iDreamPost

సిరాజ్‌కు బౌలింగ్‌ ఇవ్వొద్దని చెప్పారు! అందుకే 7 ఓవర్లకే ఆపేశా: రోహిత్‌

  • Published Sep 18, 2023 | 2:08 PMUpdated Sep 18, 2023 | 2:15 PM
  • Published Sep 18, 2023 | 2:08 PMUpdated Sep 18, 2023 | 2:15 PM
సిరాజ్‌కు బౌలింగ్‌ ఇవ్వొద్దని చెప్పారు! అందుకే 7 ఓవర్లకే ఆపేశా: రోహిత్‌

ఆసియా కప్‌ 2023 ఫైనల్‌లో శ్రీలంకను టీమిండియా చిత్తుగా ఓడించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను భారత పేసర్లు వణికించారు. తొలుత జస్ప్రీత్‌ బుమ్రా.. ఓపెనర్‌ కుసల్‌ పెరెరాను అవుట్‌ చేసి లంక పతనానికి నాంది పలికాడు. ఆ తర్వాత.. మన హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ లంకను చావు దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లో సిరాజ్‌ ఏకంగా 4 వికెట్లతో చెలరేగాడు. ఆ తర్వాత మరో రెండు వికెట్లు తీసి.. శ్రీలంక పతనాన్ని శాసించాడు. హార్దిక్‌ పాండ్యా సైతం మూడు వికెట్లతో రాణించడంతో లంక.. 15.2 ఓవర్లలో కేవలం 50 పరుగులకే ఆలౌట్‌ అయింది.

ఈ మ్యాచ్‌లో సిరాజ్‌ 7 ఓవర్లు వేసి కేవలం 21 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి.. తన కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. అయితే.. వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ఒక బౌలర్‌ అత్యధికంగా తీసిన వికెట్లు 8. అలాగే టీమిండియా తరఫున ఒక వన్డేలో సువర్ట్‌ బిన్నీ 6 వికెట్లు తీసి టాప్‌ బౌలర్‌గా ఉన్నాడు. అయితే.. బిన్నీ రికార్డు బ్రేక్‌ చేసి, వరల్డ్‌ రికార్డ్‌ను సమం చేసే గోల్డెన్‌ ఛాన్స్‌ సిరాజ్‌కు ఉంది. అతని చేతిలో ఇంకా మూడు ఓవర్లు ఉన్నాయి. కానీ, టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాత్రం.. 7 ఓవర్ల తర్వాత సిరాజ్‌కు బౌలింగ్‌ ఇవ్వలేదు. వెస్టిండీస్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో సిరాజ్‌ నాలుగు వరుస ఓవర్లలో 4 వికెట్లు తీసిన సమయంలో.. 5వ వికెట్‌ కోసం సిరాజ్‌తో 10 ఓవర్ల కోటా ఏకధాటిగా వేయించిన రోహిత్‌.. ఈ సారి మాత్రం అలా చేయలేదు.

దీంతో.. రోహిత్‌ శర్మ తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సిరాజ్‌తో మరో రెండు ఓవర్లు వేయించి ఉన్నా.. లేదు కనీసం 8వ ఓవర్‌ వేయించి ఉన్నా.. ఇంకో వికెట్‌ దక్కి ఉంటే.. టీమిండియా తరఫున ఒక వన్డేలో అత్యధిక వికెట్లు తీసిన అరుదైన రికార్డు సాధించే ఉండేవాడని, రోహిత్‌ బౌలింగ్‌ ఇవ్వకపోవడం తప్పని కొంతమంది అంటుంటే.. వరల్డ్‌ కప్‌ను దృష్టిలో పెట్టుకుని సిరాజ్‌ లాంటి కీ బౌలర్‌ను వికెట్లు పడుతున్నాయ్‌ కదా అని వరుసగా ఓవర్లు వేయించుకుంటూ పోతే.. అతను గాయపడే అవకాశం ఉందని మరికొంతమంది అంటున్నారు. ఈ రెండు వాదనల్లో నిజం లేకపోలేదు.

కాగా.. మ్యాచ్‌ తర్వాత టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సైతం ఈ విషయంపై స్పందించాడు. అద్భుతమైన రిథమ్‌లో ఉన్న సిరాజ్‌తో తాను కూడా మరికొన్ని ఓవర్లు వేయించాలని అనుకున్నట్లు తెలిపాడు. కానీ, సపోర్టింగ్‌ స్టాఫ్‌ నుంచి సిరాజ్‌తో ఇంకా ఓవర్లు వేయించొద్దని, అతను అలసిపోయే ప్రమాదం ఉందంటూ హెచ్చరికలు వచ్చాయి. దాంతో సిరాజ్‌ను 7వ ఓవర్‌ తర్వాత ఆపేశాను. కానీ, సిరాజ్‌ మాత్రం తన స్పెల్‌ను కొనసాగించేందుకు ఉత్సాహంగా ఉన్నాడు. కానీ, సపోర్టింగ్‌ స్టాఫ్‌ సూచనలతో బౌలింగ్‌ ఇవ్వలేదని రోహిత్‌ చెప్పుకోచ్చాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: చెడగొట్టాడు! ఇప్పుడేం చేయాలో సిరాజ్‌నే అడగాలి: శ్రద్ధా కపూర్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి