iDreamPost

BJPలోకి టీమిండియా క్రికెటర్‌ షమీ! MPగా ఎన్నికల బరిలోకి..?

టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ త్వరలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడట. ఇందుకు సంబంధించి జోరుగా చర్చ జరుగుతోంది. అతడు నిజంగానే MPగా పోటీ చేస్తాడా? చేస్తే.. ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతాడు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ త్వరలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడట. ఇందుకు సంబంధించి జోరుగా చర్చ జరుగుతోంది. అతడు నిజంగానే MPగా పోటీ చేస్తాడా? చేస్తే.. ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతాడు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

BJPలోకి టీమిండియా క్రికెటర్‌ షమీ! MPగా ఎన్నికల బరిలోకి..?

టీమిండియా స్టార్ క్రికెటర్, వరల్డ్ కప్ 2023 హీరో మహ్మద్ షమీ త్వరలోనే రాజకీయ రంగప్రవేశం చేయనున్నాడన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున అతడు బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఒకవేళ షమీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే.. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడు? అతడు నిజంగానే MPగా పోటీ చేస్తాడా? ఈ న్యూస్ వైరల్ కావడానికి కారణాలు ఏంటి? పూర్తి వివరాలను ఓసారి పరిశీలిద్దాం.

దేశ రాజకీయాల్లోకి మరో స్టార్ క్రికెటర్ ఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఎంతో మంది దిగ్గజ ఆటగాళ్లు పాలిటిక్స్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. షమీ బీజేపీలో చేరనున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వెల్లడిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ లోని బసిర్ హత్ నియోజకవర్గం నుంచి షమీని బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోంది. దీంతో అక్కడి మైనార్టీ ఓట్లను ఆకర్షించాలనేది బీజేపీ ప్లాన్. అందులో భాగంగానే ఎంపీగా షమీని నిలబెట్టాలన్నది పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గ ఎంపీగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి నుస్రత్ జహాన్ ఉన్నారు.

కాగా.. ఎన్నికల్లో పోటీ విషయమై, ఇప్పటికే భారతీయ జనతా పార్టీ షమీని సంప్రదించినట్లు, వారి మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయని సమాచారం. అయితే షమీ మాత్రం తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ స్టార్ బౌలర్ తన కాలికి సర్జరీ చేయించుకుని రెస్ట్ తీసుకుంటున్నాడు. దీంతో ఈ సీజన్ ఐపీఎల్ టోర్నీకి దూరమైయ్యాడు. గత వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయిన టీమిండియా ఆటగాళ్లను డ్రస్సింగ్ రూమ్ లో ఓదార్చారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన షమీని ప్రత్యేకంగా అభినందించారు మోదీ. బహుశా అతడిని ఎన్నికల బరిలోకి దించాలన్న ఆలోచనకు ఇక్కడే బీజం పడి ఉండొచ్చు అన్నది కొందరి క్రీడా పండితుల ఆలోచన. మరి షమీ రాజకీయ రంగప్రవేశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: రోహిత్ అరుదైన ఘనత.. క్రిస్ గేల్ ఆల్ టైమ్ రికార్డు బ్రేక్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి