Somesekhar
బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. పాక్ తో జరిగిన తొలి టెస్ట్ లో 4 వికెట్లు తీసుకోవడం ద్వారా వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. పాక్ తో జరిగిన తొలి టెస్ట్ లో 4 వికెట్లు తీసుకోవడం ద్వారా వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
Somesekhar
పాకిస్థాన్ తో జరిగిన తొలిటెస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. అన్ని విభాగాల్లో అదరగొట్టిన బంగ్లా ప్లేయర్లు పాక్ ను 10 వికెట్ల తేడాతో వారి గడ్డపైనే చిత్తు చేశారు. తద్వారా వారి దేశంలోనే వారిని 10 వికెట్ల తేడాతో ఓడించిన తొలి జట్టుగా బంగ్లాదేశ్ నిలిచింది. ఇక ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. తొలి టెస్ట్ మ్యాచ్ లో 4 వికెట్లు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. పాక్ తో జరిగిన తొలి టెస్ట్ లో 4 వికెట్లు తీసుకోవడం ద్వారా వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గా అగ్రస్థానంలో నిలిచాడు షకీబ్. ఈ క్రమంలో న్యూజిలాండ్ దిగ్గజ బౌలర్ డానియల్ వెట్టోరి రికార్డును బ్రేక్ చేశాడు. వెట్టోరి 498 ఇన్నింగ్స్ ల్లో 705 వికెట్లు తీయగా.. షకీబ్ 482 ఇన్నింగ్స్ ల్లో 707 వికెట్లు పడగొట్టాడు.
ఇక ఈ జాబితాలో మూడో స్థానంలో టీమిండియా స్టార్ రవీంద్ర జడేజా 568 వికెట్లు, రంగనా హెరాత్ 525, సనత్ జయసూర్య 440 వికెట్లతో టాప్ 5లో ఉన్నారు. కాగా.. ఓవరాల్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన లిస్ట్ లో షకీబ్ 16వ స్థానంలో ఉండగా.. శ్రీలంక దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీ ధరన్ 1347 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. మరి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లలో మోస్ట్ వికెట్ టేకర్ గా నిలిచిన షకీబ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Shakib Al Hasan goes past Daniel Vettori and becomes the leading wicket-taker among left-arm spinners in international cricket. pic.twitter.com/FK4etOm9Zx
— CricTracker (@Cricketracker) August 25, 2024