వరల్డ్ కప్ ముంగిట బంగ్లా స్టార్ ఆల్ రౌండర్, కెప్టెన్ షకీబ్ అల్ హసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే బంగ్లా సీనియర్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ వరల్డ్ కప్ జట్టులో ఉంటే తాను కెప్టెన్సీకి రాజీనామా చేయడమే కాకుండా.. వరల్డ్ కప్ లో ఆడనంటూ బంగ్లా క్రికెట్ బోర్డ్ కు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో సంచలన ప్రకటనతో వార్తల్లో నిలిచాడు ఈ స్టార్ క్రికెటర్. త్వరలోనే అన్ని ఫార్మాట్స్ నుంచి వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు. జట్టు మేనేజ్ మెంట్ కోరినందువల్లే వన్డే టీమ్ సారథిగా పగ్గాలు చేపట్టానని, ఇది టీమ్ ప్రయోజనాల కోసమే తీసుకున్న నిర్ణయం అని షకీబ్ పేర్కొన్నాడు.
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, కెప్టెన్ షకీబ్ అల్ హసన్ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. టెస్టులకు 2023లో, టీ20లకు 2024లో, వన్డేలకు 2025లో వీడ్కోలు పలుకుతున్నట్లు ఓ స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ తెలిపాడు. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పనున్నాడు ఈ స్టార్ ఆల్ రౌండర్. షకీబ్ టీ-స్పోర్ట్స్ తో మాట్లాడుతూ..”నేను అంతర్జాతీయ క్రికెట్ లో 2025 వరకు కొనసాగే అవకాశాలు మాత్రమే ఉన్నాయి. అయితే వన్డే ఫార్మాట్ లో ఛాంపియన్స్ ట్రోఫీలో భాగమవ్వాలనుకుంటున్నాను. అయితే నేను ఒకేసారి అన్ని ఫార్మాట్ల నుంచి వీడ్కోలు తీసుకునే అవకాశం లేకపోలేదు. భవిష్యత్ మన చేతుల్లో లేదు” అంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు షకీబ్.
కాగా.. వరల్డ్ క్లాస్ ఆల్ రౌండర్ గా గుర్తింపు సంపాదించుకున్న షకీబ్ కెరీర్ విషయానికి వస్తే.. 66 టెస్టుల్లో 4454 పరుగులతో పాటు 233 వికెట్లు, 240 వన్డేల్లో 7384 రన్స్ తో పాటు 308 వికెట్లు తీయగా.. 117 టీ20ల్లో 2382 పరుగులు బాది 140 వికెట్లు సాధించాడు. బంగ్లాదేశ్ క్రికెట్ ను ప్రపంచ స్థాయి జట్టుగా తీర్చిదిద్దడంలో షకీబ్ కీలకపాత్ర వహించాడనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. మరి షకీబ్ రిటైర్మెంట్ పై తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Shakib Al Hasan is likely to retire from Tests in 2023, T20I in 2024 & ODI in 2025. [T-Sports] pic.twitter.com/8XbojtSZkD
— Johns. (@CricCrazyJohns) September 28, 2023