iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్‌: రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా క్రికెటర్‌!

  • Published Mar 05, 2024 | 6:20 PM Updated Updated Mar 05, 2024 | 6:20 PM

Shahbaz Nadeem Retirement: టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీమిండియా తరఫున తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన ఈ క్రికెటర్‌కు సరైన అవకాశాలు రాలేదు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Shahbaz Nadeem Retirement: టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీమిండియా తరఫున తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన ఈ క్రికెటర్‌కు సరైన అవకాశాలు రాలేదు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 05, 2024 | 6:20 PMUpdated Mar 05, 2024 | 6:20 PM
బ్రేకింగ్‌: రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా క్రికెటర్‌!

అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు భారత వెటరన్‌ క్రికెటర్‌ షాబాజ్‌ నదీమ్‌ వీడ్కోలు పలికాడు. 2019 అక్టోబర్‌ 19న సౌతాఫ్రికాతో జరిగిన 3వ టెస్టు మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన నదీమ్‌.. టీమిండియా రెండు టెస్టులు మాత్రమే ఆడాడు. తొలి మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లతో సత్తా చాటిన తర్వాత అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ, దేశవాళి క్రికెట్‌లో షాబాజ్‌ నదీమ్‌ ఒక సూపర్‌ స్టార్‌ బౌలర్‌. ముఖ్యంగా రంజీ ట్రోఫీలో జార్ఖండ్‌ జట్టులో కీలక ఆటగాడిగా చాలా కాలం పాటు కొనసాగాడు. 2015 నుంచి 2017 వరకు రెండు సీజన్లలో జార్ఖండ్‌ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఆ రెండు సీజన్లో 50కి పైగా వికెట్లు సాధించి సత్తా చాటాడు.

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన షాబాజ్ నదీమ్ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌. బీహార్‌ అండర్‌-14 టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. భారత అండర్‌ 19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. లెఫ్ట్‌ ఆర్మ్‌ స్లో స్పిన్‌ బౌలింగ్‌కు పేరుగాంచిన నదీమ్ అద్భుతమైన ఫీల్డర్ కూడా. 2015-16 రంజీ సీజన్‌లో 51 వికెట్లు పడగొట్టాడు. ఒక రంజీ సీజన్‌లో 50కి పైగా వికెట్లు సాధించిన ఆరోవ బౌలర్‌గా నదీమ్‌ చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత రంజీ సీజన్‌లో కూడా నదీమ్‌ 56 వికెట్లు సాధించి అదరగొట్టాడు. ఆ తర్వాత అతనికి టీమిండియాలో చోటు దక్కింది. ఇక ఐపీఎల్‌లో కూడా అదరగొట్టాడు నదీమ్‌. ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్ల తరఫున ఆడాడు.

ఐపీఎల్‌లో మొత్తం 72 మ్యాచ్‌లు ఆడిన నదీమ్‌ 48 వికెట్లు పడగొట్టాడు. ఓ మ్యాచ్‌లో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. బ్యాటర్ల హవా నడిచే ఐపీఎల్‌లో నదీమ్‌ ఎకానమీ 7.56గా ఉంది. ఇక బ్యాటింగ్‌లో మాత్రం నదీమ్‌ పెద్దగా రాణించలేదు. 72 మ్యాచ్‌ల్లో అతనికి 22 సార్లు బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చింది. అందులో 39 పరుగులు చేశాడు. ఇక టీమిండియా తరఫున 2 టెస్టులు మాత్రమే ఆడిన నదీమ్‌ 8 వికెట్లతో సత్తా చాటాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ నాలుగేసి వికెట్లు పడగొట్టాడు. మరి షాబాజ్‌ నదీమ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.