iDreamPost
android-app
ios-app

వీడియో: నిషేధానికి గురైనా బుద్ధి మార్చుకోని షారుఖ్‌! ఇప్పుడు ఈడెన్‌ గార్డెన్స్‌లో..

  • Published Mar 24, 2024 | 3:18 PM Updated Updated Mar 24, 2024 | 4:43 PM

Shah Rukh Khan, Eden Gardens: ఐపీఎల్‌ 2024లో భాగంగా కేకేఆర్‌ వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌ చూస్తూ.. స్టేడియంలో చేయకూడని పనిచేసిన షారుఖ్‌ ఖాన్‌! దీంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ షారుఖ్‌ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

Shah Rukh Khan, Eden Gardens: ఐపీఎల్‌ 2024లో భాగంగా కేకేఆర్‌ వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌ చూస్తూ.. స్టేడియంలో చేయకూడని పనిచేసిన షారుఖ్‌ ఖాన్‌! దీంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ షారుఖ్‌ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 24, 2024 | 3:18 PMUpdated Mar 24, 2024 | 4:43 PM
వీడియో: నిషేధానికి గురైనా బుద్ధి మార్చుకోని షారుఖ్‌! ఇప్పుడు ఈడెన్‌ గార్డెన్స్‌లో..

బాలివుడ్‌ సూపర్‌ స్టార్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌.. ఐపీఎల్‌ సందర్భంగా పలు వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటాడు. ఐపీఎల్‌లో రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ జట్టుకు అతను కో ఓవర్‌ అనే విషయం తెలిసిందే. ఐపీఎల్‌ ఆరంభం నుంచి కేకేఆర్‌ టీమ్‌ను తన స్టార్‌డమ్‌ను జత చేస్తూ వస్తున్నాడు. అయితే.. ఐపీఎల్‌లో కేకేఆర్‌ ఆడే చాలా మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసేందుకు స్టేడియానికి వస్తుంటాడు షారుఖ్‌. శనివారం ఐపీఎల్‌ 2024లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ చూసేందుకు కూడా ఎస్‌ఆర్‌కే కోల్‌కత్తాలోని ఈడెన్‌ గార్డెన్స్‌కు వచ్చాడు. ఈ సందర్భంగా మరో వివాదంలో చిక్కుకున్నాడు.

స్టేడియంలో మ్యాచ్‌ చూస్తూ.. సిగరేట్‌ తాగుతూ కెమెరా కంటికి చిక్కాడు. ఇదే ఇప్పడు తీవ్ర దుమారం రేపుతోంది. ఇండియాలోని అన్ని క్రికెట్‌ స్టేడియాల్లో కూడా పొగతాగడం నిషేధం. కానీ, షారుఖ్‌ ఖాన్‌ మాత్రం శనివారం ఈడెన్‌ గార్డెన్స్‌లో సిగరేట్‌ తాగుతూ కనిపించాడు. అతను సిగరేట్‌ తాగుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. దీంతో.. షారుఖ్‌పై బీసీసీఐ చర్యలు తీసుకుంటుందా? అనే చర్య మొదలైంది. అయితే.. ఇలా నిషేధాల విషయం షారుఖ్‌కు కొత్తేం కాదు. ఈ ఘనుడు గతంలో కూడా ఒక స్టేడియంలోకి అడుగుపెట్టకుండా.. ఏకంగా ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. కానీ, దాన్ని మూడేళ్ల తర్వాత ఎత్తేశారు.

ఐపీఎల్‌ 2012 సందర్భంగా గ్రౌండ్‌లోని సెక్యూరిటీపై అకారణంగా గొడవకు దిగిన కారణంగా షారుఖ్‌ ఖాన్‌పై ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ ఐదేళ్ల పాటు వాంఖడే క్రికెట్‌ స్టేడియంలోకి అడుగుపెట్టకుండా నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని మూడేళ్ల తర్వాత తొలగించారు. ఆ మూడేళ్లు ఐపీఎల్‌లో ముంబైలోని వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లకు షారుఖ్‌ ఖాన్‌ హాజరు కాలేకపోయాడు. ఆ నిషేధాన్ని మర్చిపోయిన షారుఖ్‌ ఖాన్‌ తాజాగా నిబంధనలు అతిక్రమించి.. స్టేడియంలో సిగరేట్‌ తాగాడు. మరి ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మరి స్టేడియంలో షారుఖ్‌ ఖాన్‌ సిగరేట్‌ తాగడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.