 | 2:50 PM

Shane Warne, Brian Lara, Kevin Pietersen, Sachin Tendulkar: సరిగ్గా ఐదున్నర అడుగుల ఎత్తు కూడా లేని.. వ్యక్తిని పట్టుకుని క్రికెట్‌ గాడ్‌ అంటారేంటి? అతను అంత తోపు క్రికెటరా? అని సచిన్‌ క్రికెట్‌ వైభావాన్ని చూడని వాళ్లు అంటూ ఉంటారు. ఈ ఒక్క చిన్న ఇన్సిడెంట్‌ తెలుసుకుంటే చాలు.. సచిన్‌ అంటే ఏంటో అర్థమైపోతుంది.

Shane Warne, Brian Lara, Kevin Pietersen, Sachin Tendulkar: సరిగ్గా ఐదున్నర అడుగుల ఎత్తు కూడా లేని.. వ్యక్తిని పట్టుకుని క్రికెట్‌ గాడ్‌ అంటారేంటి? అతను అంత తోపు క్రికెటరా? అని సచిన్‌ క్రికెట్‌ వైభావాన్ని చూడని వాళ్లు అంటూ ఉంటారు. ఈ ఒక్క చిన్న ఇన్సిడెంట్‌ తెలుసుకుంటే చాలు.. సచిన్‌ అంటే ఏంటో అర్థమైపోతుంది.

  • Published Jul 23, 2024 | 11:32 AMUpdated Jul 23, 2024 | 2:50 PM
వీడియో: బౌన్సర్‌తో లారా, పీటర్సన్‌ను భయపెట్టిన షేన్‌ వార్న్‌! అదే బౌన్సర్‌ సచిన్‌కు వేస్తే..

క్రికెట్‌ను మతంలా భావించే ఇండియాలో.. సచిన్‌ టెండూల్కర్‌ను దేవుడిలా ఆరాధిస్తారు. అతన్ని ఎందుకు క్రికెట్‌ గాడ్‌ అంటారో బహుషా ఇప్పటి యంగ్‌ జనరేషన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు తెలియకపోవచ్చు. ఇప్పుడు వాళ్లకు తెలిసిన సూపర్‌ స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలే. కానీ, వారి కంటే ముందు, వాళ్లను మించి ప్రపంచ క్రికెట్‌ను శాసించిన క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌. బాల్‌తో బౌలింగ్‌ మాత్రమే కాదు.. బ్యాటర్ల తలలు కూడా పగలగొట్టేందుకు క్రికెట్‌ ఆడిన డేంజరస్‌ బౌలర్లను సైతం సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.. ఎన్నో గొప్ప గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడాడు. తన స్పిన్‌ మాయాజాలంతో ప్రపంచ క్రికెట్‌ను ఏలిన లెజెండరీ బౌలర్‌ షేన్‌ వార్న్‌ను కలలో కూడా భయపెట్టిన ఏకైక బ్యాటర్‌ సచిన్‌ టెండూల్కర్‌. ఈ విషయం స్వయంగా షేన్‌ వార్న్‌ వెల్లడించాడు.

ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ షేన్‌ వార్న్‌ అంటే ఒక గొప్ప స్పిన్నర్‌ అనుకుంటాం.. కానీ, అతనిలో మరో అద్భుతమైన టాలెంట్‌ కూడా ఉంది. అదేంటంటే.. స్పిన్‌ బౌలింగ్‌లోనే బ్యాటర్లను భయపెట్టేలా మెరుపులాంటి బౌన్సర్లు వేయగలడు. అది కూడా గంటకు 105 కిలో మీటర్ల వేగంతో. ఇది ఒక మీడియం పేసర్‌ వేసే వేగం. అలాంటి వేగంతో స్పిన్‌ ఆడేందుకు రెడీగా ఉన్న బ్యాటర్‌కు సడెన్‌గా తలపైకి బౌన్సర్‌ దూసుకొస్తే ఎలా ఉంటుంది. ఊహించుకుంటునే ఒళ్లు ఝలదరిస్తోంది కదూ. తనకు మాత్రమే సాధ్యమైన ఈ అద్భుతమైన టెక్నిన్‌ను షేన్‌ వార్న్‌ చిన్న చిన్న బ్యాటర్లపై కాకుండా హేమీహేమీ బ్యాటర్లపైనే ప్రయోగించేవాడు. సచిన్‌తో పోటీ పడిన వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియన్‌ లారా సైతం షేన్‌ వార్న్‌ దెబ్బకు అదురుకున్నాడు.

గింగిరాలు తిరిగే బంతికోసం.. కళ్లు పెద్దవి చేసుకుని చూస్తుంటే.. షేన్‌ వార్న్‌ చేతి నుంచి రివ్వున దూసుకుంటూ తలే టార్గెట్‌గా ఒక బౌన్సర్‌ వచ్చింది. అది కూడా 105 కిలో మీటర్ల వేగంతో.. అంతే బ్రియన్‌ లారా గుండె జారిపోయింది. రెప్పపాటు వేగంతో కిందికి ఒంగి తనను తాను రక్షించుకున్నాడు. ఆ సమయంలో లారాను చూస్తే.. పులి పంజా నుంచి కొద్దిలో తప్పించుకున్న జింకపిల్లా అయిపోయాడు. సేమ్‌ అలాంటి బాల్‌నే ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌కు కూడా వేశాడు షేన్‌ వార్న్‌. టెస్టు క్రికెట్‌లోనూ వేగంగా ఆడుతూ.. అగ్రెసివ్‌ క్లాసీ బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న పీటర్సన్‌ సైతం.. షేన్‌ వార్న్‌ ఇచ్చిన షాక్‌కు బిత్తరపోయాడు. 6 అడుగులకు పైగా ఎత్తుండే పీటర్సన్‌ సైతం షేన్‌ వార్న్‌ బౌన్సర్‌ చూసి.. గన్‌ నుంచి దూసుకొచ్చిన బుల్లెట్‌ తనకు పక్కగా వెళ్లిపోయిందా? అనేంతలా ఆశ్చర్యపోతూ చూశాడు.

ఇలా.. ప్రపంచ క్రికెట్‌లో గొప్ప బ్యాటర్లుగా పేరున్న ఇద్దరు బ్యాటర్లను తన బౌన్సర్లతో భయపెట్టిన షేన్‌ వార్న్‌.. ఒకసారి క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ను కూడా తన బౌన్సర్‌తో భయపెడదాం అనుకున్నాడు. లారా, పీటర్సన్‌ లానే తప్పించుకుని.. సచిన్‌ కూడా షాక్‌ అవుతాడని వార్న్‌ భావించి ఉంటాడు. కానీ, అక్కడుంది దేవుడని బహుషా అతను మర్చిపోయి ఉంటాడు. తనపైకి దూసుకొస్తున్న సింహాన్ని సైతం వేటాడే వేటగాడు సచిన్‌ టెండూల్కర్‌. లారా, పీటర్సన్‌కు వేసినట్లే.. సచిన్‌కు కూడా స్పిన్‌ వేస్తూ వేస్తూనే మెరుపు వేగంతో ఒక బౌన్సర్‌ వేశాడు. ఆ బాల్‌ను సచిన్‌ టెండూల్కర్‌ అప్పర్‌ కట్‌తో ఫస్ట్‌ స్లిప్‌లో నిల్చున్న మ్యాథ్యూ హేడెన్‌ పైనుంచి బౌండరీకి తరలించాడు.

బౌన్సర్‌ వచ్చినందుకు ఏ మాత్రం షాక్‌ అవ్వని సచిన్‌.. దాన్ని తనకు అనుకూలంగా మల్చుకుని బౌండరీ సాధించాడు. సచిన్‌ కొట్టిన ఆ షాట్‌తో స్లిప్‌లో నిల్చున్న హేడెన్‌ షాక్‌ అయ్యాడు. సాధారణంగా స్లిప్‌లో నిల్చుంటే.. బాల్ ఎడ్జ్‌ తీసుకొని రావాలి.. కానీ, సచిన్‌ మాత్రం పైనుంచి ఇంటెంట్‌ షాట్‌ ఆడాడు. అప్పుడు అర్థమైంది షేన్‌ వార్న్‌ సచిన్‌ అంటే ఏంటో. వెంటనే తన అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాన్ని ముక్కలుముక్కలు చేసిన సచిన్‌లో షేన్‌ వార్న్‌ క్రికెట్‌ దేవుడిని చూశాడు. వెంటనే చిరునవ్వుతో సచిన్‌ టెండూల్కర్‌ విశ్వరూపానికి నమస్కరించాడు. ఒకే విధమైన బౌన్సర్‌కు లారా, పీటర్సన్‌ వణికిపోతే.. సచిన్‌ మాత్రం బౌండరీ కొట్టాడు. ఇలాంటి సంఘటనలు, సందర్భాలు ఎన్నో ఉన్నాయి సచిన్‌ కెరీర్‌. అందుకే.. రెండు దశాబ్దాలకు పైగా ప్రపంచ క్రికెట్‌ను రారాజులా ఏలాడు. సచిన్‌ అంటే పేరు కాదు.. క్రికెట్‌ విశ్వరూపం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి