iDreamPost
android-app
ios-app

VIDEO: బాహుబలినే బాదేశాడ్రా స్వామి! ఒకే ఓవర్‌లో..

  • Published Sep 18, 2023 | 4:14 PM Updated Updated Sep 18, 2023 | 4:14 PM
  • Published Sep 18, 2023 | 4:14 PMUpdated Sep 18, 2023 | 4:14 PM
VIDEO: బాహుబలినే బాదేశాడ్రా స్వామి! ఒకే ఓవర్‌లో..

వెస్టిండీస్‌ గడ్డపై జరుగుతున్న కరేబియన్‌ లీగ్‌ 2023లో గయాన అమెజాన్‌ బ్యాటర్‌ షాయ్‌ హోప్‌ సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆదివారం గయానా వేదికగా బార్బోడోస్‌ రాయల్స్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడి హోప్‌.. ఆ టీమ్‌లోని బాహుబలి రహ్కీమ్‌ కార్న్‌వాల్‌ బౌలింగ్‌నైతే చీల్చి చెండాడు. మొత్తంగా.. 44 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సులతో 106 పరుగులు చేసి.. అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. హోప్‌ చెలరేగడంతో గయానా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 226 పరుగులు చేసింది.

గయానా ఇన్నింగ్స్‌లో ముఖ్యంగా కార్న్‌వాల్‌ వేసిన 16వ ఓవర్‌ గురించి మాట్లాడుకోవాలి. ఆ ఓవర్‌లో హోప్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 4, 6, 6, 6, 4, 6 ఏకంగా 32 పరుగులు పిండుకున్నాడు. అవుట్‌సైడ్‌ ఆఫ్‌గా వేసిన తొలి బంతిని గుంచి లాంగ్‌ దిశగా ఫోర్‌ కొట్టాడు. రెండో బంతిని డీప్‌ మిడ్‌ వికెట్‌ పైనుంచి సిక్స్‌ బాదేశాడు. మూడో బంతి కూడా సేమ్‌ షాట్‌ సేమ్‌ రిజల్ట్‌ వచ్చింది. నాలుగో బంతిని కూడా డిప్‌ మిడ్‌ వికెట్‌ పైనుంచే సిక్స్‌ కొట్టాడు. ఇలా వరుసగా మూడు సిక్సులు వచ్చాయి. ఐదో బంతిని డీప్‌ కవర్స్‌లోకి ఫోర్‌ కొట్టాడు. ఆఖరి బంతికి కూడా కార్న్‌వాల్‌ను బతకనివ్వలేదు. డీప్‌ స్క్వౌర్‌ లెగ్‌ వైపు భారీ సిక్స్‌ బాగాడు. దీంతో ఆ ఒక్క ఓవర్లోనే 32 పరుగులు సమర్పించుకున్నాడు బాహుబలి.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గయానా అమెజాన్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. షాయ్‌ హోప్‌(106)తో పాటు కెల్వన్‌ అండర్సన్‌(47) పరుగులతో రాణించాడు. రాయల్స్‌ బౌలర్లలో హోల్డర్‌, మెకాయ్‌ రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఇక 227 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన బార్బోడోస్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 138 పరుగులకే పరిమితమై.. 88 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. రాయల్స్‌ టీమ్‌లో రివాల్డో క్లార్కీ 43 బంతుల్లో 8 ఫోర్లతో 54 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి రాణించాడు. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలం అయ్యారు. ఒకే ఓవర్‌లో 32 పరుగులు సమర్పించుకున్న కార్న్‌వాల్‌ ఓపెనర్‌గా వచ్చి.. 9 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చాడు. మరి ఈ మ్యాచ్‌లో బాహుబలి కార్న్‌వాల్‌ ఒకే ఓవర్‌లో 32 పరుగులు ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సిరాజ్‌కు బౌలింగ్‌ ఇవ్వొద్దని చెప్పారు! అందుకే 7 ఓవర్లకే ఆపేశా: రోహిత్‌