iDreamPost
android-app
ios-app

షకీబ్ కు మాథ్యూస్ శాపం.. వరల్డ్ కప్ కు దూరం!

  • Author Soma Sekhar Published - 08:49 AM, Wed - 8 November 23

మాథ్యూస్ టైమ్డ్ ఔట్.. ప్రస్తుతం వరల్డ్ కప్ లో చర్చనీయాంశంగా మారిన అంశం. ఈ విషయంలో బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు పలువురు మాజీ క్రికెటర్లు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అనూహ్యంగా వరల్డ్ కప్ కు దూరం అయ్యాడు షకీబ్. దీంతో కర్మ అంటే ఇదే షకీబ్, మాథ్యూస్ ను ఔట్ చేసిన పాపం తగిలింది నీకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్, నెటిజన్లు. అసలేం జరిగిందంటే?

మాథ్యూస్ టైమ్డ్ ఔట్.. ప్రస్తుతం వరల్డ్ కప్ లో చర్చనీయాంశంగా మారిన అంశం. ఈ విషయంలో బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు పలువురు మాజీ క్రికెటర్లు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అనూహ్యంగా వరల్డ్ కప్ కు దూరం అయ్యాడు షకీబ్. దీంతో కర్మ అంటే ఇదే షకీబ్, మాథ్యూస్ ను ఔట్ చేసిన పాపం తగిలింది నీకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్, నెటిజన్లు. అసలేం జరిగిందంటే?

  • Author Soma Sekhar Published - 08:49 AM, Wed - 8 November 23
షకీబ్ కు మాథ్యూస్ శాపం.. వరల్డ్ కప్ కు దూరం!

ప్రపంచ కప్ 2023 సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ వస్తోంది. విజయాలకు సంబంధించి చిన్న జట్లు పెద్ద టీమ్ లకు షాకిస్తే.. వివాదాలు కూడా అదే రేంజ్ లో హాట్ టాపిక్ గా మారుతూ వస్తున్నాయి. తాజాగా వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్ లో లంక స్టార్ బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్ వివాదం వరల్డ్ క్రికెట్ లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయంలో బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ పై వరల్డ్ వైడ్ గా విమర్శలు గుప్పిస్తున్నారు పలువురు మాజీ క్రికెటర్లు. కొందరు సరైనదే అంటుంటే.. మరికొందరు మాత్రం అది నిబంధనలకు విరుద్దమంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. లంకతో మ్యాచ్ తర్వాత వరల్డ్ కప్ కు దూరం అయ్యాడు బంగ్లా సారథి షకీబ్. దీంతో మాథ్యూస్ ను ఔట్ చేసిన శాపం తగిలిందని, కర్మ ఈజ్ బ్యాక్ అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

మాథ్యూస్ టైమ్డ్ ఔట్.. ప్రస్తుతం వరల్డ్ కప్ లో చర్చనీయాంశంగా మారిన అంశం. బంగ్లాదేశ్ తో తాజాగా జరిగిన మ్యాచ్ లో లంక బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ విచిత్రంగా టైమ్డ్ ఔట్ ద్వారా పెవిలియన్ చేరాడు. అయితే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా మాథ్యూస్ బంగ్లా సారథి షకీబ్ అల్ హసన్ ను కోరాడు. కానీ అందుకు షకీబ్ అందుకు ఒప్పుకోలేదు. దీంతో చేసేదేమీ లేక మాథ్యూస్ డ్రస్సింగ్ రూమ్ వైపు అడుగులు వేశాడు. ఇక ఈ మ్యాచ్ లో 82 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు షకీబ్. బౌలింగ్ లో రెండు వికెట్లు కూడా తీసుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తాజాగా ఆడిన మ్యాచే బంగ్లా సారథికి ఈ వరల్డ్ కప్ లో ఆఖరి మ్యాచ్ గా మారింది.

లంకతో మ్యాచ్ సందర్భంగా షకీబ్ ఎడమ చేతి చూపుడు వేలికి గాయమైంది. ఈ గాయానికి సంబంధించి ఎక్స్ రే తీయగా.. వేలికి ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు తెలిపారు. గాయం తీవ్రంగా ఉండటంతో.. కోలుకోవడానికి కనీసం మూడు నుంచి నాలుగు వారాల టైమ్ పడుతుందని బంగ్లా ఫిజియో ఇస్లామ్ ఖాన్ తెలిపాడు. దీంతో అతడు బంగ్లాదేశ్ వెళ్లిపోనున్నట్లు వివరించాడు. షకీబ్ గాయం కారణంగా వరల్డ్ కప్ కు పూర్తిగా దూరం కావడంతో.. కర్మ అంటే ఇదే షకీబ్, మాథ్యూస్ ను ఔట్ చేసిన పాపం తగిలింది నీకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్, నెటిజన్లు. మనం చేసిందే మనకు తిరిగి వస్తుంది అన్న కర్మ సిద్దాంతాన్ని దీనికి అన్వయిస్తూ.. సోషల్ మీడియా వేదికగా పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. కాగా.. ఈ వరల్డ్ కప్ లో బంగ్లాను ముందుండి నడిపించడంలో పూర్తిగా విఫలం అయ్యాడు షకీబ్. ఈ విశ్వసమరంలో ఆఫ్గాన్, శ్రీలంకపై గెలుపొంది.. నెదర్లాండ్స్ లాంటి పసికూన చేతిలో దారుణంగా ఓటమిపాలైయ్యారు.

ఇక ఇప్పటికే వరల్డ్ కప్ లో సెమీస్ కు దూరమైన బంగ్లాకు మరో కఠిన సమస్య ఎదురుకానుంది. నవంబర్ 11న ఆసీస్ తో జరిగే మ్యాచ్ లో బంగ్లాదేశ్ తప్పకుండా గెలిచితీరాలి. లేకపోతే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా దూరం అవుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ 8లో నిలిస్తేనే ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించే వీలుంటుంది బంగ్లా టీమ్ కు. ఈ క్రమంలో ఆసీస్ తో మ్యాచ్ కీలకం కానుంది. ఇలాంటి తరుణంలో షకీబ్ లాంటి కీలక ప్లేయర్ జట్టుకు దూరం కావడం బంగ్లా టీమ్ కు భారీ షాకనే చెప్పాలి. మరి మథ్యూస్ ఔట్ విషయంలో షకీబ్ చేసింది తప్పా? అందుకే ఈ శాపం తగిలిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి