iDreamPost
android-app
ios-app

వీడియో: గ్రౌండ్‌లోనే గొడవకు దిగిన పాక్‌ క్రికెటర్లు! ఏం జరిగిందంటే?

  • Published Mar 08, 2024 | 4:54 PM Updated Updated Mar 08, 2024 | 4:54 PM

గ్రౌండ్ లోనే ఇద్దరు పాకిస్తాన్ క్రికెటర్లు గొడవకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి మ్యాచ్ మధ్యలోనే ఫైట్ కు దారితీసిన కారణం ఏంటి? ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

గ్రౌండ్ లోనే ఇద్దరు పాకిస్తాన్ క్రికెటర్లు గొడవకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి మ్యాచ్ మధ్యలోనే ఫైట్ కు దారితీసిన కారణం ఏంటి? ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

వీడియో: గ్రౌండ్‌లోనే గొడవకు దిగిన పాక్‌ క్రికెటర్లు! ఏం జరిగిందంటే?

క్రికెట్ మ్యాచ్ ల్లో జరిగే కొన్ని కొన్ని సంఘటనలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి షాకింగ్ ఇన్నిడెంట్స్ అన్ని బహుశా పాకిస్తాన్ సూపర్ లీగ్ లోనే జరుగుతున్నాయి అనుకుంటా. పీఎస్ఎల్ అంటే వింతలకు మారుపేరుగా మారిపోయింది. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ ఇలా ప్రతీ విషయంలో వెరైటీగా నిలుస్తూ వస్తోంది. ఇటీవలే రివ్యూ విషయంలో ఇద్దరు కెప్టెన్లు గ్రౌండ్ లోనే యుద్ధానికి దిగిన విషయం మరువకముందే.. మరో ఫైట్ జరిగింది. మ్యాచ్ మధ్యలోనే మైదానంలోనే గొడవకు దిగారు పాక్ క్రికెటర్లు.

పాకిస్తాన్ సూపర్ లీగ్.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. పరమ చెత్త ఫీల్డింగ్ తో పాక్ క్రికెటర్లు ఇప్పటికీ విమర్శలపాలవుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి ఈ లీగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ లీగ్ లో భాగంగా ఇస్లామాబాద్ యూనైటెడ్ వర్సెస్ కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇస్లామాబాద్ ప్లేయర్ షాదాబ్ ఖాన్, కరాచీ కింగ్స్ కెప్టెన్ షాన్ మసూద్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరు ఫైటింగ్ వరకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?

కరాచీ బౌలర్ మహ్మద్ నవాజ్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో నాలుగో బంతిని ఆఘా సల్మాన్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ అది మిస్ అయ్యి బాల్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో ఔట్ అని అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. షాన్ మసూద్ రివ్యూ కోరగా.. అప్పటికే టైమ్ అయిపోయింది. ఇదే విషయాన్ని షాదాబ్ చెప్పాడు. ఈ మాటకు మసూద్ కోపంతో ఊగిపోయాడు. నేను అంపైర్ ను అడుగుతున్నాను.. మధ్యలో నువ్వెందుకు వస్తున్నావ్, నీకేం పని అంటూ షాదాబ్ తో మాటల యుద్ధానికి దిగాడు మసూద్.

కాగా.. అప్పటి వరకు షాదాబ్ ఓపికపట్టుకుని.. నువ్వు పాకిస్తాన్ టీమ్ కు కెప్టెన్ వి, నీ పద్దతి ఇదేనా అంటూ షాదాబ్ రివర్స్ ఎటాక్ కు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. పరిస్థితి చేయిదాటిపోతోందని గమనించిన సహచర ఆటగాళ్లు ఇద్దరిని పక్కకు జరిపారు. లేకపోతే.. గ్రౌండ్ లో డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్ చూసేవాళ్లమే. అయితే సొంత జట్టు ఆటగాడు అని కూడా చూడకుండా గొడవలు పెట్టుకోవడం పాక్ ప్లేయర్లకు సాధారణమైపోయింది. ఇక మ్యాచ్ విషయాని వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 150 పరుగులు చేసింది. అనంతరం 151 పరుగుల టార్గెన్ ను ఇస్లామాబాద్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరి పాక్ క్రికెటర్ల మధ్య జరిగిన ఈ వాగ్వాదం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: BJPలోకి టీమిండియా క్రికెటర్‌ షమీ! MPగా ఎన్నికల బరిలోకి..?