iDreamPost

ఆ విషయంలో షారుఖ్‌ ఖాన్ ఎప్పటికీ సక్సెస్‌ కాలేడు: గంభీర్‌

  • Published May 29, 2024 | 10:40 PMUpdated May 29, 2024 | 10:40 PM

KKR, Gautam Gambhir, Shahrukh Khan: కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ మెంటర్‌గా ఆ జట్టును ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో ఛాంపియన్‌గా నిలిపిన గంభీర్‌. ఆ జట్టు ఓనర్‌గా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అవేంటో ఇప్పుడు చూద్దాం..

KKR, Gautam Gambhir, Shahrukh Khan: కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ మెంటర్‌గా ఆ జట్టును ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో ఛాంపియన్‌గా నిలిపిన గంభీర్‌. ఆ జట్టు ఓనర్‌గా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published May 29, 2024 | 10:40 PMUpdated May 29, 2024 | 10:40 PM
ఆ విషయంలో షారుఖ్‌ ఖాన్ ఎప్పటికీ సక్సెస్‌ కాలేడు: గంభీర్‌

ఐపీఎల్‌ 2024లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ ఛాంపియన్‌గా నిలిచింది అంటే అందుకు చాలా మంది చెప్పే ప్రధాన కారణం గంభీర్‌. దాదాపు పదేళ్ల తర్వాత కేకేఆర్‌ ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచింది అంటే.. మెంటర్‌గా గౌతమ్‌ గంభీర్‌ ఎంతో ప్రభావం చూపించాడని అంతా బలంగా నమ్ముతున్నారు. అది వాస్తవం కూడా. ఎందుకంటే.. గంభీర్‌ రాకముందు కేకేఆర్‌, గంభీర మెంటర్‌గా వచ్చిన తర్వాత కేకేఆర్‌లో స్పష్టమైన తేడా కనిపించింది. తన కెప్టెన్సీలోనే 2012, 2014లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన గంభీర్‌.. ఈ ఏడాది మెంటర్‌గా కప్పు అందించాడు. గంభీర్‌ను మెంటర్‌గా ఏరికోరి తెచ్చుకున్నాడు ఆ జట్టు కో ఓనర్‌ షారుఖ్‌ ఖాన్‌. అయితే.. గంభీర్‌ మాత్రం షారుఖ్‌ ఖాన్‌ ఒక విషయంలో మాత్రం ఎప్పటికీ సక్సెస్‌ కాలేడు అని అంటున్నాడు. అదేంటో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..

ఐపీఎల్‌ 2024 ఫైనల్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ గెలిచిన తర్వాత.. కేకేఆర్‌ భారీగా సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్‌లో భాగంగా గౌతమ్‌ గంభీర్‌తో డ్యాన్స్‌ చేయించాలని షారుఖ్‌ ఖాన్‌ అనుకున్నాడు. ఆ విషయాన్ని టీమ్‌ మీటింగ్‌ సమయంలో కూడా చెప్పాడు. కానీ, ఆ విషయంలో షారుఖ్‌ ఖాన్‌ సక్సెస్‌ కాలేకపోయాడని, ఇప్పుడే కాదు ఎప్పటికీ ఆయన తనను డ్యాన్స్‌ చేయించే విషయంలో సక్సెస్‌ కాలేడని ఎందుకంటే.. తనకు డ్యాన్స్‌, పాటలు పాడటం రాదని తెలిపాడు గంభీర్‌. కేకేఆర్‌ జట్టులోని ప్రతి ప్లేయర్‌తో చాలా సరదాగా ఉంటే షారుఖ్‌.. కేకేఆర్‌ ఆడే ప్రతి మ్యాచ్‌కి వచ్చి జట్టును ఎంకరేజ్‌ చేసే వాడు. ఇక ఫైనల్‌లో కూడా కేకేఆర్‌ ఆయన ఫుల్‌ సపోర్ట్‌ను ఇచ్చారు.

ఇక ఫైనల్లో గెలిచి కేకేఆర్‌ ఛాంపియన్స్‌గా నిలవడంతో షారుఖ్‌ సంతోషానికి అంతే లేకుండా పోయింది. ఆ సంతోషంలోనే గంభీర్‌తో డ్యాన్స్‌తో చేయించాలని ఉందని అన్నారు. కానీ, గంభీర్‌ చివరి డ్యాన్స్‌ చేయలేదు. ఇదే విషయంపై గంభీర్‌ స్పందిస్తూ.. పైన చెప్పినట్లు పేర్కొన్నాడు. అయితే.. ఐపీఎల్‌ 2022, 2023 సీజన్స్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ‍మెంటర్‌గా వ్యవహరించిన గౌతమ్‌ గంభీర్‌ను.. పర్సనల్‌గా మాట్లాడి.. షారుఖ్‌ ఖాన్‌.. కేకేఆర్‌కు మెంటర్‌గా తీసుకొచ్చాడు. వచ్చీ రావడంతోనే కేకేఆర్‌కు కప్పు అందించాడు షారుఖ్‌ ఖాన్‌. మరి ఈ గంభీర్‌తో డ్యాన్స్‌ చేయించడంలో షారుఖ్‌ ఖాన్‌ విఫలం కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి