ప్రాక్టీస్ మ్యాచ్ కు ముందు.. రోహిత్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన షకీబ్! ఏమన్నాడంటే?

బంగ్లాదేశ్ తో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్ కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు బంగ్లా స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్. రోహిత్ కు అందుకే రెస్పెక్ట్ ఇస్తున్నారని షకీబ్ అన్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

బంగ్లాదేశ్ తో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్ కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు బంగ్లా స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్. రోహిత్ కు అందుకే రెస్పెక్ట్ ఇస్తున్నారని షకీబ్ అన్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రపంచ వ్యాప్తంగా టీ20 వరల్డ్ కప్ ఫీవర్ స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం వార్మప్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విండీస్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆసీస్ 35 పరుగులు తేడాతో ఓటమిపాలైంది. ఇక వార్మప్ మ్యాచ్ లో మరో కీలక పోరుకు రంగం సిద్దమైంది. బంగ్లాదేశ్ తో తలపడనుంది టీమిండియా. వార్మప్ మ్యాచే అయినప్పటికీ.. క్రికెట్ ప్రేమికులు ఈ పోరు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు బంగ్లా స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్.

షకీబ్ అల్ హసన్.. వివాదాలతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. కొన్ని రోజుల క్రితం ఓ అభిమానిపై చేయిచేసుకున్న సంఘటన మరిచిపోకముందే.. గ్రౌండ్ మెన్ సెల్ఫీ అడిగితే.. సెల్ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. పొట్టి ప్రపంచ కప్ లో భాగంగా జూన్ 1న ఇండియాతో వార్మప్ మ్యాచ్ ఆడనుంది బంగ్లాదేశ్. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు షకీబ్ అల్ హసన్.

రోహిత్ శర్మ గురించి షకీబ్ మాట్లాడుతూ..”గత కొన్ని సంవత్సరాలుగా రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్సీతో జట్టుకు విజయాలు అందిస్తూ వస్తున్నాడు. కెప్టెన్ గా అతడు అద్భుతమైన రికార్డ్స్ కలిగిఉన్నాడు. ఇక రోహిత్ టీమ్ ను లీడ్ చేసే విధానం అమోఘం. ప్రత్యర్థి నుంచి ఒంటి చేత్తో మ్యాచ్ ను లాగేసుకుంటాడు. అతడి నాయకత్వ ప్రతిభ, ఇతర ప్లేయర్ల పట్ల ప్రేమ కారణంగానే యువ క్రికెటర్లు, సహచరులు, ఇతర దేశాల ఆటగాళ్లు అతడికి రెస్పెక్ట్ ఇస్తారు” అంటూ చెప్పుకొచ్చాడు షకీబ్. ప్రాక్టీస్ మ్యాచ్ కు ముందు బంగ్లా స్టార్ ఆల్ రౌండర్ షకీబ్.. రోహిత్ పై ప్రశంసలు కురిపించడం ఆసక్తికరంగా మారింది. ఇక వరల్డ్ కప్ కోసం టీమిండియా కఠోర సాధనను ప్రారంభించింది. నెట్స్ లో ప్లేయర్లు చెమటోడుస్తున్నారు.

Show comments